9, ఏప్రిల్ 2018, సోమవారం

గుర్తుకొస్తున్నాయి..





గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..


నీదారిలో నా ప్రేమలో


నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి


గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..


 


మొదటిసారిగా కలిసిన నిమిషం


ఏమరచానే రెప్ప వేయడం


మొదటి ముద్దుకై వేగిర పడగా


మాటల మాటున దాటెను త్వరగా


మొదటిసారిగా చేరిన కౌగిలి


మబ్బు మాటున దాగిన జాబిలి


ముద్దులాటలో అందిన అధరం


తెనెటీగలా పొందెను మధురం


 వయసు వేడిలో చేసిన తప్పు


పెళ్ళితోనె సరిజేసెను ముప్పు


గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..

నా నువ్వే..!







నా అక్షర సామ్రాజ్యంలో..

దశాబ్దము పాటుగా నన్ను నేను చింత్రిచుకొనే క్రమంలో


ప్రభంధాలు చదవకపోవచ్చు కానీ ప్రపంచాన్ణి చదివాను


ఇతిహాసాలు అవపోసన పట్టక పోవచ్చు కానీ యతి ప్రాసలు జీర్ణించుకొన్నాను


ప్రణయ కావ్యాలు లిఖించకపోవచ్చు కానీ ప్రణవ నాదాన్ని స్మరిస్తూనె ఉన్నాను!


నీకై చిన్న జ్ణాపికను చిత్రించే క్రమంలో మాత్రం


ఎందుకనో ప్రతి సారి నాకు నేను దూరమవుతున్న..నీవాన్ని కాలేక పోతున్న.. నా దాన్ని చేసుకోలేకున్నా..!


ఏమి చేసినా..ఇది కాదేమోననిపిస్తుంది..ఏది నచ్చుతుందో తెలియక ఎలా ఒప్పించాలో ఎరుగని నా హృదయం


నిరంతరం తల్లడిల్లుతూనే ఉంది..


ఏమి చేయగలను..? ఎలా నా మనసుకు నేను శాంతి చేకూర్చుకోగలను? వేధించే నా ప్రశ్నకు ..కనిపించే జవాబు……నీ నవ్వేనా నువ్వే..!

వారధి..





వారధి అన్న నదిలో


ఫ్రవాహమెంత ఉధృతమైన…ప్రయాణం ఆగదు


ఎదురుగాలులు ఎదురేగినా ..దారి తీరులు వేరైనా


కెరటాలు లోగుట్టు తట్టుకుంటూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాగిపోదాం


నడిపించే నావికుడి ధీరత్వం,వెంట నడిచే సైనికుల


శూరత్వం ముందు గడ్డి పోచలాంటి ఇలాంటి అడ్డంకులు తలొంచక తప్పదు.


నావకు చిల్లులేసే ధూర్తులెందరున్నా,ఒడ్డు చేరనీక తెడ్డు అడ్డు వేసే వంచకులున్నా


నావ తీరం చేరక ఆగదు…దరికి విజయం చేరక మానదు.


వారధి కార్యకర్తలందరికీ ఈ విజయం అంకితం.

పాటై ..కదిలాడు







మట్టిలో పుట్టిన మాణిక్యమనాలో..


ఆవనిపై అరుదుగా జనించే ఆణి ముత్యమనాలో..


పట్టుమని పదినెలలైనా అయిందో లేదో కలిసి


కలలా వచ్చాడు….


గళంతో మనసు దోచాడు


మందిలో పాటై కదిలాడు 


మదిలో మాటై మెదిలాడు


కమ్మని కంఠ స్వరానికి చిరునామై నిలిచాడు


వందలాది ప్రజల ఎదలు గెలిచాడు ..


మనసుకు దగ్గరైన మాన నీయుడు


నేడు..మనకు దూరంగా వెడుతున్నాడు..

పుట్టిన రోజు శుభాకాంక్షలతో…





కొందర్ని చూస్తే
ఎదలో కోటి రాగాలు వీణ మీటుతాయి
రాగాలు రంజిల్లి మేళ తాళాల సాక్షిగా ఒక్కరు
నీ గుండెలో గూడు కట్టుకుంటారు


కొందరితో పరిచయమవుతే
కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది
ఆలోచనలకు అర్థవంతమైన భావాలతో ఆలంబన దొరుకుతుంది.


