20, డిసెంబర్ 2011, మంగళవారం

ఓణీ పండుగ

కన్నుల పండుగ స్నేహ ఓణీ పండుగ
తల్లి అరుణ అండగ ..తండ్రి G V ఉండగ.. తమ్ముడు సాకేత్ తోడుగ
చూడ చక్కని కనులు నిండు బంగరు నగలు
కనుబొమ్మల నడుమ విరిసిన నెలవంక
చిరునవ్వున వెలసిన చంద్రవంక
సింగారింపుల ఈ చిట్టి గువ్వ సందడి చేసె తన కాలి మువ్వ
పాపిట నందు విరజిమ్ము పసిడి సింధూరం
నడుమునందు నడయాడు వన్నె తెచ్చిన వడ్డాణం
నల్ల త్రాచును మించిన తన వాలుజడ కుచ్చుల వయ్యారం చిత్రించ
వల్ల కాదని వగచె వర్మ చేతి కుంచెల డొల్లతనం
మెడలో వెలిసిన ముత్యాలు తలలో విరిసిన పుష్పాలు
సిగలో చేరామన్న సువాసన భరిత మల్లె పూల దర్పం
అంతటి భాగ్యానికి నోచుకోలేదన్న తొటి మల్లెల బుంగమూతి వైనం
అంతలోనే విచ్చేసిన తరుణీమణుల సిగల్లో దోబూచులాడుతున్నామన్న తమ దరహాసం
ఓ వైపు మల్లెల సువాసనతో మగువల మనసులు
మత్తెక్కిన చూపులతో తమ మగవారి ఓరచూపులు,
మరోవైపు పంచభక్షాలను మరిపించేటి తినుబండారాలు
వెరసి మురిపించారు గాదె వంశ వర్గీయులు ..

7, డిసెంబర్ 2011, బుధవారం

ధూమపానం..

ఎంత వలదన్నా వినదీ పాడు మనసు

పదే పదే కావలంటుంది వచ్చాక ఓ వయసు

పని వత్తిడిలో చురుకుగా ఉండాలన్న తలంపు

అంతలోనే తోటి స్నేహితుడి నుండి బయటకు పిలుపు

వెనువెంటనే ఆ”పని” కొరకు తడుతుంది మది తలుపు

ఆ కొద్ది క్షణాలు నిగ్రహించుకోలేని ఓర్పు

ఆస్వాదిస్తూ అంబరినంటే విరజిమ్మిన ఆ తెలుపు

కాయమును కాటికి తీసికెల్లేటి ఆకారు నలుపు

కాలగమనంలో ఒక్కో అవయవం రూపు మాపు

పని కాగానె అదో తీయనైన అలుపు

ఇది నీ జీవనగమనంలో నీకు తెలియని మలుపు

పిదప జీవిత విచ్చిన్న దశకు చేరువవుతున్నానేమోనన్న నిట్టూర్పు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఆ పై పెదవి విరుపు

నేటికైననూ మించినది లేదు చివరకు

కావాలి కనువిప్పు ..కనుమరుగవ్వాలి ఆ తప్పు

నీకు నీవే నీకై ఇచ్చుకునే తీర్పు ..రావాలి నీలో మార్పు..

విరమించు ధూమపానం.. విహరించు ఇక స్వర్గధామం

2, నవంబర్ 2011, బుధవారం

పుట్టిన రోజు శుభాకాంక్షలు..

మండుటెండలని మరిపించే చల్లని ఆ జాబిల్లి
దిగి వచ్చి పెదవి గిల్లి ఏది నీ బొసినవ్వు అని అడుగ
చిరునగుమోమున చిన్నారి చిరునవ్వులు చిందివ్వగా
విరిసిన నవ్వున విరితేనె జడివానై కురవగా తీయగా
పులకించిన పుడమి తల్లి ఈ జాబిలి ని దీవించగా
ఉల్లాసం ఉప్పొంగె బిందు నరేన్ ల మది నిండుగా..

ప్రేమతో,

జాబిలి పుట్టిన రోజు శుభాకాంక్షలు
కాటుబోయిన చంద్ర

26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి శుభాకాంక్షలతో..

