6, నవంబర్ 2013, బుధవారం

దీపావళి శుభాకాంక్షలతో ..

కానరాని దేశాన అయినవారి ఆనవాలు వెతుకుతున్న మనకు,

కనిపించని దీపావళి వెలుగులు తడిఆరని  కళ్ళల్లో ప్రతిబింబించాలని

వినిపించని తారా జువ్వల సవ్వడులు హృదయాంతరాలలో వికసించాలని

మతాబుల విరిజల్లులు మన మదిలో విరబూయాలని

మీ ఇంటిళ్ళపాది సుఖసంతోషాలతో నిండు నూరేళ్ళు విరజిల్లాలని

దీపావళి శుభాకాంక్షలతో  ..

20, జూన్ 2013, గురువారం

ఎందుకంటే..


తెలుగు భాష అంటే అభిమానం ఎందుకంటే..
                              పెదవిపై విరిసిన తొలి తెలుగు పదం అమ్మనే..!
             
మాతృభూమి అంటే మమకారం  ఎందుకంటే..
                      మహనీయులను కన్న పుణ్య భూమి!

భారతీయత  అంటే అభిమానం ఎందుకంటే..
                                       పంచమవేదం మహా భారతమే!

వారధి అంటే అభిమానం ఎందుకంటే..
                    పైన చెప్పిన విషయాలన్నింటినీ  ప్రవాసాంధ్రులకందించేది..!!!

చుక్క!!

చుక్కంటే చక్కని చుక్క కాదు..చిక్కని చుక్క
హంగు పొంగుల జున్ను ముక్క..
నోరూరించే ఆవకాయ ముక్క,
ఒంపు సొంపుల లేత కొబ్బరి ముక్క..
దక్కిన పిదప తీసేయ్ దాని తొక్క..
చిక్కుల్లో పడి ఎక్కి ఎక్కి ఏడుస్తే
అక్కున చేర్చుకో...తక్కినవన్నీ దోచుకో..
 
చక్కని చుక్క దక్కాలంటే 
ఎరుపెక్కిన తన బుగ్గలు నొక్కాలంటే
దక్కిన దానితో కిక్కురుమనకుండా
కుక్కిన పేనులా పక్కలో ఉండడమే..
 
అక్కరకురాని చుక్క..
పక్కలోకి రాని దానక్క
మసాలా లేని ముక్క..
విశ్వాసంలేని కుక్క..
అక్కడక్కడా మొలిచే మొక్క,
మిల మిల మెరవని చుక్క 
చేవ చచ్చిన రెక్క ..
ఆకలి లేని డొక్క..
వర్ణం లేని వక్క ..
 
ఉన్నా లేకున్నా ఒక్కటే..
 

11, జూన్ 2013, మంగళవారం

వారధి!!!

చిన్ననాటి ఙ్నాపకాల చినుకుల తడితో మదిలో విరిసిన వారధి
తొలి సంధ్య కాంతి కిరణాల పూదోటలో మొగ్గతొడిగినది!!
తూరుపు వెలుగుల్లో తెలుగువారి గుండెల్లో విరబూసిన వారధి
నిదురోతున్న మన తెలుగు సంస్కృతిని జాగృతమొనర్చే దీపధారి!!



5, జూన్ 2013, బుధవారం

ఉగాది పండుగ !!!

వసంతాన "వారధి"తో కూడి తొలి అడుగులువేసే పండుగ

తెలుగువారి ఆత్మీయబంధానికి ఆలవాలమైన పండుగ

వారధితో అనుబంధానికి  అంకురార్పణ జరిగిన పండుగ

చైత్రమాసాన షడృచులతో చేరువయ్యే పండుగ

ఉగాది పచ్చడితో కష్ట సుఖాలను తెలియజెప్పే కన్నుల పండుగ

మరిన్ని విజయాలు మీ సొంతమవ్వాలని కాంక్షించే శ్రీ విజయనామ సంవత్సర పండుగ
మితృలకు,శ్రేయోభిలాషులకు కాటుబోయిన చంద్ర శుభాకాంక్షలు జెప్పే ఉగాది పండుగ !!!

విశాల భారతం!!!'.


