9, అక్టోబర్ 2009, శుక్రవారం

కర్నూలు

కర్నూలు జీవులు కాకావికలమైన జనులు..

ప్రకౄతి కోపాలు ప్రజలకు సంకెళ్ళూ..

తల్లడిల్లిన హ్రుదయాలు తలక్రిందులైన బతుకులు

నోరులేని జీవాలు వూరూర విగత జీవులైన వైనాలు


వడి వడిగా వచ్చిన వరదలు వూపిరైనా తీసుకోనివ్వని ఉప్పెనలు ..

వురుకులు పరుగులతో జనాలు చెట్టుకో పుట్టకో చేరినోల్లు..

గూడు చెదిరినోల్లు..గుండె కరిగినోల్లు..

హాహాకారాలతో మొదలు.. అనంతలోకాలకు పయనాలు ..


కూలిన మిద్దెలు, మిద్దెలనెక్కిన పెద్దలు, పెద్దల భుజాన పిల్లలు


దిక్కులేని పేదలు కూలిన గుడిసెలు..

కల్లముందే కనుమరుగై పోతున్న కన్నోల్లు..కన్నీల్లు కరువైన కళ్ళు కదలలేని కాల్లు..
కరిగే మనసులు కాపాడే దైవాలు..

సాయం కోసం చూస్తున్న ఎదురు చూపులు.. చేయూతనివ్వాలి ఎన్నారైలు ..
చంద్రశేఖర్

2, ఏప్రిల్ 2009, గురువారం

అమ్మ మాట

కన్న బిడ్డ కానరాని దేశమెలితే కన్న తల్లిని కన్న భూమి ని మరచిన ఓ ప్రవాసుడి అమ్మ బాధ..

నోట అక్షర ముక్క అయిన నోచుకోని పల్లె లోన ఇంగిలీసు చదువుతుంటేరో..

నా కొడుకో బంగారు తండ్రీ ...నీవు అమెరికాకు ఎల్లిపోతివిరో..
తొడు లేక నీడ లేక మాటాడే మనిషి లేక...
కన్నోడిని చూడలేక కన్నీటిని తుడవలేక.
కన్నతీపి కలలు కంటుందో నా కొడుకో బంగారు తండ్రీ కడసారి వచ్చి పోరాదా..
ఆలు బిడ్డలతోటి వచ్చి అమ్మ గుండె ను తట్టి లేపి
పట్టేడన్నము చేసి పెట్టి అమ్మ నోట తినిపించి
చివరి కోరిక తీర్చి పోరాదా నా కొడుకో బంగారు తండ్రీ కోన ప్రాణం ఎపుడు పోతుందో....కోన ప్రాణం ఎపుడు......

29, మార్చి 2009, ఆదివారం

చంద్రబాబు - రాజశేఖర్ రెడ్డి

చంద్ర బాబు

నందమూరి అల్లుడు నాయుడు బాబు ..
మామ నే ముంచాడు మాయదారి బాబు..
అధికార దాహం తో వెన్నుపోటు పొడిచి ..
అందలం ఎక్కాడు నోట్ల కట్టలు పరచి..
హాయ్ టేక్ పాలనంటు రైతుల్ని మరచి..
కిలో బియ్యం పధకంలో పేదల్నిముంచి..
నక్సల్ తో చర్చలంటు చేయి చేయి కలిపి..
జన్మభూమి పేరుతొ జనాలను కదిపి..
కరువు కాటకాలతో కర్శకుల్ని కుదిపి..
శ్రమదాన సాకుతో దోపిడీలు జరిపి..
కులం కులం పేరుతొ కల్మషాలు రేపి..
లేని పోనీ హామీల అల్ ఫ్రీ బాబు..
ఆక్సిడెంటు అయ్యాడు అలిపిరి బాబు..
నట్టేట ముంచాడు నాయుడు బాబు..

వై యస్ రాజశేఖర్ రెడ్డి
ఇట్టాంటి సమయాన ఎలచ్చన్లు వచ్చెనే..
పాదయాత్ర పేరుతొ ప్రజల్లో కలిసేనే..
కష్ట సుఖాలన్నీ కంటితో చూసేనే..
రైతు బాధలన్ని రైతుగా కాన్చేనే..
దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దింపి నిలిచేనే..
రాజకీయ రంగంలో రారాజై వేలిసేనే..
వర్షాల వరుణుడు వర్షించి కురిసేనే..
పుడమి తల్లి నేల పొంగి పైరులన్ని విరిసేనే..
రాజన్న రాజ్యంలో రాసులుగా పోసెనే
రైతన్న రాజ్యమింక రామ రాజ్యమాఎనే..