20, జూన్ 2013, గురువారం

ఎందుకంటే..


తెలుగు భాష అంటే అభిమానం ఎందుకంటే..
                              పెదవిపై విరిసిన తొలి తెలుగు పదం అమ్మనే..!
             
మాతృభూమి అంటే మమకారం  ఎందుకంటే..
                      మహనీయులను కన్న పుణ్య భూమి!

భారతీయత  అంటే అభిమానం ఎందుకంటే..
                                       పంచమవేదం మహా భారతమే!

వారధి అంటే అభిమానం ఎందుకంటే..
                    పైన చెప్పిన విషయాలన్నింటినీ  ప్రవాసాంధ్రులకందించేది..!!!

చుక్క!!

చుక్కంటే చక్కని చుక్క కాదు..చిక్కని చుక్క
హంగు పొంగుల జున్ను ముక్క..
నోరూరించే ఆవకాయ ముక్క,
ఒంపు సొంపుల లేత కొబ్బరి ముక్క..
దక్కిన పిదప తీసేయ్ దాని తొక్క..
చిక్కుల్లో పడి ఎక్కి ఎక్కి ఏడుస్తే
అక్కున చేర్చుకో...తక్కినవన్నీ దోచుకో..
 
చక్కని చుక్క దక్కాలంటే 
ఎరుపెక్కిన తన బుగ్గలు నొక్కాలంటే
దక్కిన దానితో కిక్కురుమనకుండా
కుక్కిన పేనులా పక్కలో ఉండడమే..
 
అక్కరకురాని చుక్క..
పక్కలోకి రాని దానక్క
మసాలా లేని ముక్క..
విశ్వాసంలేని కుక్క..
అక్కడక్కడా మొలిచే మొక్క,
మిల మిల మెరవని చుక్క 
చేవ చచ్చిన రెక్క ..
ఆకలి లేని డొక్క..
వర్ణం లేని వక్క ..
 
ఉన్నా లేకున్నా ఒక్కటే..
 

11, జూన్ 2013, మంగళవారం

వారధి!!!

చిన్ననాటి ఙ్నాపకాల చినుకుల తడితో మదిలో విరిసిన వారధి
తొలి సంధ్య కాంతి కిరణాల పూదోటలో మొగ్గతొడిగినది!!
తూరుపు వెలుగుల్లో తెలుగువారి గుండెల్లో విరబూసిన వారధి
నిదురోతున్న మన తెలుగు సంస్కృతిని జాగృతమొనర్చే దీపధారి!!



5, జూన్ 2013, బుధవారం

ఉగాది పండుగ !!!

వసంతాన "వారధి"తో కూడి తొలి అడుగులువేసే పండుగ

తెలుగువారి ఆత్మీయబంధానికి ఆలవాలమైన పండుగ

వారధితో అనుబంధానికి  అంకురార్పణ జరిగిన పండుగ

చైత్రమాసాన షడృచులతో చేరువయ్యే పండుగ

ఉగాది పచ్చడితో కష్ట సుఖాలను తెలియజెప్పే కన్నుల పండుగ

మరిన్ని విజయాలు మీ సొంతమవ్వాలని కాంక్షించే శ్రీ విజయనామ సంవత్సర పండుగ
మితృలకు,శ్రేయోభిలాషులకు కాటుబోయిన చంద్ర శుభాకాంక్షలు జెప్పే ఉగాది పండుగ !!!

విశాల భారతం!!!'.


