7, డిసెంబర్ 2014, ఆదివారం

విజయ దశమి శుభాకాంక్షలతో..

కనుల ముందు కదులుతున్న ఈ పండుగ క్షణాలు

రేపటికి గతమయ్యే విగడియలు..

పది రోజులపాటు పండుగ దినాన్ని పావనం చేసుకుంటే..

పది కాలాలపాటు మదిలో పదిలపరచుకోవచ్చు తీపి జ్ఞాపకాలుగా!

రేపటి తరానికి కానుకగా...!

విజయ దశమి శుభాకాంక్షలతో..

ఓహో బస్తీ దొరసాని పాటకు పేరడి..

జమ్మలమడుగు దొరసాని జతగా జంటగ దక్కింది

వన్నె చిన్నెలాడి ఓర చూపుతొ వరుడిగ మార్చింది ……”జమ్మల”


కన్నె పిల్ల కౌగిలొలోన కరిగి మరిగి పోతుంటే

కారు బైకు కావాలంటు కసురుకుంటు నెట్టింది 2

హయ్ ఆ పై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చిందీ

కారు కొనగానె ముసి ముసినవ్వుతొ షికారు పద అంది……”జమ్మల”


ఇంటిలోన బోరు కొట్టి ఇంటర్నెట్టు చూసింది

టొటారము సైటులోని వడ్డాణం కోరింది  2

మొగుడిగ నడ్డే విరిగింది అడ్డిక చెప్పక తెమ్మంది

నారి నడుమును చూసి సారీ అంటూ శారీ తెచ్చానె ..           ”జమ్మల”


అందాలకు మెరుగులు దిద్దుతూ అద్దమ్ముందు నిలుచుంది

చూడ  చూడ తీక్షణంగా అద్దం ముక్కలయ్యింది

నవ్విన మొగుడితొ అలిగింది  అలిగి అలకే పూనింది

అలకలొ అందాల వన్నేలాడి అయినా బాగుంది.................  ”జమ్మల”

6, డిసెంబర్ 2014, శనివారం

కాలేజి కుర్రవాడ పాటకు పేరడి

కాలేజి కుర్రవాడ కులాసాగ తిరిగెటోడ..అన్న పాత పాటకు పేరడి..లాఖీడ్ మార్టిన్ అనే కంపెనిలో ప్రతి సెప్టెంబర్ మాసంలో జరిగే లయొఫ్ఫ్స్ ని డృష్టిలో ఉంచుకొని రాసిన పాట..


లాకీడు చేరినోడ ఏకీడు ఎరగనోడ
సెప్టెంబర్ మరవబోకురో ఓ ఇంజినీరు..
ఫైరింగులు మొదలవ్వునురో ఓ ఇంజినీరు…

బిల్లింగులు సూపరని బిల్డింగులు టాపు అని
ఎటుచూసిన తెలుగువాడు కనపడడు తెల్లవాడు
బడ్జెట్టు లేదు అంటె భారమే లైఫుఅంతా

బాల్టిమోరు భలేగుందనీ ఓ ఇంజినీరు…
ఇల్లుకొంటె గుల్లవుతవురో ఓ ఇంజినీరు…"

NGలొ చేరినోడ ఎంజాయి చేసెటోడ
సెప్టెంబర్ గండముందిరో ఓ ఇంజినీరు..
కంటి నిండ కునుకుండదురో

వీకెండు పార్టీలు వీకుడేసు గ్రాసరీలు
రోజుకో తెలుగు మూవి పక్కలో రతీదేవి
imaxలొ మ్యాట్నీలు lexusలొ జర్నీలు
ఇలాగుంటె..?

జన్మ భూమి మరచిపోతమో చివరికి
కన్న తల్లి మరచిపోతమూ.. "లాకీడు చేరినోడ "

అందుకే …
పొంచివుంది ప్రమాదం ..ముంచుకొచ్చె ఓ ప్రళయం
వచ్చేది కోత మాసం నచ్చేది మాఘమాసం
విధి ఆడే ఈ నాటకం ఓ ఇంజినీరు…
మరిచిపోకు మన పాత్రను ఓ ఇంజినీరు……"లాకీడుచేరినోడ "

After Firing
జడుసుకోకు ఏ క్షణం మిడిసిపడకు నీక్షణం
విరమించకు నీ ప్రయత్నం..సడలించకు ఏనిమిషం
ప్రయత్నిస్తే అవకాశం దొరుకుతుంది మనకోసం
నమ్మకమే నీ ఆయుధం ఉద్యోగమే నీఆశయం
పదిమందికి నీవే మార్గమూ ఓ ఇంజినీరు…
ప్రగతికే సోపానమూ ఓ ఇంజినీరు…

స్వాతంత్ర్యం....





స్వాతంత్ర్యం అంటే ఎందరో త్యాగ మూర్తుల ఫలం..ఇది నేటి మన స్వాతంత్ర్య దినోత్సవం..

