18, నవంబర్ 2007, ఆదివారం

సాగర తీరాన...

సాగర తీరాన నే ఎదురుచూసిన నా మరుమల్లి రాక...మూగబోయిన నా మనసుకు మాటలు నేర్పెనే....!
శిశిరపు చల్ల గాలికి నడయాడే నీ ముంగురుల నాట్యం.. ఎగసిపడే అలల సవ్వడి తొ జతకట్టెనే..!
సడి చేసే నీ గాజుల గలగలల శబ్ధా రావం...మది లో కోటి అలల స్వరాలను మీటెనే…...!
రెప రెపలాడే నీ పైట కొంగు తాకిడి...రాకుడని కొత్త ఆలొచనలను రగిలించెనే...!
ఘల్లు ఘల్లుమనే నీ కాలి మువ్వల సవ్వడి...ఝల్లుమంటూ నా హౄదయాంతరంగాలలో సుప్రభాతం పాడెనే...!
మెరిసే నీ అధరాల మధురామౄతం..విరిసే నా చిలిపి దరహాసానికి స్వాగతం పలికెనే...

17, నవంబర్ 2007, శనివారం

అమ్మాయంటే...???

పట్టుకుంటే కందిపోయేమల్లెపూవులా... ముట్టుకుంటే ముడుచుకుఫొయే ముద్ధబంతిలా..

కల్లతొనే భావాలు పలికించే..పడతిలా...చిరునగవుతో సరాగాలు పాడే..సారంగిలా..

నవ్వుతూ నవ్విస్తూ తన సంసారాన్ని సారవంతం చేసుకొనే సహధర్మచారిణిలా...

అందం,అణకువ తో భర్తకు చేదోడు వాదోడుగా వుండే ప్రణయ దేవతలా..

పుట్టింటి పరువును నిలబెట్టుతూ మెట్టింటి గౌరవం కాపాడే కల్ప వల్లిలా..

కట్టుకున్న భర్తను,కన్నబిడ్డల్ని మురిపించి మైమరపించే మాతౄమూర్తిలా..

అత్త మామలను అయినవారిని ఆదుకొనే ఆడపడుచులా...వెరసి పరిపూర్ణ స్త్రీ మూర్తి లా..
మనోగతం..

మనసులో రేగిన భావోద్వేగపు అలజడులు ఆ మనిషి ని ఎంతగా ప్రభావితం చేస్తాయో అనే విషయానికి సంభందించి ఒక్కో మనిషి ఓక్కో తీరుగా స్పందించవచ్చు.అలాగే నాకు అనుభవం కల్గించిన కొన్ని వాస్తవ సంఘటనలను ఇక్కడ పొందుపరచాలనుకుంటున్నాను.
నాకు బాగా గుర్తు అది నేను రెండవ తరగతి చదువుతున్న రోజులు.మా నాన్న గారు డ్రిల్ల్ మాస్టారు గా పని చేసే పాఠశాల కు వారానికి రెండు లేదా మూడు మార్లు సాయంత్రం కాగానే వెల్లేవాడిని.మా నాన్న తన friends తొటి ball badminton ఆడేవారు.నేను బాల్ అందిస్తూ వుండేవాడిని.అలాగే ఆ రోజు evening కాస్తా early గా వెల్లాను.ఇంకా school నడుస్తుంది.మా నాన్నగారు ఎక్కడున్నారో అని తరగతుల ముందు చూస్తూ వెల్తున్నా.'ఓరే ఇలా రా' అని ఓ సార్ తన class లోకి పిలిచాడు.లోనికి భయం భయం గా వెల్లాగానే నన్ను రెండు చేతుల్తో ఎత్తి dias మీద వుండే బెంచ్ పై నిలబెట్టాడు.నాకు అర్థం కాలేదు.ఎదురుగా చుస్తె అందరు అజానుబహుల్లా వున్నారు.వారందరిని ఆ సార్ ఎందుకు నిలబెట్టాడబ్బా అని అనుకుంటుండగనే 'ఒరే 19 వ ఎక్కం చెప్పరా అన్నాడూ .గుక్క తిప్పుకోకుండా గడ గడ చెప్పేసా.సిగ్గు లేదురా మీకు 10 వ తరగతి చదువుతున్నారు వీడు చూడండిరా కేవలం రెండవ తరగతి అని వాల్లకు claas పీకాడం ఇప్పటికీ గుర్తే.అప్పుడర్థమైంది నాకు 'ఓహో వీల్లెవరూ 19 వ ఎక్కం చెప్పలేకపోయారా? అని.వెంటనే ఆ సార్ నాకు ఓ పావలా ఇచ్చి శభాష్ అన్నాడు. ఆ పావలా తీసికెల్లి మా అమ్మకి ఇచ్చి విషయం అంతా చెప్పగానే ... ఓ భలే పొంగి పోయిందిలే..అప్పుడు చూడాలి ఈ చందురిడి కల్లల్లో అనందం...ఇండియాని పాకిస్తాన్ పై ఒంటి చేత్తో గెలిపించినంతగా....