విశాల భారతావనిలో విషాద ఘట్టం

జనసంద్ర కూడలి లో మరో నెత్తుటి మట్టం

నెత్తురిడిన క్షేత్రమంతా చిత్తైన దేహాల ఉత్పాతం

చిత్తైన దేహాల నడుమ ఛిద్రమైన అంగాంగాల తుది రూపం

ఉగ్రవాద నరవ్యాఘ్రాలు నెరిపిన దాడుల పర్వం

భీకరిల్లే శబ్ద సాంకేతికతో తీవ్రవాదుల ప్రచోదనం

హాహాకారాలతో ఉరకలెత్తి తప్పించుకోజూసిన జనం

కానరాని లోకాలకు కడతేరిన క్షతగాత్రుల వైనం

వరుస పేలుళ్ళతో జరిగిన మారణ హోమం

మారని ఉన్మాదాలకు నిలువెత్తు సాక్షాత్కారం

కానలలోని క్రూరమృగాలు ఈ తీవ్రవాదుల కంటే ఎంతో నయం

అశ్రు నయనాలతో జనాల నీరాజనం

భరతమాత చెక్కిలిపై మరో విలయ-అంకం

ఇలాంటి దుర్ఘటనలను అడ్డుకోలేని ప్రభుత్వం

అదుపులేని యంత్రాంగం ,ఒడుపు లేని నాయకత్వం

చేవచచ్చిన ప్రజా చైతన్యం ,శవాలవోలె యువత నిర్వీర్యం

దిశా నిర్దేశం చేయలేని నాయకుల ధౌర్భాగ్యం

ఈ కళ్ళతో చూడగలనా ఈ తీవ్రవాదుల అంతం?

ఈ బొందిలో ప్రాణముండగా నెరవేరునా నా కలల భారతం ?
నా కలల భారతం:

'కలకాలం పరిఢవిల్లే పచ్చదనాల భారతం!!!,

భారత కీర్తి విరాజిల్లే విశాల భారతం!!!'.

గరికపాటి - ఘనాపాటి

మధ్యహ్నపు నడి ఎండన ..భానుడి ప్రతాపం సాక్షిగా


సరస్వతీ పుత్రులు సమావేశానికి సమాయుత్తమై

మరొకసారి తన తల్లిని తలచి విడిదిని విడిచి అయినవారితో కలసి

ఆరు బయట గురువుగారు అరుదెంచు తరుణాన

తీక్షణంగా పడ్డ సూర్య కిరణాల తాకిడికి

తటాలున తలెత్తి సూర్యుడి వంక సూటిగా చూడలేక

సరి అంచు పంచెతో పొంచిఉన్న కారులో కూర్చొని అలా కళ్ళు మూసుకున్న క్షణాన నిద్రలో…..

శారదా మాత పిలుపుతో వేగిరమే చెంత చేరిన భానుడితో..

నాయనా! భూలోకంలోని “ఎల్లికాట్ సిటీ”లో నా బిడ్డ “వారధి”లో చెప్పే నాలుగు మాటలు వినాలని వుంది

తోడు రాగలవా అని అడగ్గానే..అలాగే అమ్మా! అంటూ..భాస్కరుడు బయలుదేరగా..

వెనువెంటనే ఇక్కడ ఆకాశాన సూర్యుడు మటు మాయం..

తొడుగా మేఘాల సాయం……చిన్నపాటి అలికిడికి గరికపాటి మేల్కోడం..

ఓహో..ఇది కలయా..అని కాసేపు..కాదు కాదు ఇది నిజమే సుమా అని ఆకాశాన లేని భానుడిని చూసి..సన్నని నవ్వు తన పెదాలపై విరియగా..

సాయం సంధ్యపు చల్లగాలులు అవధానులకు హారతులు పట్టగా..

దరిచేరిన దాళీకుడు ధారణ ధరుణీ ధరుడికి స్వాగతవచనాలు పలుకగ

వెంట కూడి సాహితీ సమావేశానికి తోడ్కొని రాగా..ఆశీనులయ్యె అవధానులు..

సాహిత్యంలో హాస్యం అంశం ……ధారణ తన పాండిత్యపు అంకుశం

బయట సన్నని వర్షపు జల్లులు …లోన ఎడతెగని నవ్వుల హరివిల్లులు

అక్కడ వర్షం ఆగినా ఇక్కడ హాస్యం ఆగలేదు వారు చమత్కార ధోరణి వీడలేదు..

నిరాటంకంగా సాగిన హాస్యపు జల్లులకు తెర పడింది

నిర్వాహకులుగా వారధి వారికి ప్రశంశల పరంపర కొనసాగింది..!

