2, జనవరి 2017, సోమవారం

mere naina-peradee


నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ నిను మార్చే తీరేదీ..? 2”
 
1) ప్రేమ బంధాలే.. కన్నీటి గండాలై
నీ ఆటలోనూ పాటతోనూ
ఎదలోని భారం తీరేనాచెలి దూరం తరిగేనా...
 
కలలే కరిగి శిలగా మిగిలే
కొన ఊపిరె నా శ్వాసా..నీ ఉనికే నా ఆశా
 
2)నిను కలిసే దారి  లేదా కడసారి
గుండె కోతా బ్రహ్మ రాత
ఇకనైన రేపు మారేనామనసై చెలీ చేరేనా..
 
చెరగని మదినే చేశానె గుడిగా
కనుమూసేలోగ రావా తనువిడిచే లొగ రావా..

నీ జ్ణాపకాలే....


నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ నిను మార్చే తీరేదీ..?
నువు కాదంటే పెను చీకటి లోకం మున్ముందు ఎలా తీరును శోకం?
 
నిరంతరం నీ ధ్యాసలో వెల్లువలా పొంగే నీ నవ్వుల  శ్వాసలే
 
నా ఆశల ఊపిరవగా
 
ఛిక్కి శల్యమౌతున్న దేహాన్ని అడుగు నా దాహమెంత పవిత్రమైనదో?
 
కనులముందు నిలుచున్నా కంటతడి కారుతున్నా
 
అక్కున చేరని అందాన్ని లెక్కచేయని నీ పొగరుని నిలదీస్తున్నా
 
అనంత విశ్వంలో పవిత్ర ప్రేమకు ఇంకా స్థానముందా అని?
 
తలవని తలంపుగా రేగే తలపులు మది తలుపులను ఎగదన్నుకుంటూ
 
హృదయాన్ని విచ్చిన్నం చేస్తుంటే ..విధిరాతలో  గుండె కోత గాయపు
 
వ్యధలను మునిపంటితో అదిమి బయటపడలేక..హృదయాంతరాలలో ఇముడ్చుకోలేక,
 
ఎవరికి చెప్పాలో తెలియక ఎవరికీ చెప్పుకోలేక..నాకు నేను అర్థంగాక
 
చేతకానివాడిలా నీముందు అచేతుడినయ్యానుకరుణిస్తావోకనికరిస్తావో.. కాటేస్తావో.. లేక... కఠినంగా శిక్షిస్తావోనీ విజ్ణతకే వదిలేస్తున్నా..

కొత్త సంవత్సరపు వేడుక..



సందేల  సూరీడు తొందరగా  తన గూటికి జారుకున్నాక

కోట్ల మంది మదిలో మెదిలిన కొత్త సంవత్సరపు వేడుక

ఊపిరి పోసింది ఉత్సవానికి చీకట్లు ముసురుకున్నాక

ఎప్పటిలానే తరుణిల తగరపు మెరుపుల తరుణమిక

మింటినంటిన తారలను తలదన్నే తళుక్కులని వీక్షించక తప్పదిక

భారీగా తరలిన జనం క్రిక్కిరిసిపోయిన జన ప్రభంజనం

బారులు తీరిన జనం ఏరులా పారిన సుర పానం

దేదీప్య మణుల కాంతిమయం దేవలోకాన్ని మరపించే కాంతలమయం

లయబద్దపు సంగీతపు హోరు లావణ్యపు రమణుల జోరు

అంచెలంచెలుగా మించిన పాటల బీట్

చిందులాటలో పెంచిన జనాల హీట్

మధ్య మధ్యలో raffles కిక్కు

gold coins తో జనాలకు లక్కు

షడ్రసోపేత విందుల మ్యాజిక్

ప్యారడైజు వారికే చెల్లిన లాజిక్

అరుదెంచి ఆరగించడం అతిధుల లక్

అన్నదాన కార్యక్రమ సందర్భంగా రాసిన చిన్ని రాతలు..


కాళీ Templeలో వారధి తలపెట్టిన అన్నదాన కార్యక్రమ సందర్భంగా రాసిన చిన్ని రాతలు..
 
ప్రకృతి మాత తన రెక్కలు విప్పిన క్షణాన..

అంతవరకూ అందంగా అమరిన ఆకులు 

శరదృతువుకు స్వాగతం చెబుతున్నట్టు రాలగా..

అప్పుడే నెలబాలుడు నింగిలో తొంగున్నట్టు దోబూచులాడగా..

బ్రతుకమ్మ చెక్కిలిపై బంతిపూలు విరబూశాయి

తెలుగోడి గుండెల్లో ఆనందపు జల్లులు వెల్లివిరిశాయి!

దేవీ నవరాత్రుల సేవలో దేవేరీలు తరియింపగా

జగన్మాత పూజకై జనులందరూ తరలిరాగా

కాళీ మాత గుడిలో దుర్గామాత ఒడిలో

విచ్చేసిన భక్తులకు అన్నపానాదులను అందివ్వగా

జగన్మాతకు జనులకు నడుమ వారధి ప్రమిదవ్వగా

వారధి సేన తరించింది పరుల సేవలోని పరమార్థాన్ని సగర్వంగా చాటింది!
 
విజయదశమి శుభాకాంక్షలతో...

అందాల రాక్షసి..


ఒక్కో క్షణంలో అది అహంకారమనిపించినా…

మహా ముద్దొచ్చే ఆ అందానికి అదే అలంకారం కాబోలు..

పదే పదే ప్రదర్శిస్తూ అసహనానికి ఆఖరి మెట్టున

ఒక్కసారిగా తన అధరాలతో ముద్రిస్తుంది ఓ మధుర సంతకం..

