31, మార్చి 2020, మంగళవారం

inkeminkem kavale-vaaradhi parody

After declaring last president in vaaradhi...ఇంకేమింకేమింకేంకావాలే…చాల్లే ప్రెసిడెంటూ..
నీకై నువ్వే డిక్లేర్ చేశావే..ఏంటో ఈ తంతూ..
వారధిలోన మంటే రేపావే..
సారధివంటూ..పెంటే చేశావే..
మునుపెవ్వడు కూడా ఇట్టా చేయ్యలేదే..
మాక్ ఒక్కో ఏడు ఒక్కో జన్మై
చస్తూ చస్తూ బతికున్నామే….” ఇంకేమింకేమింకేంకావాలే”

ఎన్నికల బరిలో దిగవా..
హుందాగ పోటీ పడవా
భయమేల ఆంగ్లపు  భడవా..దొడ్డిదారి వద్దనవా..
చీటికి మాటికి బైలా(by- law)
మీటింగు అంటే స్లైడ్లా
వారధిలొ ఒకసారైనా పనిచేసెరుగవా..
మా ఖర్మ కాలే ఈ గతీ
ఈ ఏడు ఇంతే సంగతీ……….” ఇంకేమింకేమింకేంకావాలే”

4, మార్చి 2020, బుధవారం

Penivitee-Parady Aravinda sametha



ఇద్దరినీ కాదనకా ఒద్దికగా నడిచాను
బంధానికి విలువిచ్చీ బాధల్ని మరిచాను
ఎన్నాళ్ళీ ఎడబాటు రా రా
మరిగేటి గురుతుల్ని తలయించి రా రా
మన ఇంట బేధాలు మరిచేసి రా రా
మనకంట మోదాలు మరిపిద్దాం రా రా
అన్న ఎన్నినాళ్ళైనాదో మాటినక చెవులారా ..
తంబి ఎన్నినాళ్ళైనాదో ఊసినక చెవులారా ..

చక్కటీ ఇంటిలో రగిలే కుంపటి

కలిమి మోజులో కమ్మిన చీకటి

ఎదలో తీయటీ ఆశే ఒక్కటి "2"

గుండెలో నిండుగున్న పిలుపువిని రా ర సోదరా..."2"
చక్కటీ ఇంటిలో రగిలే కుంపటి

కలిమి మోజులో కమ్మిన చీకటి

ఎదలో తీయటీ ఆశే ఒక్కటి "2"

గుండెలో నిండుగున్న పిలుపువిని రా ర సోదరా..."2"

||చిననాటి బంధం విడరాదని
కలిపేటి కాలం ముందుందని
కాసుల మాటునా మాసిపోదనీ
ఆశల పందిరే నింగినంటనీ

సోదర ప్రేమలే దూరము చేయకు
ధనమే మూలమని దారులు మారకు
నడవలేని నాన్న అమ్మకోసం రా రా రా రా సోదరా..."2"

||వడిగా సిరి గుమ్మం .....తీరాలని "2"
కనరాని గమ్యం చేరాలని
కనపడు బంధాలె  బూటకాలని
ఎదకడ నిలిచేది యావదాస్తనీ

తపనలు చెందకు తగవులు ఎందుకు
సివరికి నీవలా శిలగా మారకు
నినుగన్న ముసలివారి మనసు తెలిసి రా ర సోదరా.. "2"

ఇద్దరినీ కాదనకా ఒద్దికగా నడిచాను
బంధానికి విలువిచ్చీ బాధల్ని మరిచాను
ఎన్నాళ్ళీ ఎడబాటు రా రా
మరిగేటి గురుతుల్ని తలయించి రా రా
మన ఇంట బేధాలు మరిచేసి రా రా
మనకంట మోదాలు మరిపిద్దాం రా రా
అన్న ఎన్నినాళ్ళైనాదో మాటినక చెవులారా ..
తంబి ఎన్నినాళ్ళైనాదో ఊసినక చెవులారా ..

