28, జనవరి 2013, సోమవారం

మరీ అంతగా....పాట పేరడీ

సరదాగా రాసిన నా ఈ చిన్ని ప్రయత్నం ..నచ్చితే మీ comment రాయండి నచ్చకపోతే తిట్టకండి..
సీతమ్మ వాకిట్లో...సినిమాలోని మరీ అంతగా....పాట పేరడీ

!!మహా చండిక మహంకాలిగా మొహం మాడితే ఎలా..


అదో వింతగా మరీ చెత్తగా మాటాడితివె అలా..

ఇన్నాల్లే వినలేదే కొందరినైనా మందిని మెచ్చేలా..

ముచ్చటగా ఉండాలే నిను చూసిన క్షణము అద్దం పగిలేలా..

చిక్కుల్లో పడి ఆలోచిస్తే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా..

అయ్యయ్యో అంటూ దిగాలు పడితె బాధలు పోతాయా లేదా నీకు బుర్ర ఈవాల..


“1” పిల్లలను దండిస్తావా…పెద్దలను నిందిస్తావా..మొగుడినే నిలదీస్తావా..ఛీ పొమ్మనీ..
అక్కలను ఆరేస్తావా…చెల్లెలను తోసేస్తావా…వదినలతో వాదిస్తావా……మొగుడెంతనీ..
ఏడు అడుగులతో బంధం తోటి నీ వాడితో పంతం
రోజు తెగ గొడవాడేస్తుంటే ఎం సాగుతుంది సంసారం

చిక్కుల్లో పడి ఆలోచిస్తే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా..
అయ్యయ్యో అంటూ దిగాలు పడితె బాధలు పోతాయా లెదా నీకు బుర్ర ఈవాల..

“2” స్వర్ణమే కరిగించాలా..వదనమే వర్ణించాలా అందమే అద్దించాలా రేయీ పగలూ..
చీరలను కొనిపెట్టాలా..కొంగులకు ముడి కట్టాలా పూట పూటనా పేచి పెట్టే ఈ ఆలికీ..
మగడు అన్నవాడెవడైనా…తగని తన మగువతొనైన
తరగని చిరునవ్వుతొ కూడి ఎన్నేళ్ళైనా కుదురుగ ఉంటాడు

చిక్కుల్లో పడి ఆలోచిస్తే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా..
అయ్యయ్యో అంటూ దిగాలు పడితె బాధలు పోతాయా లెదా నీకు బుర్ర ఈవాల..

8, జనవరి 2013, మంగళవారం

మనిషి మనిషిగా ..


భారతాన జనించిన ఆధ్యాత్మిక సాంప్రదాయం సనాతన ధర్మం మన హిందు మతం


కర్మ,ధర్మ,కట్టుబాట్ల తాత్విక ఆధారితం మన హిందుతత్వం

మేధో సుసంపన్న సమ్మేళనం హిందు ధర్మ జగద్విత సారం

సంకర నేతల సంకుచితత్వ ప్రసంగం వంకర పోతున్న సమ సమాజ నిర్మాణం

ఫారిపొయిన పరమత సహనం ..పెల్లుబికిన పరమత ద్వేషం

అక్బరుద్దీన్ అధిక ప్రసంగం .. తాజా వార్తగా హోరెత్తిన ప్రసార మాధ్యమం

జాగరూకతో హిందు జన ప్రభంజనం ఆరోగ్యసాకుతో అక్బర్ పలాయనం

చేవ చచ్చిన చేతలతో చట్టం.. చావు తప్పి కన్ను లొట్ట పొయిన చందాన ప్రభుత్వం

కడకు నిర్భందించడం .. చనిపోతుందనుకొన్న చట్టాన్ని బతికించడం

కళ్ళారా ఇలాంటి దురాగతాలు చూడ్డం.. ఏ జన్మలోనో చేసుకున్న పాపం!!!

అని నొచ్చుకుంటూ మధనపడుతున్నాడీ చంద్రం…

స్థాపించలేమా నవ సమాజ నిర్మాణం ?

సాధించలేమా పరమత సహన సమాజ సౌభ్రాతృత్వం ?

చదివిన ఉన్నత చదువులు ఉట్టికేనా..నేర్చిన నవ నాగరికత వట్టిదేనా..?
ఏది మనం ఎంచుకున్న గమ్యం?ఎటువైపు మన జీవన పయనం ?
ఇలా కులమతరాగ ద్వేషాలతో బతకవలసిందేనా..?

మనిషి మనిషిగా బ్రతకండి నేర్చిన నీతిని విడనాడకండి..

4, జనవరి 2013, శుక్రవారం

మొదలుపెట్టా..

 project కోసం personal పనులన్నీ పణంగా పెట్టి ,భార్యా పిల్లలతో గడిపే సమయాన్ని తృణంగా పెట్టిఇష్టమైన ఆటపాటలన్నింటినీ గట్టున పెట్టి...అబ్బురపరిచే లాజిక్కులకి లేని మెదడుకు పదునుబెట్టి...అదుపులేని కోరికలను అదుపులో పెట్టి,స్నేహితులతో షికార్లకు అడ్డు చెప్పి...మందుకొట్టే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి,కంపుకొట్టే సిగరెట్లకు వీడ్కోలు పలికి,కంటిమీద కునుకుకు బై బై చెప్పి,ఎదుటివారిమీద నిందలు మోపలేక ,కనిపించే అన్యాయాన్ని ప్రతిఘటించలేక,తెలియక,కుట్రపూరితపాచికలు విసరలేక,మోసపూరిత చర్యలు భరించలేక,నా సాంకేతికతా నైపుణ్యాన్ని ప్రదర్శించలేక,అవకాశాలు దొరకపుచ్చుకోలేక ,అవిభాజ్యపు సిద్ధాంతాలతో భేదించలేక, రాజకీయాలు చ్హేదించలేక,విష సంస్కృతి పరిఢిల్లే మనసులేని(project)మనుషులమధ్య మనగడజాలక, మనగల్గలేక, మాట్లాడలేకరాని నవ్వు నవ్వలేక,వెకిలి నవ్వులు చూడలేక, ఎందుకు (ఊరకే)నవ్వుతుందో(ఎరిక)ఎరుగక    , తెలివితక్కువది తెల్లది(client) అని తెలియక,నన్ను నన్నులా ఉంచలేని DEVO projectలో ఇమడలేక, మీలాంటి హితులను వదలలేక అచేతనుడనై,నిశ్చేస్టుడనై ప్రకొపితుడనై,మౌనమునినై చివరకు నిర్వీర్యుడినై స్వేచ్హా ప్రపంచంలో అడుగెట్టా... కవితారూపంలో మొదలుపెట్టా..