మహాకవిని కలవాలనే ఈచంద్రుడి జీవితకాల స్వప్నం నెరవేరింది..

9, ఫిబ్రవరి 2013, శనివారం

తొలిముద్దు




తొలిముద్దు 

చక్కని చుక్క చిక్కింది
చిక్కిన చిన్నది నచ్చింది
నచ్చిన పిల్లది మెచ్చింది
మెచ్చిన కుర్రది దక్కింది

దక్కిన కుర్రాడు ముద్దంటే..
ముందుగ ముద్దు వద్దంది
వద్దని వయ్యారి వగచింది
తాళి పడేవరకు తగదంది
అలిగిన ...వాడితో తగువాడింది
వాదిస్తూనే వగలాడి హద్దంది
హద్దుల ముసుగులొ తప్పంది
తప్పంటూనే తడబడింది
తడబడుతూనే సహకరించింది
కాదంటూనే కనికరించింది
కనికరింపులో కన్ను కలిపింది
కలిపిన కన్నుతో వెన్ను తట్టింది
తడిమిన వెన్నులో చలి పుట్టింది
గాలి చొరవనంతగా చేరువయ్యింది
బిగువులు తగిలిన క్షణం సిగ్గుపడింది
సిగ్గుతో చేతులు పెనవేసింది
అదురుతున్న అధరాలను అందించింది
పెనవేసుకున్న పెదాలకు గడియేసింది
తొలిముద్దు మాధుర్యాన్ని చవి చూసింది
ఇనేళ్ళుగా ఇంతానందం ఎందుకు కోల్పాయానా అని చింతిస్తూ..
తేరుకోలేని లోకాల్లోకి తేలిపోయింది

తేరుకోగానే ఇది కల కాదుగా అనిపించింది

 ఆక్షణంలో మల్లీ తన ఆలోచన అతని చుట్టే...

మరొక్కసారి "అది" కావాలనిపించేంతగా..

28, జనవరి 2013, సోమవారం

మరీ అంతగా....పాట పేరడీ

సరదాగా రాసిన నా ఈ చిన్ని ప్రయత్నం ..నచ్చితే మీ comment రాయండి నచ్చకపోతే తిట్టకండి..
సీతమ్మ వాకిట్లో...సినిమాలోని మరీ అంతగా....పాట పేరడీ

!!మహా చండిక మహంకాలిగా మొహం మాడితే ఎలా..


అదో వింతగా మరీ చెత్తగా మాటాడితివె అలా..

ఇన్నాల్లే వినలేదే కొందరినైనా మందిని మెచ్చేలా..

ముచ్చటగా ఉండాలే నిను చూసిన క్షణము అద్దం పగిలేలా..

చిక్కుల్లో పడి ఆలోచిస్తే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా..

అయ్యయ్యో అంటూ దిగాలు పడితె బాధలు పోతాయా లేదా నీకు బుర్ర ఈవాల..


“1” పిల్లలను దండిస్తావా…పెద్దలను నిందిస్తావా..మొగుడినే నిలదీస్తావా..ఛీ పొమ్మనీ..
అక్కలను ఆరేస్తావా…చెల్లెలను తోసేస్తావా…వదినలతో వాదిస్తావా……మొగుడెంతనీ..
ఏడు అడుగులతో బంధం తోటి నీ వాడితో పంతం
రోజు తెగ గొడవాడేస్తుంటే ఎం సాగుతుంది సంసారం

చిక్కుల్లో పడి ఆలోచిస్తే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా..
అయ్యయ్యో అంటూ దిగాలు పడితె బాధలు పోతాయా లెదా నీకు బుర్ర ఈవాల..

“2” స్వర్ణమే కరిగించాలా..వదనమే వర్ణించాలా అందమే అద్దించాలా రేయీ పగలూ..
చీరలను కొనిపెట్టాలా..కొంగులకు ముడి కట్టాలా పూట పూటనా పేచి పెట్టే ఈ ఆలికీ..
మగడు అన్నవాడెవడైనా…తగని తన మగువతొనైన
తరగని చిరునవ్వుతొ కూడి ఎన్నేళ్ళైనా కుదురుగ ఉంటాడు

చిక్కుల్లో పడి ఆలోచిస్తే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా..
అయ్యయ్యో అంటూ దిగాలు పడితె బాధలు పోతాయా లెదా నీకు బుర్ర ఈవాల..