Chiru-Parady-Bhalega vundira

from Stuvartupuram Police Station

కరోన వద్దురా కరీన ముద్దురా

పెదాల ముద్దరా కొన్నాళ్ళు హద్దుర

మాస్కుల్లొ మూగబోతు ఉంటే

రిస్కూలు ఆగమాగమాయె .."2"

పిచ్చి ఎక్కి చైనా నచ్చినట్టు తింటే
ఎక్కడో చిక్కదా దారిలేకా

జీవులన్ని యేంచీ గుచ్చి గుచ్చి తింటే 
ఎప్పుడో రాదా ఏ రోగమైనా

చైనీల వంటికీ చరాలెంతొ ఇష్టమో 
తరాలు మసకే బారేలా

కాలాన ధర్మమో కర్మ సిద్ధాంతమో
భూమాత బరువే తీరేనా

అందాక తప్పదే బంధాల తిప్పలే
భయాల గుప్పిటే బతుకంత ఉక్కిరే
ప్రాణాలు బిక్కు బిక్కుమంటా
ప్రాయాల లక్కు ఎక్కువంటా ...

Folk-Parody



ముచ్చటైన మన విద్యాలయం సిద్ధార్థా

స్వచ్చమైన నవ తెలుగువాడు ప్రదాత

పచ్చనైన కాలి బాట కుర్ర ఈడు ఈల పాట

దారివెంట పూల తోట సౌధాలు సొబగులంట

ఈ కొబ్బరాకులా  చిరుగాలి స్వాగతం

ఆ నింగి మేడలా స్నేహాల పరిమళం

చెప్పలేని కుర్ర ప్రాయమే తప్పటడుగుల గుణపాఠమే

కళాశాల నేర్పినాదిరో కలలు నెరవేర్చినాదిరో

3, మార్చి 2020, మంగళవారం

Jaya pilla -Birthday kavitha

ఏళ్ళ మునుపే ఎల్లికాట్ సిటీలో అల్లుకున్న 'పిల్ల తీగె

మెలమెల్లగ ప్రవాసులకు ఊతమిచ్చే ఆలంబనై

పదిమందికి నీడనిచ్చే పెద్ద పందిరిలా అల్లుకుపోయి

చిగురించే లేలేత పత్రాల చిరునవ్వులకు ఆద్యమైనది.

పచ్చదనం పరిఢవిల్లిన ఫలపుష్పాల కలల వృక్షమై ఎదిగిన

నిష్కల్మష వాక్కులతో నివ్వెరపరిచే ఆ చతుర్ల వెనుక

దాగిన తన మది తామరపై నీటి బొట్టు కదా..?

ఓ తీయని జ్ణాపకంగా మిగిలిన నాటి తన జీవితం

నేడు మన స్నేహితులందరికీ ఆదర్శం ..

తన జ్యోతి కిరణాల ప్రకాశాన సంజనించి ఉదయించిన

సంజనుడు సజ్జనుడై "పిల్ల" వంశ కీర్తిని నిలిపే జయ భాస్కరుడవాల్లని ..

మనస్పూర్తిగా కోరుకుంటూ ...

మీ స్నేహితులు..

Classmate-kavitha

అవి 1992 జనవరి  మాసపు చివరి రోజులు ..  :OLD HOSTEL

కొత్థగా మన కళాశాలలో చేరిన మొదటి రోజులు

సిద్ధార్థలో సీటు సాధించామన్న పొగరుతో కాలర్ ఎగరేసుకుంటూ కాలంతో పోటీకి సై అని తొడగొట్టే రోజులు..