కరకుడైన నరకుడిని వధించి దిశదిశలా జరిపుకునే దీపావలి
కారకుడైన కారణజన్ముడికివే కరములు జోడిస్తూ కావించు నివాళి
చిన్న పెద్దా తారతమ్యాలు లేకుండా సంబరంగా జరుపుకొనే దివాలి
కరిగిపొయే కాకరొత్తులు,చెదిరిపోయే కాగితపు ముక్కలు,
పడగవిప్పే పాము బిల్లలు,సుడులు తిరుగే భూ చక్రాలు
అచ్చెరువొందే చిచ్చుబుడ్లు,నింగికెగసే రాకెట్లు ,
దిక్కులు పిక్కటిల్లే బాణసంచా ధ్వనులు ,మేఘాల దరిజేరు తారాజువ్వలు
చిటపటలాడే పటాసుల సరాలు మణిమయ కాంతి మతాబులు
వంటివి ఎన్నో ఎన్నెన్నో వాటికి వున్నాం కడుదూరం..
దీపావళి అనుభూతిని అనుభవించలేని రూపాయి అవిటితనం
కానీ మన మనసులు మాత్రం వీటికి అతి సమీపం..
తగదు డాలర్ల మోజు ఎల్లవేలలా ..తగ్గదు దలార్ల(consultants)ఫోజు అన్నివేళలా
క్షణక్షణం వీసాల గోల అనుక్షణం H1Bల లీల
పచ్చ కార్డుల కై కొందరి బెంగ పౌరసత్వంకై మరికొందరి బెంగ
ప్రాజెక్టులకై కొందరి నిరీక్షణ నిలకడకై మరి కొందరి నిరసన
లాంటి చిత్ర విచిత్ర సమస్యల వలయంలో ఎన్నొ ఎన్నెన్నో..

సమస్యల నుండి
భారతీయులందరూ బయటపడి స్వేచ్చగా ఆనంద జీవితం గడపాలని మనసారా ఆకాంక్షిస్తూ

దీపావళి శుభాకాంక్షలతో..

-చంద్ర

30, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగుదనం..!!

ధరిత్రి మరవని చరిత్ర మన తెలుగుదనం...
జగతి తెలుగు జాతికి అందించిన మూల ధనం ..
శతాభ్దాల తెలుగు జాతి గొప్పతనం..
కవిత్రయమందించిన మధుర కావ్యం..
వెన్నెల చల్లదనం, సూరీడు వెచ్చదనం ,తేనె తీపి తెలుగుదనం
వెలకట్టలేనివన్నది కాదనలేని నగ్న సత్యం ..
అలాంటి తెలుగు తల్లి గడ్డన నేడు ..
రావణకాష్టం రగిలిస్తున్న రాజకీయ రాబందులను
అడుగడుగున తెలుగు తల్లిని అవమానిస్తున్న వేర్పాటు వాదులను..
ఆ తల్లి వలువలు వలిచి విలువలు విడిచి సిగ్గుతో తలదించుకొనేట్టు చేసిన తార్చుడుగాల్లను
తెలుగు ఆత్మ గౌరవాన్ని ఆయకమొనర్చే అరాచక కీచకులను
విచక్షణ ఙ్ఞానరహిత వితండవాదుల విగ్రహాల విధ్వంసాలను..
ఉద్యమాల పేర దమన నీతులు వల్లిస్తున్న నయవంచక నేతలను...
నేతల చేతిలో బతుకు బండగా మారి బలైపోతున్న బడుగు ప్రజల బాధలను..
బూటకపు మాటలతో నోట్ల కట్టల మూటలతో నిర్వీర్యం చేసిన యువతను
దగాకోరుమాటలతో దళారి చేతలలో దగాపడ్డ విద్యాకుసుమాలను..
"మా తెలుగు తల్లి" పాఠ్యాంశాన్ని పరిత్యజించమంటున్న పాలకులను…………… ,
కాంచిన తెలుగు తల్లి కన్నీరవ్వగా..తడి ఆరని కళ్ళతో భారత మాత ..కన్నీరు తుడవగా..
మురిసిన తెలుగు తల్లి తడిసిన కనులతో ముసి ముసి నవ్వులతో
భరతమాత ఒడిలో సేదదీరి తన నుదుట చుంబించిన "సమైక్య" పు ముద్దుతో
అంధ్రా(AP)ప్రజల గుండెల్లొ అజరామరం నిలిచింది..తెలుగుజాతి యావత్తు పులకించింది ..

2, ఆగస్టు 2011, మంగళవారం

ఉగాది

తెలుగుదనపు తియ్యని రుచుల పండుగ ఉగాది
దేశ దేశానా తెలుగు వెలుగులు విరజిమ్మే మహోన్నత తరుణమిది
"ఏదేశ మేగినా ఎందుకాలిడినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీజాతి నిండు గౌరవము" అన్న నాటి నానుడి
నేడు"ఏదేశమేగినా ఎందుకాలిడినా..కులగజ్జిని విడవకురా..భూ భారతిని విడిచినన్.."
నిలపరా నీ కులము మానవతా విలువలు దిగజారినన్..."
అన్న
కులమతాల పట్టింపుల చెంచాగాల్లను చెయ్యాలి సమాధి..నేటి ఈ శ్రీ కర నామ సంవత్సర ఊగాది..

ప్రాస కవిత ..

తెలిగింటి దీపిక పొరుగింట్లో చేరిక
పరికినీలో ఆ చిలుక పరువాలు తెరవెనుక
వర్షం లొ చూశాక వశము తప్పె మనసు అదుపులేక
సరిహద్దులు మీరక ముద్దు ఆలోచన నేరక
చూపుల రువ్వుల వేడుక పెదవుల నవ్వులు వీడక
ఎదురుపడితే ఎరుగక ఎవడో అన్నట్టు చూశాక
నన్ను నేను మరిచాక నన్ను నువ్వు యేమార్చక
రేయనక పగలనక వేచియుంటా కడదాక
నా హ్రుదయమే నీకు వేదిక అహర్నిశలు నీకై వెదికా
కలిసొచ్చె కాలమిక కరుణించు మన కలయిక
మనువంటే కోరిక మనసుంటే తెలుపిక
నీవు లేని జీవితమిక నీరులేని జీవన నౌక
కాదంటే తగదిక తాంబూలాల తరుణమిక
అచ్చు వేద్దాం పెండ్లి పత్రిక భావి ప్రేమికులకు మనం ఓ ప్రతీక
లేదంటే తీరిక మార్చలేను నీ తీరిక..మరణమే నాకు శరణమిక ..

22, జులై 2011, శుక్రవారం

యువనేత..!

కడప ఎన్నికల సంధర్భంగా అప్పట్లో రాసిన పదాల సమూహం ఈ కవిత..

ఎదురు లేదు మనవాడికి బెదురు లేదు తనవారికి
కుదురు లేదు పగవారికి ముదురు కాడు రాజకీయాలకి
ఒంటరివాడు అధిష్ఠానానికి..అందరివాడు ఆంధ్రావారికి
మాట తప్పడు ఇచ్చిన మాటకి..మడమ తిప్పడు అడిగిన దానికి
వెన్ను చూపడు వైరి వర్గానికి..వెనుకంజ లేదు కాలు దువ్వడానికి
ఎదురొడ్డి నిలిచాడు ఎలక్షన్లకి.. కడప రెడ్డి కదిలాడు వోట్ల కలెక్షన్లకి
చుట్టూముట్టిన మంత్రివర్యులందరికి.. ముచ్చెమటలు పట్టె వై యెస్ ధాటికి
సినీ గ్లామరు చిరుకి.. చింతకాయలు రాలవని తెలియజెప్పె చివరికి
వారి నోట్ల కట్టల మూటలకి.. వోట్లు వేసె మన యువనేత మాటలకి..
బీరాలు పలికిన హీరోల డప్పుకి.. వరాలు గుప్పించిన గారాల విదేశీకి,
వివేకమడుగంటిన బంధు రాబందుకి..బృహన్నలను మరిపించిన రవీంద్రుడికి..
గుణపాఠం ఈ కడప తీరుకి , కడపటి తీర్పుకి ..

21, జులై 2011, గురువారం

నేనే నీవైతే..

నడి వంపుల నడయాడు నిండు గోదారి నీవైతే..
నిను నాలో కలుపుకొనే కడలి కెరటమవుతా..
ఉవ్వెత్తున ఎగసిపడే అలల సవ్వడి నీవైతే..
ఎలుగెత్తి చాటే నడిసంద్రపు హోరు నవుతా..
కారు చీకట్లు కమ్మిన మబ్బుల్లో దీపం నీవైతే..
దీపం చుట్టూ ముసిరిన మిణుగురు పురుగును అవుతా..
నిండు చల్లని పున్నమి జాబిలి నీవైతే..
పిండి ఆరబోసిన పండు వెన్నెల నేనవుతా.
నల్లని కురుల సొగసు వాలు జడ నీవైతే..
జడన తురిమిన జాజి పువ్వును నేనవుతా ..
అందెలు విసిరిన మువ్వల సందడి నీవైతే..
కందిన నీ కాలి సిరి మువ్వ గజ్జెనవుతా ..
పారే సెలయేటిన పాడే పాటవు నీవైతే..
పాటలోని పదముగా ఒదిగి పొదిగే అక్షరమవుతా..
ప్రపంచాన్ని సృష్టించే ప్రకృతి నీవైతే..
ప్రకృతికి ఊపిరినిచ్చే నీ ఆయువు శ్వాసనవుతా..

-- చంద్ర

14, జనవరి 2011, శుక్రవారం

సంక్రాంతి శుభాకాంక్షలతో..