13, నవంబర్ 2007, మంగళవారం

విరహ వేదన...


వివాహమనంతరం విదేశానికెల్లిన తన మగనికి ఓ మగువ రాసిన ఉత్తరం..చదవండి ఇక..


ఎన్నాల్లు మనకీ ఎడబాటు...వేగిరమే చేయు మిము చేరే ఏర్పాటు..
విధిరాతతో విడివడడం గ్రహపాటు..వీడలేక విలపించడం పొరపాటు
తమనుండి ఫొను వస్తే తత్తరపాటు...మౌనంగా నోట మాట రాక తడబాటు
ఎంత మాటాడినా తనివితీరని ఈ హ్రుదయపాటు మాటల గారడితో చేసేరు మరిచేట్టు
సహజీవనములో మీ తోడ్పాటు...మరవలేకున్నా రెప్పపాటు..
అయినవాల్లు అందరూ వున్నా ..ఎవరూ లేనట్టు .....చుట్టూ చుట్టాలున్నా నాకు ఏమీ కానట్టు ఏమిటీ కనికట్టు...? ఇపుడిపుడే అవగతమైనది మీరు లేని లోటు
మీరు లేని నా లోకము చీకటైనట్టు...దీపపు చిమ్మె ముందు మీ కోసం ఎదురుచూస్తున్నట్టు..
మధురమైన మన తలపులను తలచేట్టు జీవిస్తున్నా ఇక తప్పదన్నట్టు..
కాలేజి రోజుల్లో నేనో స్టూడెంటు టీనేజి మోజుల్లో మీరో హీరో అన్నట్టు..
ఓరకంట చూసేవారు..వలపు పంట పండించేవారు
చిరునవ్వులు చిందించేవారు..చివరికి అయ్యారు మా శ్రీవారు
భలే జోరు మీద వుండేవారు హుషారులో చేసేరు బేజారు
పైకెంతో చల్లని వారు తమరెంతో అల్లరివారు…
నా మనసునే దోచినారు ఈ వయసును మెచ్చినారు..
చల్లని పందిట్లో కలిసేరు వెచ్చని కౌగిట్లో మురిసేరు
సరసమందు మొరటు వారు విరసమందు బెటరు మీరు
మచ్చ లేని మనిషి మీరు నచ్చ లేని మనిషి లేరు
కల్లకపటమెరగనోరు..కరుణామౄతం కురిపించేరు
యదువంశములోన ఎవరు సాటిలేరు మీకెవ్వరు..

12, నవంబర్ 2007, సోమవారం

పరాన్న జీవులు

ఎన్నేల్లుగానో వున్న కోరిక ఎండ మావిలా అయ్యింది H1 రాక..
వచ్చాక ఆనందం పట్టలేక మందు కొట్టా స్టాంపింగ్ అయ్యాక..
ఇలాంటి బాధలు వుంటాయని తెలియక వచ్చా అమెరికా..
ఎవరికి ఏమని ఎలా..చెప్పాలో తెలియక రాశా ఈ తవిక..
బ్రతుకుదెరువు కోసం వచ్చిన బడిపంతుల కొడుకా కష్టాల కడలిలో సేదదీరిక..
ఊద్యోగాన్వేషణలో వూపిరాడక ఎదురుచూస్తున్న SSN రాక..
దేశీల కష్టార్జితం వెనుక దేశీ కన్సల్టంట్స్ ల ధనార్జితపు కోరిక..
పనిచేసే మనిషికి తన ప్రతి పైసా చేతికి రాక తన లక్ష్యం చేరలేక..
తనవారిని చేరుకోలేక చేస్తున్నాడీ ఊడిగం చేతకాక..
ఆవేశం అణచుకోలేక ఆక్రోషం ఆపుకోలేక ఆలోచనలో పడ్డాడు ఎవరు ఆదుకోక..
ఈ పరాన్న జీవుల కోరలు తీయడానికై ఝులిపించాలి కొరడాలిక..
దేశీ కన్సల్టంట్స్ ల మోసాలు విదేశీల instant సరసాలు ఎందుకీ జీవితాలు?
అనుకుంటూ నింగిలోని చంద్రుడిని చూడలేక ఆలోచిస్తున్నాడీ చందురుడు నిదుర రాక...