కల కలలాడే పచ్చదనపు పల్లెటూల్లు
పండిన ధాన్యాలు చేతికొచ్చిన రైతన్నలు
పనిచేసిన బసవన్నలను పలకరించే పుష్పాలు
పాడిచ్చే పసువులను అలరించే పసుపు కుంకుమలు
కనుల ముందు కనువిందు చేయు కన్నెపిల్లల గొబ్బిల్లు
పెందలాడే అందమైన ముంగిట చల్లే పెన్నీల్లు
ముస్తాబైన ముంగిట ముందు ముత్యాల ముగ్గులు
ముగ్గుల మధ్య మణులను మరిపించే మల్లె మొగ్గలు
ఇంటిముందు పాటలతో అలరించే హరిదాసు ముచ్చట్లు
ఇంటింట పాకాలతో నోరూరించే అమ్మమ్మ బొప్పట్లు
కొంటె కోడళ్ళు కొత్త అల్లుళ్ళతో తిరనాళ్ళు
వెలిగే భోగి మంటలు రగిలే యువ జంటలు
తీరని తీపి కోరికలు ఆరని వలపు మంటలు
అలక తీరిన అల్లుళ్ళు అత్తా మామల అగచాట్లు
మరదళ్ళ కవ్వింతలు బావల వెక్కిరింతలు
పరికిణీలో పడతులు పరిణయ ఘడియకై ఎదురు చూపులు
పల్లె అందాలు..... కోళ్ళ పందాలు
పలకరించే బంధాలు నేటి సరికొత్త సంక్రాంతులు
సంక్రాంతి శుభాకాంక్షలతో..
--చంద్ర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి