9, అక్టోబర్ 2009, శుక్రవారం

కర్నూలు

కర్నూలు జీవులు కాకావికలమైన జనులు..

ప్రకౄతి కోపాలు ప్రజలకు సంకెళ్ళూ..

తల్లడిల్లిన హ్రుదయాలు తలక్రిందులైన బతుకులు

నోరులేని జీవాలు వూరూర విగత జీవులైన వైనాలు


వడి వడిగా వచ్చిన వరదలు వూపిరైనా తీసుకోనివ్వని ఉప్పెనలు ..

వురుకులు పరుగులతో జనాలు చెట్టుకో పుట్టకో చేరినోల్లు..

గూడు చెదిరినోల్లు..గుండె కరిగినోల్లు..

హాహాకారాలతో మొదలు.. అనంతలోకాలకు పయనాలు ..


కూలిన మిద్దెలు, మిద్దెలనెక్కిన పెద్దలు, పెద్దల భుజాన పిల్లలు


దిక్కులేని పేదలు కూలిన గుడిసెలు..

కల్లముందే కనుమరుగై పోతున్న కన్నోల్లు..కన్నీల్లు కరువైన కళ్ళు కదలలేని కాల్లు..
కరిగే మనసులు కాపాడే దైవాలు..

సాయం కోసం చూస్తున్న ఎదురు చూపులు.. చేయూతనివ్వాలి ఎన్నారైలు ..
చంద్రశేఖర్