 


పరిచయం పేరు చిరునవ్వు అయితే
చిరునవ్వుకు చిరునామగా జనా నిలిస్తే
స్నేహానికి కొత్త నిర్వచనం తడుతుంది
నిష్కల్మషమైన నిలువెత్తు జనార్ధనుడి రూపం
కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంది
 


పుట్టిన రోజు శుభాకాంక్షలతో

అజ్ఞాత వాసీ?





గుప్పెడంత మనసుల ఎదను తెరచి


కోటి ఆశల అభిమానపు తివాచి పరచి


వెలకట్టలేని అభిమానాన్ని గుండెల్లో దాచి


ఎప్పుడెప్పుడా అని వేయి కన్నులతో ఎదురు చూచి


తొలీఅట కోసం ముందు రోజు నుండే నిదుర మరచి


ఆపసోపాల ఇక్కట్లలో టిక్కెట్లు తీసి


అభిమాన హీరో ఎంట్రీ కోసం అర్రులు చాచి


ధియేటర్ గోడలు బద్దలయ్యేలా అరచి అరచి
ఆశగా ఎదురు చూస్తేచివరకు మిగిలేది….నిరాశేనా అజ్ఞాత వాసీ?

నైజం..





నాడు అవే కళ్ళు చూసీ చూడంగానె వర్షించేవి


నా మాటల పాటలకై పరవశించేవి


నాడు అవే అధరాలు అందీ అందకుండా ఉన్నట్టు తొణికిసలాడెవి


నా పెదాలతో తగవుకై పరుగులు తీసేవి


నాడు అవే చేతులు కౌగిలి గుమ్మం దగ్గర కాపు కాచేవి


నే కన్న కలల కౌగిలి వాకిట కమ్మని కబుర్లు చెప్పేవి


 నాడు అదే గొంతుక కొత్త భాష్యంతో వింత గొలిపేది


నే చూడని ప్రపంచాన్ని నాకు చూపేది


కాగా కాల గమనంలో అహం మాటున నేడు కనుమరుగైనది ..


ఇదీ మనిషి నైజం….విధి చెప్పే వింత నిజం



వారధి!







మబ్బులు కమ్ముకున్నా చీకట్లు ముసురుకొన్నా


 చలిగాలులు తరుముతున్నా వేడి గాలులు చిమ్ముతున్నా


స్థబ్దతే రాజ్యమేలినా  నిర్లిప్తతే ఆవరించినా


గగనమే రగిలినా సునామే చుట్టినా


సంగీత సాహిత్య  సంస్కృతులే వారధి  శస్త్రాలుగా


అలుపెరుగని యోధులే వారధి అస్త్రాలుగా


బిగించిన ఉక్కు పిడికిలితో వారధి నుదుట


విజయ తిలకం దిద్దే నిరంతర శ్రామికులుగా


గెలుపన్న పిలుపే వారధి చిరునామాగా


అలవాటై విరాజిల్లుతున్న వారధి తల్లి ఒడిలో వికసించే మరో ఆణిముత్యమే


రాబోయే దీపావళి  దసరా సంబరాల సం రంభాలు...తరలి రండి


ప్రవాసులకు కనుమరుగవుతున్న కమనీయ దృశ్యాలను దర్శించండి..




వారధి!
తెలుగు సమాజపు పరిధులు పెంచే సారధి………  

హృదయం..







మాటలో మాటగా పలకరించా


చిలకలా కిల కిల కిలమని నీలో నవ్వులు పూయించా


ఇదీ అందరి పరిచయాల మాదిరే అని తలచా..!


ఏమూలో నాలో దాగియున్న  ప్రేమ భాండాగారాన్ని నీరాకతో తెరిచా..


మది పులకింతలను కుదిపేశావన్న నిజం ఆలస్యంగా గ్రహించా..