విశాల భారతావనిలో విషాద ఘట్టం

జనసంద్ర కూడలి లో మరో నెత్తుటి మట్టం

నెత్తురిడిన క్షేత్రమంతా చిత్తైన దేహాల ఉత్పాతం

చిత్తైన దేహాల నడుమ ఛిద్రమైన అంగాంగాల తుది రూపం

ఉగ్రవాద నరవ్యాఘ్రాలు నెరిపిన దాడుల పర్వం

భీకరిల్లే శబ్ద సాంకేతికతో తీవ్రవాదుల ప్రచోదనం

హాహాకారాలతో ఉరకలెత్తి తప్పించుకోజూసిన జనం

కానరాని లోకాలకు కడతేరిన క్షతగాత్రుల వైనం

వరుస పేలుళ్ళతో జరిగిన మారణ హోమం

మారని ఉన్మాదాలకు నిలువెత్తు సాక్షాత్కారం

కానలలోని క్రూరమృగాలు ఈ తీవ్రవాదుల కంటే ఎంతో నయం

అశ్రు నయనాలతో జనాల నీరాజనం

భరతమాత చెక్కిలిపై మరో విలయ-అంకం

ఇలాంటి దుర్ఘటనలను అడ్డుకోలేని ప్రభుత్వం

అదుపులేని యంత్రాంగం ,ఒడుపు లేని నాయకత్వం

చేవచచ్చిన ప్రజా చైతన్యం ,శవాలవోలె యువత నిర్వీర్యం

దిశా నిర్దేశం చేయలేని నాయకుల ధౌర్భాగ్యం

ఈ కళ్ళతో చూడగలనా ఈ తీవ్రవాదుల అంతం?

ఈ బొందిలో ప్రాణముండగా నెరవేరునా నా కలల భారతం ?
నా కలల భారతం:

'కలకాలం పరిఢవిల్లే పచ్చదనాల భారతం!!!,

భారత కీర్తి విరాజిల్లే విశాల భారతం!!!'.

గరికపాటి - ఘనాపాటి

మధ్యహ్నపు నడి ఎండన ..భానుడి ప్రతాపం సాక్షిగా


సరస్వతీ పుత్రులు సమావేశానికి సమాయుత్తమై

మరొకసారి తన తల్లిని తలచి విడిదిని విడిచి అయినవారితో కలసి

ఆరు బయట గురువుగారు అరుదెంచు తరుణాన

తీక్షణంగా పడ్డ సూర్య కిరణాల తాకిడికి

తటాలున తలెత్తి సూర్యుడి వంక సూటిగా చూడలేక

సరి అంచు పంచెతో పొంచిఉన్న కారులో కూర్చొని అలా కళ్ళు మూసుకున్న క్షణాన నిద్రలో…..

శారదా మాత పిలుపుతో వేగిరమే చెంత చేరిన భానుడితో..

నాయనా! భూలోకంలోని “ఎల్లికాట్ సిటీ”లో నా బిడ్డ “వారధి”లో చెప్పే నాలుగు మాటలు వినాలని వుంది

తోడు రాగలవా అని అడగ్గానే..అలాగే అమ్మా! అంటూ..భాస్కరుడు బయలుదేరగా..

వెనువెంటనే ఇక్కడ ఆకాశాన సూర్యుడు మటు మాయం..

తొడుగా మేఘాల సాయం……చిన్నపాటి అలికిడికి గరికపాటి మేల్కోడం..

ఓహో..ఇది కలయా..అని కాసేపు..కాదు కాదు ఇది నిజమే సుమా అని ఆకాశాన లేని భానుడిని చూసి..సన్నని నవ్వు తన పెదాలపై విరియగా..

సాయం సంధ్యపు చల్లగాలులు అవధానులకు హారతులు పట్టగా..

దరిచేరిన దాళీకుడు ధారణ ధరుణీ ధరుడికి స్వాగతవచనాలు పలుకగ

వెంట కూడి సాహితీ సమావేశానికి తోడ్కొని రాగా..ఆశీనులయ్యె అవధానులు..

సాహిత్యంలో హాస్యం అంశం ……ధారణ తన పాండిత్యపు అంకుశం

బయట సన్నని వర్షపు జల్లులు …లోన ఎడతెగని నవ్వుల హరివిల్లులు

అక్కడ వర్షం ఆగినా ఇక్కడ హాస్యం ఆగలేదు వారు చమత్కార ధోరణి వీడలేదు..

నిరాటంకంగా సాగిన హాస్యపు జల్లులకు తెర పడింది

నిర్వాహకులుగా వారధి వారికి ప్రశంశల పరంపర కొనసాగింది..!

మహాకవిని కలవాలనే ఈచంద్రుడి జీవితకాల స్వప్నం నెరవేరింది..