21, నవంబర్ 2019, గురువారం







ఓ గణపయ్యా ..


వేడి సూరీడుకి చల్లని పిలుపునిచ్చి ..

నీలాకాశాన నీలిమబ్బులను మలచి ..

దోబూచులాడే తెమ్మర గాలులని రమ్మని పిలిచి...

ముల్లోకాన విహరిస్తున్న ముక్కంఠుని అర్తించి ..

పెందలాడె అందరి డెందములందు నిలిచి ..

ఇంటిల్లపాది అల్లిన పాలవెల్లిన పవళించి ..

తలపోసిన ఘన కార్యములందు మము కరుణించి

దీవించి గెలిపించాలని ప్రార్థిస్తూ..

వినాయక చవితి శుభాకాంక్షలతో..
చంద్ర ..కాటుబోయిన

1, నవంబర్ 2019, శుక్రవారం

రాను రానంటోంది చిన్నదో..చిన్నదో ..Peradee


He:రాను రానంటోంది చిన్నదో..చిన్నదో

వరి చేలోకురికొచ్చే కుర్రదో కుర్రది

వద్దు వద్దంటోందీ ముద్దురో..ముద్దురో..

నచ్చాక వదిలి పెట్టకందిరో…..అందిరో

కంటపడి వెంట పడి పంట చేలొ పట్టుబడి

సిగ్గుపడి చీరజార్చె చిన్నది

రివ్వుమనే గువ్వలా  ఎగిరెగిరి పడుతుందే

పరువానా పూతకొచ్చె పిల్లదీ

She:ఔనా బావా పైటా వదలవయ్యొ

ఇట్టా చేత్తే నాకసలె సిగ్గురయ్యొ

He:సిగ్గు సిగ్గంటుందీ సిన్నదో సిన్నదో..

కౌగిట్లో కరిగిపోతున్నదో కన్నెది

గుట్టు రట్టవుతుందీ వేళలో చేలలో..

మనువాడెదాక ఆగమందిరో సుందరీ..

నవ వసంతమా..


ఏడాదిగా ఎన్నో తడిజ్ఞాపకాలను ఒడి జేర్చిన నవ వసంతమా..

మరిన్ని మధుర తలపులను మదిని చేరనీయక వెళ్ళడం న్యాయమా..?

మొన్న మొన్ననే నా ఎద తలుపులను తట్తావు..

గుండె గుడిలోకి స్వాగతించిన పచ్చ తోరణాల హరితం వీడనే లేదు

పచ్చ కార్డుల పర్వదినానికి అంకురార్పణ జరగనేలేదు..

ప్రవాసుల ప్రయాసలు వనవాసానికేగనే లేదు..

విధించిన వలస చట్టాల కబంధ హస్తాలు వీడనే లేదు...

అపుడే నీ కాలము తీరి కనుమరుగవుతున్నావా..?

దూరమవుతున్న నీకు భారమైన హృదయంతో చెప్పలేకున్నా వీడ్కోలు..

చేరువవుతున్న నూతన సంవత్సరమైనా మా ఆశలు తీర్చాలని  చేస్తున్నా వేడుకోలు..

అందరికీ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. 

జన్మభూమినే మరచిన ఓ దేశీ -peradee(కర్మ భూమిలొ ..పూసిన )




జన్మభూమినే మరచిన ఓ దేశీ

తెలిసీ తెలియక అడుగే మోపీ

కన్నుల ఆశలు నీరై కారగ

కన్నవారికే దూరం అయ్యావా…”జన్మభూమినే”

కోటి ఆశలతో వీసా పట్టి

తోటివారిచే జాబును కొట్టి

రాని work తో కుస్తీ బట్టి

మస్తు నేర్పుతో మెప్పును పొంది

రాటుదేలినా ఓ ఇంజనీరా….

రాటుదేలినా ఓ ఇంజనీరా….

H1Bలకు కాలం చెల్లి

కలల సౌధాలు కాటికి చేరాయా…”జన్మభూమినే”

ఎంబసిలో ఏ వీసా ఇవ్వక

ఏళ్ళ తరబడి అమ్మను చూడక

బాల్య నేస్తాల స్నేహం మరవక

జ్ణాపకాలుగ మదిలో నిలుపగ

వేదన చెందే ఓ ఇంజనీరా….

వేదన చెందే ఓ ఇంజనీరా….

