5, సెప్టెంబర్ 2016, సోమవారం

చినుకు చినుకు పడుతూ వుంటే..పాటకు పేరడీ..

చినుకు చినుకు పడుతూ వుంటే..పాటకు పేరడీ..


చుక్క చుక్క పడుతూ ఉంటే కిక్కు కొద్దిగెక్కేస్తుంటే
పెగ్గు మీద పెగ్గేస్తుంటే తగ్గకుండ తాగేస్తుంటే..
ఉంటే..
జోహారు జోహారు ఈ మందుకు సరి లేరు వేరెవరు ఈ చందుకు


1:వారమంత వత్తిడిలోన  వర్కుల్లోన చిత్తవుతుంటే
బీరు తప్ప నీరేం ఆపునూ….


భారమైన బతుకుల్లోన భార్య వేసే షోకులు చూసి
షాకు కొట్టి షేకైపోదునూ..
తెరిపి కాస్త కావాలంటూ మనసు గోల పెడుతుంటే..
జోహారు జోహారు ఈ మందుకు సరి లేరు వేరెవరు ఈ చందుకు


2.వంటి జీతగాడై ఉంటే వంటరాని జంటది ఉంటే
మింటినంటే ఖర్చేం ఆగునూ..?

జీసీల్లేని బతుకుల్లోన వీసా పెట్టే మెతుకులు తింటే
బతుకు బండి ఎట్టా లాగుదూ..?
చిక్కులన్ని పక్కకునెట్టి పక్కలోని సిరాక్ ని ఎత్తి ....వేస్తే
జోహారు జోహారు ఈ మందుకు బేజారు పదకుండా పద ముందుకు…

వారధి నిలిచింది చిరునామాగా!


కరుణించిన వరుణుడు భానుడికి తోడు రాగా,

 

సహకరించిన వాయు దేవుడి వింజామరల వీచికల చల్లని చిరుగాలి వెంట  రాగా ,

 

దాతల దాతృత్వం వారధి వెన్నుదన్నుగా అండగా నిలవగా..

 

వందలమంది పురజనులు ఉగాది పర్వదిన సంబరాలను చూడ తరలిరాగా ,

 

వారధి గుమ్మంలో కమ్మని ఉగాది పచ్చడి రుచి చూడగా,

 

అచ్చెరువొందే వేడుక సొబగులతో వేదిక అలంకరించగా,

 

కనిపించని తెలుగుదనపు లోగిళ్ళు కళ్ళ ఎదుట సాక్షాత్కరింపగా,

 

వినిపించని సంగీత స్వర రాగ జల్లులు పిల్లలు ఆలపించగా,

 

విశాల ప్రాంగణంలో పంచాంగ శ్రవణం ప్రబోదించగా,

 

పరవళ్ళు తొక్కే పడతుల శుభారంభం సుందర స్వప్నానికి ప్రమిదలవ్వగా,

 

చిమ్మ చీకటిలో శివతాండవ నాట్యంలో  రేడియం కాంతులు మెరవగా

 

ముద్దుగారే పసి మొగ్గలతో అద్భుత బాల రామాయణం చిత్రించగా,

 

వారధి చరితలో నిలిచె బాల రామాయణం తలమాణికముగా ,

 

వీక్షించిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నునంటగా..

 

మావిడి పచ్చడి కమ్మదనం,పూత రేకుల తియ్యదనం,పసందైన రుచులు పండుగను ప్రతిబింబించగా..

 

సనాతన సాంప్రదాయ సంబరాలకు వారధి నిలిచింది చిరునామాగా!

స్నేహానికి ..





కొందర్ని చూస్తే


ఎదలో కోటి రాగాలు వీణ మీటుతాయి


రాగాలు రంజిల్లి మేళ తాళాల సాక్షిగా ఒక్కరు


నీ గుండెలో గూడు కట్టుకుంటారు…


కొందరితో పరిచయమవుతే


కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది


ఆ ఆలోచనలకు అర్థవంతమైన భావాలతో ఆలంబన దొరుకుతుంది.


ఆ పరిచయం పేరు చిరునవ్వు అయితే


చిరునవ్వుకు చిరునామాగా నిలిచిన నిను చూస్తే


స్నేహానికి కొత్త నిర్వచనం తడుతుంది స్నేహ సౌరభాలు వెల్లివిరిస్తాయి !



