29, మార్చి 2009, ఆదివారం

చంద్రబాబు - రాజశేఖర్ రెడ్డి

చంద్ర బాబు

నందమూరి అల్లుడు నాయుడు బాబు ..
మామ నే ముంచాడు మాయదారి బాబు..
అధికార దాహం తో వెన్నుపోటు పొడిచి ..
అందలం ఎక్కాడు నోట్ల కట్టలు పరచి..
హాయ్ టేక్ పాలనంటు రైతుల్ని మరచి..
కిలో బియ్యం పధకంలో పేదల్నిముంచి..
నక్సల్ తో చర్చలంటు చేయి చేయి కలిపి..
జన్మభూమి పేరుతొ జనాలను కదిపి..
కరువు కాటకాలతో కర్శకుల్ని కుదిపి..
శ్రమదాన సాకుతో దోపిడీలు జరిపి..
కులం కులం పేరుతొ కల్మషాలు రేపి..
లేని పోనీ హామీల అల్ ఫ్రీ బాబు..
ఆక్సిడెంటు అయ్యాడు అలిపిరి బాబు..
నట్టేట ముంచాడు నాయుడు బాబు..

వై యస్ రాజశేఖర్ రెడ్డి
ఇట్టాంటి సమయాన ఎలచ్చన్లు వచ్చెనే..
పాదయాత్ర పేరుతొ ప్రజల్లో కలిసేనే..
కష్ట సుఖాలన్నీ కంటితో చూసేనే..
రైతు బాధలన్ని రైతుగా కాన్చేనే..
దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దింపి నిలిచేనే..
రాజకీయ రంగంలో రారాజై వేలిసేనే..
వర్షాల వరుణుడు వర్షించి కురిసేనే..
పుడమి తల్లి నేల పొంగి పైరులన్ని విరిసేనే..
రాజన్న రాజ్యంలో రాసులుగా పోసెనే
రైతన్న రాజ్యమింక రామ రాజ్యమాఎనే..