స్వార్థ నేతలే దేశ పాలులై

మానవ సమతకు మచ్చను తెచ్చారా…”జన్మభూమినే”

జీసీలింకా రానేలేదు
ఇయ్యేడింకా అవ్వనే లేదు
డేట్లే ఇంకా కదలనె లేదు
గేట్లే ఇంకా తెరవనె లేదు

డాలరు మోజున ఓ ఇంజనీరా…
డాలరు మోజున ఓ ఇంజనీరా…
దగాలు పడ్డి దిగాలు చెంది
నరకయాతనలో నలిగి పోయావా... ”జన్మభూమినే”

29, అక్టోబర్ 2019, మంగళవారం

వచ్చిందే -Fidaa




వచ్చిందే ముందుగ వారధి వచ్చిందే

పిదప TAMని తెచ్చిందే..

గమ్మున నిలబడనియ్యరే

కుదురుగ కూసోనియ్యరె

మెల్లా మెల్లగ వస్తారె

మెంబర్ షిప్పులు అంటారే

ఎక్కడ అప్పులు చేయించో

మాకు తిప్పలు పెడతారె


హేయ్ క్లోజు ఫ్రెండంటూ దగ్గరకొస్తారే

ఎదో కమిటీలో ఇరికించేస్తారే

వంద కొట్టి  వంగోబెట్టి

నన్ను ఉల్ట సీదా చేసిండ్రే.. “వచ్చిందే”

లీడర్లు జాదుగాళ్ళు

లీడర్లు జాదుగాళ్ళు

మస్క కొడతా ఉంటరే

నువు వెన్న పూస లెక్క

కరిగితే అంతె సంగతే


ఓ సారి నువ్వే దిగితే  నీ లైఫు మటాషేరా

బురదైతే కడుక్కుంటాం..

వరదైతే ఇరుక్కుంటాం

వచ్చిందే ముందుగ వారధి వచ్చిందే
పిదప TAMని తెచ్చిందే..
గమ్మున నిలబడనియ్యరే
కుదురుగ కూసోనియ్యరె

2) అయ్యబాబొయ్ ఎంత ప్రేమో..

అయ్యబాబొయ్ ఎంత ప్రేమో..

అయ్యబాబొయ్ ఎంత ప్రేమో..

కల్చర్ మీద లెక్చరే

అర కొర ఆర్టిస్టులతో

ప్రోగ్రామంతా టార్చరే

టికెట్లంటూ ఇక్కట్లెట్టి

వద్దన్నా వదలకుండా

రుద్దేసి పోతారే

ఈ బాధ  ఇక తప్పదులే…

వచ్చిందే ముందుగ వారధి వచ్చిందే

పిదప TAMని తెచ్చిందే..
గమ్మున నిలబడనియ్యరే
కుదురుగ కూసోనియ్యరె
మెల్లా మెల్లగ వస్తారె
మెంబర్ షిప్పులు అంటారే
ఎక్కడ అప్పులు చేయించో
మాకు తిప్పలు పెడతారె

22, అక్టోబర్ 2019, మంగళవారం

ఇంకేమింకేమింకేం కావాలే చాల్లే ఇది చాల్లే...పేరడీ


(మూడు దశాబ్దాల పిదప కలిసిన మిత్రులను ఉద్దేశించి రాసుకున్న పాట)

ఇంకేమింకేమింకేం కావాలే చాల్లే ఇది చాల్లే...

ఇంకేమింకేమింకేం కావాలే చాల్లే ఇది చాల్లే...

ఫ్రెండ్సై నిండుగ మళ్ళీ కలిశామే  ఇకపై తిరనాళ్ళే..

ఎన్నో ఏళ్ళుగా దూరంగున్నామే...కాలం తోటి పరుగులు తీశామె

గెలుపోటమిల తలుపులు దాటామె

మనమొక్కో గెలుపుతొ లైఫులొ సెట్టై భార్యా బిడ్డతొ జీవిస్తున్నాం 


ఇంకేమింకేమింకేం కావాలే చాల్లే ఇది చాల్లే...

ఫ్రెండై నిండుగ మళ్ళీ కలిశామే  ఇకపై తిరనాళ్ళే..


మరవనీ నేస్తపు మనసా..తరగనీ స్నేహపు వయసా

వదలమే ఇకపై బహుశా ఒకరికి ఒకరుగా


పెరిగినా చెలిమిన దూరం చెరగదే చేసిన స్నేహం

నీ కంటి  నీరుని తుడిచే బలమే ఈ స్నేహం

కష్టాల కడలిలో కాపే నేస్తం

కడదాక నీడగ నిలిచే హస్తం..

ఇంకేమింకేమింకేం కావాలే చాల్లే ఇది చాల్లే.......