కానీ ఎక్కడ వచ్చింది స్వాతంత్ర్యం.?ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం.?

ఆరు దశాబ్దాలు గడచినా ఆకలిని జయించలేని భారతావనికా..?

భయం గుప్పిట్లో నిత్యం  సంఘర్షించే  సామాన్యుల జీవితాలకా..?

అనుక్షణం మగ మృగాల కామకేళి కిరాతకానికి బలవుతున్న అబలలకా..?

ధనార్జనే ఊపిరిగా దేశ సమగ్రతను తాకట్టు పెట్టే నీచ రాజకీయ వాజమ్మలకా..?

నిర్భయ చికిత్స నిమిత్తం మరో దేశం తరలించ అసహాయ స్థితిలోని వైద్య రంగానికా..?

పట్టెడు మెతుకులు పండించే  రైతన్నకు గుక్కెడు సాగు నీరు అందజేయలేని వ్యవసాయ రంగానికా..?

సుసంపన్న దేశ సంపదను వేల కోట్ల రూపంలో తరలించి భరతమాత చెక్కిలిపై కన్నీరు నింపే స్విస్ ఖాతాదారులకా..?

బడుగు వర్గాలకు కనీసపు విద్య ఉపాధి అందించలేని కుళ్ళిపోయిన దుష్ఠ పాలక వ్యవస్థకా..?

అంతులేని నిర్వేదముతో చింతాక్రాంతుడనై ఏకాంతాన సతతము నాలో నేను ఆవిష్కరించుకుంటున్న ఆవేదన!

పదోన్నతి..




శ్రవణానందకర కబురు చెవిన చేరగనే మది తలపుల్లో ఊపిరి పోసుకున్న చిరు కవనం !

 

ప్రభవించిన శాంతి పుట్టి పరిఢవిల్లె NG తన అడుగు పెట్టి

 

ప్రతిభనంత పదును బెట్టి పయనించు నీ గమ్యం

 

మొక్కవోని దీక్షనెట్టి లెక్క చేయకు గాయం

  

ప్రజ్వలించు ధృవతారలా ఆగిపోదు నీ పయనం

 

సూక్ష్మమైన దోషమున్న పసిగట్టును నీ నయనం

 

ధృఢ చిత్తపు యోచనతో మరుగుతున్న నీ రుధిరం

 

భవిష్యత్తు బంగరు బాటగా ఎర్పరచే సింధూరం  !

 

నీవెంచిన వనరులే   స్థాయికి వరములై

 

పదోన్నతిన పరిమళించు పాటుపడే నీ శౌర్యం

 

పదికాలాలు నిలిచిపోవు

జన్మలో మరచిపోరు SSA పరివారం ….NGలొ ప్రతి వారం!

మిర్చీ పాటకు పేరడీ..



మిర్చీ పాటకు పేరడీ


మంచి మనసున్న స్నేహితునికి కానుకగా ...పండగ లా దిగి వచ్చావు ...పాటకు అనువుగా చేసిన చిన్ని ప్రయత్నం పేరడీ ...మిర్చీ సినిమా నుండి..నచ్చితే వ్యాఖ్యానించండి..


అందరిలా ఒకడై వచ్చి స్నేహానికి రూపై నిలిచి నీమనసుతొ మమ్మే గెలిచావూ..


నా ఆత్మకు తోడయ్యావు నాగుండెకు గూడయ్యావు నావెంటే నీడై నిలిచావూ..


దరిచేరితె ఉల్లాసం సరిజోడుగ ఉత్సాహం


మనిషంటే అభిమానం మనసుల్లొ కలకాలం


ఇట్టాగె పదికాలలు ఉండనివ్వు                                                            “అందరిలా


సాయంలో వినలేదే ఏనాడు కాదనడం నాటికి చెవులారా..


పగవాడిని ప్రేమించే చల్లని నీగుండెల్లొ లేదు పొలిమేర


ఓరిమిలో కొండంత కూరిమినే మదినిండా మురిపెంగా నిలిపావా


దిగమింగిన తలపుల్లో తడి ఎరగని కన్నుల్లో ఒంటరివై నిలిచావా..


మాట నేర్చిన మనసు జూసిన మాననీయుడుగా


వెతలు ఈదిన కథలు తెలిసి జతగ చేరినవా ఇలా..                                  “అందరిలా


చింతల్లో చిరునవ్వు చిత్తంలో అరనవ్వు కాంచా నే కనులారా


ముచ్చటగా మక్కువతో అచ్చంగా దేవుడిలా పలికే ధృవతారా


నొప్పించని నీ నైజం కోపించని నీ వైనం కొనియాడుదు మనసారా


కులమంటూ పట్టింపూ మతమంటూ గుర్తింపు నచ్చని రణధీరా


నిండు మనసుతో పొంగిపోయిన క్రిష్ణ కుచేలుడిలా


స్నేహ గుణమున చరితకెక్కిన్న దాన కర్ణుడిలా అలా                           “అందరిలా