కల కలలాడే పచ్చదనపు పల్లెటూల్లు
పండిన ధాన్యాలు చేతికొచ్చిన రైతన్నలు

పనిచేసిన బసవన్నలను పలకరించే పుష్పాలు
పాడిచ్చే పసువులను అలరించే పసుపు కుంకుమలు

కనుల ముందు కనువిందు చేయు కన్నెపిల్లల గొబ్బిల్లు
పెందలాడే అందమైన ముంగిట చల్లే పెన్నీల్లు

ముస్తాబైన ముంగిట ముందు ముత్యాల ముగ్గులు
ముగ్గుల మధ్య మణులను మరిపించే మల్లె మొగ్గలు

ఇంటిముందు పాటలతో అలరించే హరిదాసు ముచ్చట్లు
ఇంటింట పాకాలతో నోరూరించే అమ్మమ్మ బొప్పట్లు

కొంటె కోడళ్ళు కొత్త అల్లుళ్ళతో తిరనాళ్ళు
వెలిగే భోగి మంటలు రగిలే యువ జంటలు
తీరని తీపి కోరికలు ఆరని వలపు మంటలు

అలక తీరిన అల్లుళ్ళు అత్తా మామల అగచాట్లు
మరదళ్ళ కవ్వింతలు బావల వెక్కిరింతలు
పరికిణీలో పడతులు పరిణయ ఘడియకై ఎదురు చూపులు

పల్లె అందాలు..... కోళ్ళ పందాలు
పలకరించే బంధాలు నేటి సరికొత్త సంక్రాంతులు

సంక్రాంతి శుభాకాంక్షలతో..

--చంద్ర

11, జనవరి 2011, మంగళవారం

మంచి స్నేహితుడు..

మా ప్రొద్దుటూర్ లో వుండే నా ఒక మంచి స్నేహితుడి గురించి రాసిన ఒ చిన్ని సరదా కవిత.ఇందులోని ప్రతి వాక్యపు మొదటి పదము యొక్క first alphabet ని వరుస క్రమంలో పేర్చితే వచ్చే పేరే నా స్నేహితుడు

బిడియపడే సిగ్గుల బుగ్గన్న
విరాజిల్లు ప్రొద్దుటూరు నీ దాత్రుత్వాన..
మనువాడిన నీ మహి హృదయాన
ఓంటరితనపు జ్ణాపకాలను మరచిన తరుణాన
హేయమైన తుచ్చ భావాల మనుజులు నీ దరిన..
అర్థ పరమార్థ విచక్షణా రహితులు నీ అభయాన..
నా అన్నదేనాడెఱుగవు నీ బంధు సమూహాన ..
రేయంతా మబ్బుల మాటునుండే చంద్రుడి నిండు అమావాస్య రోజున
ఈతని చెరగని నగుమోము తరగని వెలుగు నింపగల్గునా..?
ధరిత్రిలోన ఇలాంటి చరిత్ర గలవాడు దొరుకునా..?
దీనులనాదుకొనే పేదల పాలిటి పెన్నిధీ పుడమిన
యెన్నో జన్మలకు సరిపడా కలిగే భాగ్యమే ఆ దేవుడు తనకిచ్చే నజరాన..

--చంద్ర

8, జనవరి 2011, శనివారం

లాఖీడ్ స్నేహితులు...

లాఖీడ్ కంపెనీలో పనిచేసేప్పుడు పరిచయమైన నా స్నేహితుల ముచ్చటలు..


ఏనాడైననూ లాఖీడులో పండుగ..బిల్లింగ్ ని మరిచిపోతే..

ఏ మూలో విశాదం మెండుగ..బిల్డింగ్ ని వదిలితే..

ప్రతి friday చర్చలు నిండుగ..topic దొరికితే..

ప్రతి topic లో చెణుకులు పండగ..చందర మొదలెడితే ..

చందరకు చురుక్కు మండగ దీపిక దిగితే..

దీపికకు రఘు తోడు నుండగ ఎదురుదాడి దిగితే...

చర్చల్లో పాల్గొనుండ మరచిన మరువాడ..

మరు వారాన మరవకుండ అందరితో వాదులాడ..

వాదులాటలో తనదైన బాణీలో నిర్మల చిందులాడ ..

అగ్నికి ఆజ్యం తోడులా వచ్చేది జయ పెందలాడ..

వేటికి వెరవక వెన్ను చూపని చందురుడ..

వీటికి కడు దూరాన వేమన తన proposals చూడ..

proposals తో విసిగి వేసారిన పితాని మార్తాండ..

మగువే మగవాడికి సంకటమనే నానుడి తాము మరువగ..

H1B నే మగాడి జీవితాన్ని నిలబెట్టేదని పితాని వెయ్యిన్నొక్క దేవుళ్ళను వేడగా ..

నాపని నాదేనంటూ సూర్యుడస్తమించగా...ఇంటికెలదామా అని ఈ చందురుడాలోచించగా..

లాఖీడ్ స్నేహితులకు ధన్యవాదాలతో..నా ఈ కవిత..

BHARATH CHANDRA

 
Posted by Picasa