 వేడివయసులో చల్లనీళ్ళ స్నానపానాలు ముగించగా

పక్కకు పాపిట దువ్వి రింగుల ముంగురులను సవరించగా

ఇంటినించ్చి తెచ్చుకొన్న పాండ్స్ పౌడర్ పూసి పయనమవ్వగా

సాంకేతికత నేర్వ సహచరులతో పాటు దారిలో వెలుతుండగా

శిశిరపు గాలులు రివ్వున సాగుతూ చెంపలు మీటుతుండగా

ఉత్తర భారతీయురాలిలా ఉట్టిపడే సాంప్రదాయ వస్త్రాలలో తను మా ముందుగా

వచ్చీ రాని ఈకైన ఇంగిలీసులో గొణుక్కుంటూ నడుస్తూ తనవెనుకగా

ఓరకంట గమనించి బాటకు ఒకవైపున నడిచే తను తనదారి వదిలి మరోవైపు చేరగా 

వెనువెంటనే యాధృచ్చికాన మేము మళ్ళీ తన దారి వెనుకే చేరగా ...

క్షణం ఆగిన ఆవిడ వెనక్కి తిరిగి అర్థం కాని  ఇంగిలీసులొ హెచ్చరించగా..

తన ముఖవళికల భావాలను పసిగట్టి  అర్థంగావడానికి అరనిమిషం పట్టగా …

మిన్నకుండి పోయి... సారీ అన్న రెండక్షరాల ఆంగ్లపదాన్ని అనర్గలంగా చెప్పగా ..

"ఓహ్ ఇదేంటి అనుకోకుండా తనను ఫాల్లో అయ్యామా .." అని నాలుక్కరచుకొని నవ్వుకొన్న

ఆనాటి తీపి గురుతులు ఎంత మరవయత్నించినను మరవలేము ..మారలేము...


My wife -birthday



నీ తలపుల తలగడలో కునుకు పడి ఆదమరచిన నిదురలో ఓ తీయటి కల ...కన్నాను ..

శ్రీవారిగా  మోహావేశాలు తరుముతు ఉంటే ...
ఈ అందాల భరిణెతో మన కారు గుర్రం పరుగెడుతుంటే ..
గమ్యం తెలియని గమనంలో రివ్వున పయనిస్తుంటే ..
ఒకవైపు నీ వంటి పరిమళాలు గుబులురేపుతుంటే ...
మరోవైపు నీ ముంగురులు ముఖారవిందంపై నాట్యమాడుతుంటే ..
సవరిస్తూ నీ మునివ్రేళ్ళు సుతారంగా వాటిని మీటుతు ఉంటే ..
క్రీగంట చూపున లిప్తకాలంపాటు  మిర్రర్లో నీ చూపులు నా చూపుల్లో బందిస్తుంటే ..
వెంబడే అన్యాపదేశంగా నీ అధరాలు వికసించి దరహాసం చిందిస్తుంటే ..
బీచువైపు పదమని యువరాణిలా ఆజ్ఞలు సంధిస్తుంటే ..
యాధృచ్చికంగా స్టీరింగ్ అటువైపు మల్లిస్తూ తన ఆజ్ఞ ను శిరసావహిస్తుంటే ..
ఇదే కాబోలు శ్రీమతియెడ ప్రేమయంటే ..నచ్చిన చెలికోసం ఎంతదూరమైనా వెళ్ళడమంటే ..
తన ఆనందం కోసం ఎంతకైనా తెగించడమంటే ...
తను నవ్వుతూ ఉండడం కోసం ఏమైనా చేయడమంటే ...

నా ఊహకు పదాలు జోడించా .....

పుట్టినరోజు శుభాకాంక్షలు ..
బంగారం ...😄

సామజవరగమనా -Parady AVP


ఆ నగల ఊసులు వదలమన్న వినదే చిన్నారి

ఈ వగలమారి అలకలింక విడువే దేవేరి..

నా పక్కలొ చేరి చెవులొ దూరి జోరీగల పోరి

ఎన్నాల్లు వేగాలొ ఈ చిత్రహింస  ఏటా ప్రతిసారి

నీ నసలు మాని దరినజేరి వినవే ఒకసారి

కాదన్ననాడు కాపురమంటే కడలే కడసారి ..

సామజవరగమనా గుట్ట పూసలివ్వగలనా ..