మదిలోని తలపులని..

కడు జాగ్రత్తగా దాచుకుంటావు మదిలోని తలపులని
 
ఒక్కొక్కటిగా తలపుల తలుపులు తెరిస్తే
 
నిగూఢమైన నిక్షిప్త ప్రేమ సందేశాలెన్నో?
 
మస్తిష్కంలోని అస్తవ్యస్తమగు ఆలొచనల పరంపర
 
రూపు దిద్దుకొనక అణగదొక్కబడిన వేళ
 
వెన్నెల చిన్నబోయి జాబిలి కనుమరుగాయెనో కదా..?

మనసిచ్చింది!

శిశిరపు పొద్దుగూకే వేళ భానుడు తన గూటికి చేరే వేళ
 
విరిసిన విరితేనెల చందనమో
 
కురిసిన మెఘమధనపు గ్రీష్మ తాపమో
 
మెరిసింది అందం...
 
వందనాలు అందానికి చందనాలు సరి తూగవు వర్ణానికి
 
వనంలోని కవనంలా వసంతంలోని కోయిలలా
 
సెలయేటి జలపాతంలా చెలిపాడే లయ గీతంలా
 
ఏరువాకాన ఎదురొచ్చింది కోరుకున్నాక మనసిచ్చింది!

19, ఏప్రిల్ 2016, మంగళవారం

రాలుతున్న పూలు !





తడి ఙ్జాపకాలు తట్టిలేపుతుంటే ఆగనంది నా కలం
రాలుతున్న పూలు రోదిస్తుంటే రాయమంది ఓ కవనం

మస్తిష్కాన్ని కుదిపేస్తే
             కదిపింది పదాల మది గ్రంధం
వసంతపు గుమ్మంలో రంగులీనిన పువ్వులే ఆ జ్ఞాపకాల కు పునాదులై
అరుణిమ అందాలతో తరుణిల మనసు దోచిన కుసుమాలు కదా అవి
గాలి కూడా వాటిని
             అంతే సుతారాంగా ఊయలూపుతుందనుకుంటాం
కానీ గాలే ఒక్కోసారి
పట్టి ఊపేస్తుంది

ఆకులు తోబుట్టువులు
            కవచాలై నిలువరించినా
అప్పుడె ప్రాణంపోసుకుంటున్న లేత చిగురులూ నివారించినా
కసిరి కొట్టే విసురు గాలి ధాటి కి మాత్రం
నిర్ధాక్షణ్యంగా విసిరి వేయబడతాయి
నేల రాలిన పూల గొంతుకపై కూడా వేల జీవులు కఠినంగా కవాతు చేస్తాయి
దారులపై బారులుగా పడ్డ పూబాలల
            గుండెలపై కారులు మొండి దాడిని ముమ్మరం చేస్తాయి
తల్లి చెట్టు విలపిస్తున్నా
             కొమ్మలన్నీ రోదిస్తున్నా
ఆపలేవు పూల మరణం
            చేరలేవు దేవుడి చరణం

నీడ నిచ్చే వృక్షానికి నిండు నూరేళ్ళ ఆయుషు నొసగిన బ్రహ్మ..   
పుట్టిన పది రోజులకే చెట్ల పుత్రికలను నేలరాల్చుట న్యాయమా..?

9, ఏప్రిల్ 2016, శనివారం

వారధి...



రమణీయ రాగాలను కమనీయ గానాలను,

లాలి పాటల లాలిత్యాన్ని జోల పాటల గారాబాన్ని

పల్లెలోని తియ్యదనాన్ని అమ్మ భాష కమ్మదనాన్ని 

ఏడిపించే అమ్మ గీతాలని వేడి పెంచే పడుచు పాటల

సమ్మేళన షడ్రుచుల పసందైన విందులతో పండుగ 

పర్వదినాన్ని అందించే పూదోట వారధి బాట...

అలరించే పాటలతో వారధి తోటలో విహరిద్దామా...పదండి వారధికి

వారధి... 
ఇది తెలుగువారిది                

24, ఫిబ్రవరి 2016, బుధవారం

తాగుతా మత్తుగా -Perady


తాగుతా మత్తుగా చిత్తుగా
తాగుబోతులా తాగిపో మెండుగా నీ గుండె నిండుగా..