ఇరవైలొ ఇరుకున పడినా ఐటీ లో గాడిన పడినా

అమెరికా గడపే దాటిన మారదె మన బంధం


తొలిసారి కలిసిన ఆ క్షణం నీకంట వెలిగెను కిరణం

ఆ వెలుగు మెరిసిన తరుణం మురిసెను నీ స్నేహం

నీ తలపు పలుకుల పిలుపే స్మరణం

స్నేహానికి ఎన్నడు లేదే మరణం...

ఇంకేమింకేమింకేం కావాలే చాల్లే ఇది చాల్లే...

(అయ్యయ్యో జోబులొ డబ్బులు పోయెనే...పాటకు పేరడీ.._After loosing the job)

అయ్యయ్యో ఐటిలో జాబూ పోయెనే..

అయ్యయ్యో బెంచిలో వచ్చీ చేరెనే

ఉన్నది కాస్తా ఊడిందీ ..బెంచ్ సాలరీ పోతుందీ

జావా వచ్చి మెయింఫ్రేమునే కొంపలుముంచీ కులికిందీ.."అయ్యయో"

చంద్ర :ఆ మహా మహా కోడింగు వీరులే జావగారిపాయె

రానా:వారూ జావ మారిపోయే

చంద్ర:మరి నువ్ చెప్పలేదె రానా

రాన:అది నా తప్పుకాదు అన్నా

చంద్ర:తెలివి తక్కువగ మెయింఫ్రేములోదెబ్బతింటిమన్నా

రాన:ఇకపై కళ్ళు తెరుద్దమన్నా..."అయ్యయ్యో"

పెళ్ళవగానె యూయెస్ వస్తే ఫలితం దక్కేది

పిల్లల జననం కలిగేది

సిటిజెన్ షిప్పూ చిక్కేది

హెచ్ వన్ బీలో ఎపుడో వస్తే జీసి దక్కేది

మనకు అంతటి లక్కేదీ..."అయ్యయ్యో"

వారధి బురదలొ కాలం మొత్తం కాలిపోయెనమ్మా..

ఇది నే చేసుకున్న ఖర్మ

శిక్షను అనుభవించే జన్మ

ఇక నా దిక్కులేర వర్మా

చాన్సు తగిలితే హిట్టుపాటతో సినీలొ వెలగొచ్చు

పోతే ..సీహిట్లొ మెలగొచ్చూ......(C-HIT is my working company) ..."అయ్యయ్యో"

(పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే ..జానపద పాట మాదిరిగా..)

దేశి బతుకులు చితికిపోయెనే అమెరిక దేశానా కనిపించని దేహానా

హెచ్ వన్ బీ ల వెట్టి కొలువులు అంతరించిపోయే నట్టేట ముంచిపోయే

పదేళ్ళు సాగిన కొలువు నిలువదు ఎదురు చూసిన కొలువు దొరకదు

ఇలాగ ఎన్నాళ్ళో బెంచీలొ ఎదురు చూపు

ఎదురు ట్యాక్ష్ కట్టే పేరోలె మాకు వాపు --"దేశి బతుకులు"

ప్రయారిటీల డేట్లు మారవు ప్రవాస జీవుల రాత మారదు

పచ్చకార్డు కోసం పడిగాపులుండిపాయే

పాడు కార్డు రాకా ఇలా పాటరాసి పాడే..."దేశి బతుకులు"

పన్నీటి దారులు ఇరుకూఅయెను కన్నీటిధారలు ఇంకిపోయెను

పగలూ రేయనకా కొత్త కొలువును సోధించూ

వర్కే ఊపిరిగా పరిపూర్ణత సాధించూ  "దేశి "

పేరడీ -




(మావి చిగురు తినగానే  పాటకు పేరడీ..)

పాడు కబురు వినగానే ప్రాణం నిలిచేనా..ప్రాణం నిలిచేనా ..

పోయిన జాబు రాగానె ఊపిరొచ్చి నిలిచేనా ..

ఏమో ఏమనునోగానీ నా మది తదుపరి..."పాడు"

జీవితాన్ని గెలవాలా...జీతమొచ్చి నిలవాలా..

నిలవాలా.. గెలవాలా..గెలవాలా..నిలవాలా

కవితలేకాదు కళలేకాదు కష్టపడ్డమే ఇష్టముగా

తర్కాలు వాదాలు కలయికలు ఇక ఇకలు

ఏమో ఏదోమార్పును తెచ్చును కాలము ..ఖర్మము..

మందు కబురు అనగానే ..మందిని పిలిచేనా...మందిని పిలిచేనా..

పోసిన బీరు తాగ్గానే కొలువు మాట మరిచేనా..

ఏమో ఏమవుతుందో మరి నామది ఈ బీరుకి..?