నగల మీద మగువకున్న తెగువ చెప్ప తగునా "2"

గీతను చూడుమా శ్వేతను అడుగుమా

ప్రతి నగల మీద వలపు లేని వాహిని కనుమా

చంద్రిక చేరుమా బిందుతొ బింకమా

ఎన్నెన్ని పెద్ద సొమ్ములున్న పోటీ తగునా 

అరె స్వప్నాల నేస్తమై చైతన్యకు చేరువై

కలిసిపో కరిగిపో భామా

జ్యోతీలా వెలుగుమా స్వాతీలా మెలగుమా

ఉమను మీటి సుమను గీటి మనవిని వినుమా

సామజవరగమనా గుట్ట పూసలివ్వగలనా ..

మగడికున్న సెగలు చూసి నగలు అడుగ తగునా "2"

AVP-Parody-college invite

దోస్తీగాళ్ళకు ఇన్వైటు
సిల్వర్ జూబ్లికి ఇగ్నైటు
నైంటీఫోరు బ్యాచూనంతా
కదలమనేటట్టు

ఉల్లాసంగా ఊగేట్టు
డల్లాసంతా అదిరేట్టు
అల్లాడించే అమ్మాయిలంతా
జిగేల్ మనేటట్టు..

షకీరనే షేకు చేస్తు
స్టెప్పులేసి పిలిచినట్టు
శ్రేయాఘోషల్ పాటలన్ని
పాతబడీ పోయినట్టు

ఇరగదీసి సంపుతున్నరో
మన అమెరికాన
ఎంతసక్కని గ్యాదరింగురో
డల్లాసులోన

పాతికేళ్ళు గడచిపోయెరో
మనజీవితాన

జ్ణాపకాలు మిగిలిపాయెరో.. 
మన గుండెల్లోన

రండిరో..రండిరా
సిద్ధారే చిందేసెలా
రండిరో..రండిరా
కుర్ర ఈడే గుర్తొచ్చేలా    "2"

New-Year-2020

అంతవరకూ నీరెండ మాటున మౌనాన్ని ఆశ్రయించిన
శిశిరపు గాలులు రెక్కలు విదిల్చిన వేళ  ..
సాయం సంధ్యపు సంజ చీకట్లు ముసురుకొనేవేళ ...
దశాబ్దపు ఆఖరి గడియల వేడుకలకు
శ్వేత సౌధము వేదికైన వేళ ...........
అదిరే రుచులతో అతివలు ఆరగించగా 
మకరందపు మధువులు సేవింప తుమ్మెదలు చేరగా
సంగీత ఝరిలో యవ్వన గీతికలు పల్లవించగా
ఓపలేని ఊపున ఆపలేని నృత్యాలు కదం తొక్కగా
జంటల నృత్యం జనుల కనుపంటగా
అందరి చిందులు అందలం తాకగా
నడిరేయి జాముకి వడి వడిగా పరుగులు తీయగా
దిక్కులు పిక్కటిల్లేలా మేఘాలు గర్జించేలా
"హ్యాపీ న్యు ఈయర్ " అన్న నాదం ప్రతిధ్వనించింది 
కొంగొత్త దశాబ్దానికి  పునాది వేసింది ..
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో...

cherry Blossom - పూల వనం

cherry Blossom రాక సందర్భంగా...

ఎటు చూసినా రంగు రంగుల హరివిల్లుల పూల వనం

ధరణి సొబగులన్నీ ధారణిలా చేకూరిన వైనం

కొమ్మ కొమ్మ తన సిగలో వెండి మబ్బులను తురుముకున్నసౌందర్యం

రెమ్మ రెమ్మకు బాపు బొమ్మలా ఒన గూరిన వయ్యారం

విరితోటలో విరబూసి వినువీధికి వన్నె తెచ్చిన అలంకారం 

తారలకే తలంబ్రాలుగ పుడమి జల్లిన జలతారు శోభనం

వెండి కాంతులే కొండ మల్లెలై శొభిల్లిన సోయగం

నింగి వంగి విప్పారిన నేత్రాలతో ముద్దాడిన ఆలింగనం

వింత వసంత ముంగిళ్ళలో విరితేనెల సుగంధం ఈ నవవసంతం !