ముద్దు ముద్దు పలుకుల్లో హద్దులెరుగని రసికత ఎంత దాగి వున్నా

తీర్చి దిద్దిన ఆ నాసికం ,కాటుక అద్దిన ఆ నయనం,

అధరాల మధురిమలకే అసూయ పుట్టించే ఆఅధరం

పొందికగా అమర్చిన ఆ రేసుగుర్రాల ద్వయం

ఒద్దికగా వుండే వయ్యారికి వన్నె తెచ్చే ఆభరణం!

నిరంతర ధ్యాసలో  నీ ఉనికే ఊపిరిగా,నీ ఆశే నా శ్వాసగా,

నీ పలుకే నను మేల్కొలిపే ఉషోదయపు వేకువలా,

నీ చూపే నా దేహానికి దాహమిచ్చే దాహార్తిలా

నీ పేరే నా జీవన గమనంలో నను నడిపించే సారధిగా

జీవిస్తున్న ఈ జీవికి రెయింబవళ్ళు నువ్వే కలవరం…..కాస్తైనా కలగదా నీకు కనికరం?

ఇంత కన్నా ఏమి చెప్పగలను నీకు !!

నీతో ఏదొకటి ముచ్చటిస్తే కానీ పొద్దు పోదు నాకు

నీతో గడిపిన క్షణాలను తలుచుకుంటే గానీ కాలం విలువ తెలియదు నాకు

నీతో చెప్పుకున్న వూసుల బాసల మాలలతో అల్లిన పందిరి కింద సేదతీరితెగానీ అలసట తీరదు నాకు

నీ నవ్వుల హరివిల్లులే వీనులకింపైన కోటి వలపు వసంత రాగాలని తెలియలేదు నాకు

నీ చల్లని ఒల్లో పడుకొని చక్కని కళ్ళలో చూస్తే గానీ  కోరితే వచ్చిన వన దేవతవని తెలియలేదు నాకు

నీవిచ్చే అధరాల మధురిమల్లో తేలియాడితేగానీ అవధులెరుగని ఆనందలోకాలు కనపడలేదు నాకు

నువ్వు చేసే సద్విమర్శలే కనుమరుగవుతున్న స్నేహితులను కానుకగా దరిజేర్చింది నాకు

నీ కనులలో సుడులు తిరిగిన కన్నీరే సుగంధాల బంధాలను పరిచయం చేసింది నాకు

ఇంత కన్నా ఏమి చెప్పగలను నీకు !!

దేశీ చాట్-MD Whatsapp Group


అవసరమున్న చోట అందరికీ అందుబాటుగా 
ఉద్యోగాన్వేషణలో ఊపిరాడని నిరుద్యోగుల బాసటగా
కోటి ఆశలతో  కొత్తగా అడుగెట్టిన ప్రవాసులకు అండగా
ఆయా అవసరాలకు మానవ వనరులనొసగే కల్పతరువుగా
కనుమరుగవుతున్న తెలుగుదనాన్ని అందించే నిరంతర స్రవంతిగా
దేశీ ప్రయాణపు అన్ని అవసరాలకు ఆలంబనగా
ఎప్పుడూ మన వెంటే నడిచే ప్రియ మిత్రుడిగా,ఆత్మ బంధువుగా
ఇంతలా ఈ ప్రాంతపు వారి కంటికి వెలుగై ఇంటికి గడపై
భాసిల్లుతున్న ఈ "దేశీ చాట్" మన దేశీయుల జాక్ పాట్

పుట్టిన రోజు శుభాకాంక్షలు!

మావోడు గుర్తొస్తే స్ఫురించే మొదటి పదం స్నేహం

ఆ జ్ఞాపకాలను తడిమితే సౌహార్ధ తీరంలో గుబాళింపులు పరిమళించినట్లే..

పొదుపైన సున్నితపు మాటలు ఆ మాటల్లో ఎడతెగని మొహమాటాలు

మొహమాటాల నడుమ తొణికిసలాడే చిరునవ్వులు

చిరునవ్వుల వెనుక చెక్కు చెదరని  ఆత్మ విశ్వాసం

ఆత్మ విశ్వాసానికి అవసరమయ్యే ధైర్యం అతని నేస్తం!

ఆ ధైర్యం మాటున దాగివున్న మానసిక ధృడత్వం ఆతని సొంతం!

మనలొ ఒకడిగా ,.......తల్లో నాలుకలా

అందరికీ చేదోడుగా ......కొందరికి అన్నయ్యగా

బతుకమ్మని సేవించే వీర భక్తుడిగా

పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడిగా

తన పుట్టిన రోజు జరుపుకుంటున్న రవి ముక్తకు ఇవే

మా జన్మదిన శుభాకాంక్షలు!

నూతన సంవత్సర శుభాకాంక్షలతో...2017


గగనపు వీచికల గాలి పరిమళమా

పరిమళించు మానవ  బ్రతుకుల మలినాలని....


మరుగున పడ్డ మానవత్వమా....

నివారించు పసికందులపై అఘాయిత్యపు ఆగడాలని..


మదిలో కొలువై మందికి వెలుగై నిలిచిన సమాజమా..

కడతేర్చు ..కుల ప్రాంత వర్గ వైషమ్యాలు రేపే కుత్సితులని


కెరటపు హోరులో ప్రతిధ్వనిస్తున్న సంద్రమా...

నినదించు ఏనాటికైనా నిశీధపు నీడల్లో నీచులు మనగల్గలేరని


పుడమి కడుపులో పురుడోసుకున్న కొత్త సంవత్సరమా.....

దీవించు..కోటి ఆశల యవనికపై కొంగొత్త కలలకు శ్రీకారం చుట్టే మానవాళిని..


నూతన సంవత్సర శుభాకాంక్షలతో...


T