8, జనవరి 2013, మంగళవారం

మనిషి మనిషిగా ..


భారతాన జనించిన ఆధ్యాత్మిక సాంప్రదాయం సనాతన ధర్మం మన హిందు మతం


కర్మ,ధర్మ,కట్టుబాట్ల తాత్విక ఆధారితం మన హిందుతత్వం

మేధో సుసంపన్న సమ్మేళనం హిందు ధర్మ జగద్విత సారం

సంకర నేతల సంకుచితత్వ ప్రసంగం వంకర పోతున్న సమ సమాజ నిర్మాణం

ఫారిపొయిన పరమత సహనం ..పెల్లుబికిన పరమత ద్వేషం

అక్బరుద్దీన్ అధిక ప్రసంగం .. తాజా వార్తగా హోరెత్తిన ప్రసార మాధ్యమం

జాగరూకతో హిందు జన ప్రభంజనం ఆరోగ్యసాకుతో అక్బర్ పలాయనం

చేవ చచ్చిన చేతలతో చట్టం.. చావు తప్పి కన్ను లొట్ట పొయిన చందాన ప్రభుత్వం

కడకు నిర్భందించడం .. చనిపోతుందనుకొన్న చట్టాన్ని బతికించడం

కళ్ళారా ఇలాంటి దురాగతాలు చూడ్డం.. ఏ జన్మలోనో చేసుకున్న పాపం!!!

అని నొచ్చుకుంటూ మధనపడుతున్నాడీ చంద్రం…

స్థాపించలేమా నవ సమాజ నిర్మాణం ?

సాధించలేమా పరమత సహన సమాజ సౌభ్రాతృత్వం ?

చదివిన ఉన్నత చదువులు ఉట్టికేనా..నేర్చిన నవ నాగరికత వట్టిదేనా..?
ఏది మనం ఎంచుకున్న గమ్యం?ఎటువైపు మన జీవన పయనం ?
ఇలా కులమతరాగ ద్వేషాలతో బతకవలసిందేనా..?

మనిషి మనిషిగా బ్రతకండి నేర్చిన నీతిని విడనాడకండి..

4, జనవరి 2013, శుక్రవారం

మొదలుపెట్టా..

 project కోసం personal పనులన్నీ పణంగా పెట్టి ,భార్యా పిల్లలతో గడిపే సమయాన్ని తృణంగా పెట్టిఇష్టమైన ఆటపాటలన్నింటినీ గట్టున పెట్టి...అబ్బురపరిచే లాజిక్కులకి లేని మెదడుకు పదునుబెట్టి...అదుపులేని కోరికలను అదుపులో పెట్టి,స్నేహితులతో షికార్లకు అడ్డు చెప్పి...మందుకొట్టే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి,కంపుకొట్టే సిగరెట్లకు వీడ్కోలు పలికి,కంటిమీద కునుకుకు బై బై చెప్పి,ఎదుటివారిమీద నిందలు మోపలేక ,కనిపించే అన్యాయాన్ని ప్రతిఘటించలేక,తెలియక,కుట్రపూరితపాచికలు విసరలేక,మోసపూరిత చర్యలు భరించలేక,నా సాంకేతికతా నైపుణ్యాన్ని ప్రదర్శించలేక,అవకాశాలు దొరకపుచ్చుకోలేక ,అవిభాజ్యపు సిద్ధాంతాలతో భేదించలేక, రాజకీయాలు చ్హేదించలేక,విష సంస్కృతి పరిఢిల్లే మనసులేని(project)మనుషులమధ్య మనగడజాలక, మనగల్గలేక, మాట్లాడలేకరాని నవ్వు నవ్వలేక,వెకిలి నవ్వులు చూడలేక, ఎందుకు (ఊరకే)నవ్వుతుందో(ఎరిక)ఎరుగక    , తెలివితక్కువది తెల్లది(client) అని తెలియక,నన్ను నన్నులా ఉంచలేని DEVO projectలో ఇమడలేక, మీలాంటి హితులను వదలలేక అచేతనుడనై,నిశ్చేస్టుడనై ప్రకొపితుడనై,మౌనమునినై చివరకు నిర్వీర్యుడినై స్వేచ్హా ప్రపంచంలో అడుగెట్టా... కవితారూపంలో మొదలుపెట్టా..