19, ఏప్రిల్ 2010, సోమవారం

మీ స్నేహం...

నిత్యం మీతో మాటాడ్డం
నాలో ఎనలేని ఉత్సాహం
మాట మాట కు నవ్వుకోడం
పూట పూట తలచుకోడం
ఆట పాట ల అనుభవం
ఎన్నో వూసులు చెప్పుకోడం
మరెన్నో కుల్లు జోకులు పేల్చడం
కష్టాల్లో ఒకరినొకరు ఆదుకోడం
ఇష్ట సఖులను ఆరాధించడం
తమ వాల్లకు అసరాగా నిలవడం
కాని వాల్ల ను కూడా అభిమానించడం
ఒకడికేమో అమాయకత్వం
మరోకడికేమో దయాగుణం
ఇంకొకడికేమో మంచితనం
కలిసి వున్న ఈ ముగ్గురి స్నేహం
నిలవాలి మరెంతో కాలం..