21, నవంబర్ 2019, గురువారం







ఓ గణపయ్యా ..


వేడి సూరీడుకి చల్లని పిలుపునిచ్చి ..

నీలాకాశాన నీలిమబ్బులను మలచి ..

దోబూచులాడే తెమ్మర గాలులని రమ్మని పిలిచి...

ముల్లోకాన విహరిస్తున్న ముక్కంఠుని అర్తించి ..

పెందలాడె అందరి డెందములందు నిలిచి ..

ఇంటిల్లపాది అల్లిన పాలవెల్లిన పవళించి ..

తలపోసిన ఘన కార్యములందు మము కరుణించి

దీవించి గెలిపించాలని ప్రార్థిస్తూ..

వినాయక చవితి శుభాకాంక్షలతో..
చంద్ర ..కాటుబోయిన

1, నవంబర్ 2019, శుక్రవారం

రాను రానంటోంది చిన్నదో..చిన్నదో ..Peradee


He:రాను రానంటోంది చిన్నదో..చిన్నదో

వరి చేలోకురికొచ్చే కుర్రదో కుర్రది

వద్దు వద్దంటోందీ ముద్దురో..ముద్దురో..

నచ్చాక వదిలి పెట్టకందిరో…..అందిరో

కంటపడి వెంట పడి పంట చేలొ పట్టుబడి

సిగ్గుపడి చీరజార్చె చిన్నది

రివ్వుమనే గువ్వలా  ఎగిరెగిరి పడుతుందే

పరువానా పూతకొచ్చె పిల్లదీ

She:ఔనా బావా పైటా వదలవయ్యొ

ఇట్టా చేత్తే నాకసలె సిగ్గురయ్యొ

He:సిగ్గు సిగ్గంటుందీ సిన్నదో సిన్నదో..

కౌగిట్లో కరిగిపోతున్నదో కన్నెది

గుట్టు రట్టవుతుందీ వేళలో చేలలో..

మనువాడెదాక ఆగమందిరో సుందరీ..

నవ వసంతమా..


ఏడాదిగా ఎన్నో తడిజ్ఞాపకాలను ఒడి జేర్చిన నవ వసంతమా..

మరిన్ని మధుర తలపులను మదిని చేరనీయక వెళ్ళడం న్యాయమా..?

మొన్న మొన్ననే నా ఎద తలుపులను తట్తావు..

గుండె గుడిలోకి స్వాగతించిన పచ్చ తోరణాల హరితం వీడనే లేదు

పచ్చ కార్డుల పర్వదినానికి అంకురార్పణ జరగనేలేదు..

ప్రవాసుల ప్రయాసలు వనవాసానికేగనే లేదు..

విధించిన వలస చట్టాల కబంధ హస్తాలు వీడనే లేదు...

అపుడే నీ కాలము తీరి కనుమరుగవుతున్నావా..?

దూరమవుతున్న నీకు భారమైన హృదయంతో చెప్పలేకున్నా వీడ్కోలు..

చేరువవుతున్న నూతన సంవత్సరమైనా మా ఆశలు తీర్చాలని  చేస్తున్నా వేడుకోలు..

అందరికీ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. 

జన్మభూమినే మరచిన ఓ దేశీ -peradee(కర్మ భూమిలొ ..పూసిన )




జన్మభూమినే మరచిన ఓ దేశీ

తెలిసీ తెలియక అడుగే మోపీ

కన్నుల ఆశలు నీరై కారగ

కన్నవారికే దూరం అయ్యావా…”జన్మభూమినే”

కోటి ఆశలతో వీసా పట్టి

తోటివారిచే జాబును కొట్టి

రాని work తో కుస్తీ బట్టి

మస్తు నేర్పుతో మెప్పును పొంది

రాటుదేలినా ఓ ఇంజనీరా….

రాటుదేలినా ఓ ఇంజనీరా….

H1Bలకు కాలం చెల్లి

కలల సౌధాలు కాటికి చేరాయా…”జన్మభూమినే”

ఎంబసిలో ఏ వీసా ఇవ్వక

ఏళ్ళ తరబడి అమ్మను చూడక

బాల్య నేస్తాల స్నేహం మరవక

జ్ణాపకాలుగ మదిలో నిలుపగ

వేదన చెందే ఓ ఇంజనీరా….

వేదన చెందే ఓ ఇంజనీరా….

స్వార్థ నేతలే దేశ పాలులై

మానవ సమతకు మచ్చను తెచ్చారా…”జన్మభూమినే”

జీసీలింకా రానేలేదు
ఇయ్యేడింకా అవ్వనే లేదు
డేట్లే ఇంకా కదలనె లేదు
గేట్లే ఇంకా తెరవనె లేదు

డాలరు మోజున ఓ ఇంజనీరా…
డాలరు మోజున ఓ ఇంజనీరా…
దగాలు పడ్డి దిగాలు చెంది
నరకయాతనలో నలిగి పోయావా... ”జన్మభూమినే”