5, సెప్టెంబర్ 2016, సోమవారం

చినుకు చినుకు పడుతూ వుంటే..పాటకు పేరడీ..

చినుకు చినుకు పడుతూ వుంటే..పాటకు పేరడీ..


చుక్క చుక్క పడుతూ ఉంటే కిక్కు కొద్దిగెక్కేస్తుంటే
పెగ్గు మీద పెగ్గేస్తుంటే తగ్గకుండ తాగేస్తుంటే..
ఉంటే..
జోహారు జోహారు ఈ మందుకు సరి లేరు వేరెవరు ఈ చందుకు


1:వారమంత వత్తిడిలోన  వర్కుల్లోన చిత్తవుతుంటే
బీరు తప్ప నీరేం ఆపునూ….


భారమైన బతుకుల్లోన భార్య వేసే షోకులు చూసి
షాకు కొట్టి షేకైపోదునూ..
తెరిపి కాస్త కావాలంటూ మనసు గోల పెడుతుంటే..
జోహారు జోహారు ఈ మందుకు సరి లేరు వేరెవరు ఈ చందుకు


2.వంటి జీతగాడై ఉంటే వంటరాని జంటది ఉంటే
మింటినంటే ఖర్చేం ఆగునూ..?

జీసీల్లేని బతుకుల్లోన వీసా పెట్టే మెతుకులు తింటే
బతుకు బండి ఎట్టా లాగుదూ..?
చిక్కులన్ని పక్కకునెట్టి పక్కలోని సిరాక్ ని ఎత్తి ....వేస్తే
జోహారు జోహారు ఈ మందుకు బేజారు పదకుండా పద ముందుకు…

వారధి నిలిచింది చిరునామాగా!


కరుణించిన వరుణుడు భానుడికి తోడు రాగా,

 

సహకరించిన వాయు దేవుడి వింజామరల వీచికల చల్లని చిరుగాలి వెంట  రాగా ,

 

దాతల దాతృత్వం వారధి వెన్నుదన్నుగా అండగా నిలవగా..

 

వందలమంది పురజనులు ఉగాది పర్వదిన సంబరాలను చూడ తరలిరాగా ,

 

వారధి గుమ్మంలో కమ్మని ఉగాది పచ్చడి రుచి చూడగా,

 

అచ్చెరువొందే వేడుక సొబగులతో వేదిక అలంకరించగా,

 

కనిపించని తెలుగుదనపు లోగిళ్ళు కళ్ళ ఎదుట సాక్షాత్కరింపగా,

 

వినిపించని సంగీత స్వర రాగ జల్లులు పిల్లలు ఆలపించగా,

 

విశాల ప్రాంగణంలో పంచాంగ శ్రవణం ప్రబోదించగా,

 

పరవళ్ళు తొక్కే పడతుల శుభారంభం సుందర స్వప్నానికి ప్రమిదలవ్వగా,

 

చిమ్మ చీకటిలో శివతాండవ నాట్యంలో  రేడియం కాంతులు మెరవగా

 

ముద్దుగారే పసి మొగ్గలతో అద్భుత బాల రామాయణం చిత్రించగా,

 

వారధి చరితలో నిలిచె బాల రామాయణం తలమాణికముగా ,

 

వీక్షించిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నునంటగా..

 

మావిడి పచ్చడి కమ్మదనం,పూత రేకుల తియ్యదనం,పసందైన రుచులు పండుగను ప్రతిబింబించగా..

 

సనాతన సాంప్రదాయ సంబరాలకు వారధి నిలిచింది చిరునామాగా!

స్నేహానికి ..





కొందర్ని చూస్తే


ఎదలో కోటి రాగాలు వీణ మీటుతాయి


రాగాలు రంజిల్లి మేళ తాళాల సాక్షిగా ఒక్కరు


నీ గుండెలో గూడు కట్టుకుంటారు…


కొందరితో పరిచయమవుతే


కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది


ఆ ఆలోచనలకు అర్థవంతమైన భావాలతో ఆలంబన దొరుకుతుంది.


ఆ పరిచయం పేరు చిరునవ్వు అయితే


చిరునవ్వుకు చిరునామాగా నిలిచిన నిను చూస్తే


స్నేహానికి కొత్త నిర్వచనం తడుతుంది స్నేహ సౌరభాలు వెల్లివిరిస్తాయి !



మదిలోని తలపులని..

కడు జాగ్రత్తగా దాచుకుంటావు మదిలోని తలపులని
 
ఒక్కొక్కటిగా తలపుల తలుపులు తెరిస్తే
 
నిగూఢమైన నిక్షిప్త ప్రేమ సందేశాలెన్నో?
 
మస్తిష్కంలోని అస్తవ్యస్తమగు ఆలొచనల పరంపర
 
రూపు దిద్దుకొనక అణగదొక్కబడిన వేళ
 
వెన్నెల చిన్నబోయి జాబిలి కనుమరుగాయెనో కదా..?

మనసిచ్చింది!

శిశిరపు పొద్దుగూకే వేళ భానుడు తన గూటికి చేరే వేళ
 
విరిసిన విరితేనెల చందనమో
 
కురిసిన మెఘమధనపు గ్రీష్మ తాపమో
 
మెరిసింది అందం...
 
వందనాలు అందానికి చందనాలు సరి తూగవు వర్ణానికి
 
వనంలోని కవనంలా వసంతంలోని కోయిలలా
 
సెలయేటి జలపాతంలా చెలిపాడే లయ గీతంలా
 
ఏరువాకాన ఎదురొచ్చింది కోరుకున్నాక మనసిచ్చింది!