తాగుతుంటె తనువు కాస్త మొద్దు బడతది
మొద్దుపడ్డ మెదడు నీకు మరపు తెస్తది
మరపులోన మెరుపులాగ గురుతు వస్తది "2"
అది  భార్యలా కంటపడి మత్తు దిగుతది     “తాగుతా మత్తుగా”

సతి పెట్టే బాధలు విధి ఆడె వింతలు విస్కీలు బ్రాందీలు ఆపలేవురా..
చెప్పుకున్న సిగ్గుచేటు  చెప్పకుంటె  తలపోటు ఓర్చుకోక తప్పదురా చాన్నాళ్ళు
పెళ్ళాలు లేనోళ్ళు మంచోళ్ళు..
ఉన్నోళ్ళు మందుకొట్టే మహా పురుషులు…“తాగుతా మత్తుగా”

రింగ రింగ రింగ -perady



పని పాటా లేక తిరిగే ఓ జులాయిని ఇంటి నుండి గెంటేసిన పిదప జరిగే కథ.

రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
రోసం పుట్టి వీసాని పట్టీ  అమెరికాకు వచ్చేశాను
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
బతకలేని బడిపంతులాగా  బాల్టిమోరులొ అడుగెట్టాను
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె

కడపలోన గడపలేక రోతే పుట్టి ..డాలరంటె తగని నాకు మోజే పుట్టి
బాల్టిమోరు చేరినాను చేరినాక ఎదురు చూసినా.. ఎవరి కొసం?
మాయ మాయ మాటలతో మస్కా కొట్టీ  ఎంప్లాయర్ ముంచాడు నిల్చోబెట్టి
న్యూజెర్సీ కెల్లినాను న్యూయార్కు కెల్లినాను ఆస్టిన్ కు ఎల్లినాను బోస్టన్ కు ఎల్లినాను

బాల్టిమోరుకూ వచ్చి సెట్టయాను

మరిక్కడ ఎంప్లాయెర్లు ఏం జేశారు..?

రేటులోన వాటాలు మరిచి నాటా బాటా పట్టించారు

రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
వచ్చి రానీ తవికల్తో  ప్రజను పొలి కేక పెట్టించారు

రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె

ఇదిగో  రోషయ్యా.., అదంత సరేగాని
అసలు ఈ అమెరికా  గోలేటి?

యవ్వనాల సంకెళ్ళు తెంపి బంధనాలను తెంచేవారు
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
వచ్చి రాని వయసుల్లో జారి   చదువు సంధ్యలు తగవన్నారు
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
భాలికలే భయములేక భామలాయెరో..

ఏలికలే మరిచినారు యువతరాన్నిరో
అడ్డమైన తిరుగుల్లే ఉల్లాసంగా
Odd job చేరతారు ఉత్సాహంగా

కొలువులేని మమ్ము జేరి  H1Bలు ఇచ్చారుగా ఎవరికోసం?

ఇంగిలీసు నేర్పినారు client దగ్గరా..

వారానికి మూడు రోజులింటి వద్దరా

ఇరు జీతాలెత్తిపెట్టి ఇరుకు గదులు వదిలిపెట్టి

విలాసాలు పక్కనెట్టి నివాసాన్ని చక్కబెట్టి

కన్నవారిని సైతం మర్చి పోయారు..

బాబోయ్, మర్చిపోయార! ఇంకేం చేశారు?

వీధికొక్క వారధినే కట్టి తోటి వారిని విడగొట్టారు
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
ఉన్న గుంపును చెడగొట్టినారు కులపు  కంపును ఎగదోశారు ..
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె

దేవుడు వరమందిస్తే-perady


భర్తల బాధలు వింటే కడుపే చెరువు అవుతుందే..
మగువల తెగువలు చూస్తే తగువే తగదు అంటారే
 అంబానికైనా ఉందా అర్ధాంగిని కాదనె ధైర్యం
 బాహుబలి  వీరుడికుందా  చెలిపై తను గెలిచే శౌర్యం
 మగవాడి జన్మిక ఇంతేలే…