నీ మాటల మత్తులో మరులుగొప్పి పరవశించా..అది నిజమని భ్రమశా


నాకు నచ్చిన పాటలను నువ్వు వింటుంటే..అభిరుచులు కలిశాయే అని అవ్యక్తానుభూతికి లోనయ్యా..


ఎంత ప్రెమో అని సంతసించి మిన్నునంటే ఆశల సౌధాలు నిర్మించా..


నా ప్రపంచాన్ని నాకే కొత్తగా చూపించే నిన్ను చూసి మైమరిచా..


కానీనీదైన ప్రపంచంలోకి నన్ను లాగావన్న నిజం ఆలస్యంగా గుర్తించా..

పిడికెడంత హృదయంలో నీ అనంత ప్రేమని పొంద లేనని మూగగా రోదించా..


అంతులేని నీ ఆశల పూదోటలో గడ్డిపోచనై గుడ్డివాడిలా చీకటిలో వెదుకుతున్నా..నీ బతుకు బంగరు బాట కోసం జీవిస్తున్నా..!


 

మీ వారధి..







ఎన్నో ఏళ్ళుగా బతుకు పుస్తకంలో


 ప్రతి పుటను ప్రకృతి పలకరిస్తుంది


ప్రతి అక్షరముతో కరచాలనము చేస్తుంది


ప్రతి మనిషికి పంచభూతాలనందిస్తుంది


కాలంతో కదులుతూ తన కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తిస్తుంది


మనిషిగా నీ  దాతృత్వ గుణాన్ని నిర్వర్తించమంటుంది


అపుడే ధర్మం నాలుగు పాదాల నడిచే ఆలంబన కలుగుతుంది


రండి కదిలి రండి కలసి రండి వారధి తలపెట్టిన


దాతృత్వపు విరాళాల సేకరణలో పాలుపంచుకొనండి..తద్వారా
అవిటివారిని ఆదరిద్దాం..
అంధులను ఆదుకుందాం..
రేపటి ఆశకు చీకటి తెర తొలగిద్దాం
వారి కంట్లో 'ఆశా కిరణాల' వేకువ చూపెడదాం


మీ వారధి..
సమాజపు పరిధులు పెంచే సారధి..

కోటీ..సంగీతము మాష్టరూ..


music పేటకు మాష్టరూ  ..మ్యాజిక్ చేసే బ్లాష్టరూ

క్లాస్ మూవైనా మాస్ మూవైనా ఖబడ్దారు హిట్సే..

కోటీ..క్లాసు మాష్టరూ...కోటీ..మాసు మాష్టరూ..

హోయి రబ్బ హోయి రబ్బ హోయి రబ్బ రో

1:హె సాలూరింట పుట్టాడు..అరె ..సంగీతము చేపట్టాడూ

నాన్నే గురువై పెరిగాడూ..చక్రవర్తీ సరసన ఎదిగాడూ

ట్యూను ఇచ్చిన పాటలతో క్యూలో నిలబడె నిర్మాతల్

జనము మెచ్చే పాటలతో జగతినే మురిపించాడే

నైజాము సీడెడులో ఆంధ్రాలో అంతటా

కోటి గారి రాగాలే కోట్ల మంది నాలుకపై

నడిచే పాటకు నాందీ పలికిన సప్త స్వర మేటి...

కోటీ..మాసు మాష్టరూ...కోటీ..క్లాసు మాష్టరూ..

హోయి రబ్బ హోయి రబ్బ హోయి రబ్బ రో

2 :హె పోటీ పాటల వేటలో పాటే శ్వాసగ కదిలాడూ

కోటి తారల మధ్యలో కోటీ "స్వర"మై ఒదిగాడూ

విలువ పెంచె పాటలతో నిలువ నీడగ నిలిచాడు  

తెలుగు పాటకు చిరునామై ఎందరో ఎద నిలిచాడు*  

చిరు పాటకు దరువేస్తే చిరంజీవి చిందేస్తే

థియేటర్లో మోత రా కోటీ గారి పాటరా 

రహమాన్ కైనా..మణిశర్మకైనా గురువు గారు ఒకరే….వారేమాసు మాష్టరూ...కోటీ..క్లాసు మాష్టరూ..

హోయి రబ్బ హోయి రబ్బ హోయి రబ్బ రో