పెళ్ళి మాట వినగానె మనసు మురిసి పోయిందే..
మూణ్ణాళ్ళ ముచ్చట కాగా అసలు రూపు చూపిందే
 హా పూటకో ప్రతిసారి తన అందం పొగడాలంది
 కోరినది కాదనకుండా షాపింగులు చేయాలంది
 పగలే నాకు చూపెట్టె పై చుక్కల్లు
 కునుకైన పడనీదె తన పక్కలో
 ఇక దేవుడిని నే వేడనా..? తీరిపోలేని  మనో వేదనా.."భర్తల బాధలు"

పెందలాడె ఇంట్లో ఉన్న అంట్లు తోమి పెట్టాలంది
 సందెవేళ కాఫీ తోటి తన కాల్లు పట్టాలంది
 అలసిన తను అలకపూనితె లాలి పాట పాడాలంది
 పడకలోన పానుపు చేరి నిదుర మరచి ఆడాలంది
 ప్రతి రేయి విసిగించే కసి రాత్రులు
 దయలేని రాక్షసితో ఈ తిప్పలు
 నా lifeఅంతా వైఫే నా..Wi-Fiలాగా చుట్టేసెనా..?

దేవుడు వరమందిస్తే ఈ పెళ్ళే రద్దు చేస్తాలే…
ఇద్దరు ఒద్దికగుండే ఓ జంటే చూపమంటాలే....





6, జనవరి 2016, బుధవారం

వారధి !


తరలివచ్చే పురజనులకు కరములు జోడించి చేయు విన్నపం
ధరణిలో సారముంటే రైతు జీవనం సస్యశ్యామలం
తరుణిలో శరముంటే తరగని సుఖములు పురుషుడి సొంతం
వరుడిలో వరములిచ్చే నరముంటే తన చరణమే వధువుకు శరణం 
వారధి మీ చెంత ఉంటే అవధులెరుగని ఆనందం అందరి సొంతం

Silsila-Parady

Silsila-Parady -Dekh Ek Khwab..

He: అందమైన చందమామ తొంగి చూసెనే..

చూసినంత మేర జాజి పూలు విరిసెనే  "2"

She:తడి ఆరని కన్నులతో నే పిలిచినా

పూల మీద మనసుపడి నన్ను మరిచెనా..?"అందమైన చందమామ "


He:నీ మేని గంధాలే శ్వాసలైనవే

She: ఆ శ్వాస నా ఆశల ఊపిరైనదే..

He: నీ పైట పాటకే నాట్యమాడెలే

She: ఆ నాట్యమెనక నీ చూపు తాకిడే

He: చూపులన్ని కలబోసి కలలు రేపెలె

She:  కలనైన కనలేని కానుకైతివే..."అందమైన చందమామ "


She: నా ఎదే నీ మదిలో పదిలమాయెలే

He:  వదలని కౌగిలిలో కరిగిపోయెనే

She:కరిగిన వయసు నీకు హారతిచ్చెనే

He:వయసున వన్నెలన్ని వెండి వెన్నెలే

She:వెన్నెలంటి మనసుల్లో నీ పాటలే

He: పాటవెంట పరుగు తీసె నీ ఆటలే.. "అందమైన చందమామ "

దీపావళి వేడుకలలో ..

దీపావళి వేడుకలలో ..

హైందవ ఆచార సంస్కృతికి ఆలవాలమైన దీపావళికి నిలయమైన మా నివాసంలో జరిగిన దీపావళి వేడుకలలో ..

దివ్య జ్ఞాన జ్యోతులే నవ్య కాంతిధారలై

కోమలి కొసరి అందాలే  కోవెల దీపపు చందాలై 

తరుణుల చిరు నవ్వులే అరవిరిసిన  తారాజువ్వలై

లలిత లావణ్యములే హిమజపు చరణములై 

చంద్రకాంతులే  శివ పార్వతుల శిరపు మణికంఠికలై

గీతాచార్యుడి చైతన్య స్రవంతులే దివ్య దీప ధారలై 

స్వప్న లోకాలే బిందు సౌరభాలై సాక్షాత్కరింపగ  

పసి మనసుల నూతనోత్తేజముతో భాసిల్లిన దీపావళి వేడుకలలో పాల్గొన్న  మీ అందరికీ ధన్యవాదాలతో..



-చంద్ర

ఇందులో దాగున్న పత్యేకత ఎమిటో చెప్పుకోండి చూద్దాం..