తెలిగింటి దీపిక పొరుగింట్లో చేరిక
పరికినీలో ఆ చిలుక పరువాలు తెరవెనుక
వర్షం లొ చూశాక వశము తప్పె మనసు అదుపులేక
సరిహద్దులు మీరక ముద్దు ఆలోచన నేరక
చూపుల రువ్వుల వేడుక పెదవుల నవ్వులు వీడక
ఎదురుపడితే ఎరుగక ఎవడో అన్నట్టు చూశాక
నన్ను నేను మరిచాక నన్ను నువ్వు యేమార్చక
రేయనక పగలనక వేచియుంటా కడదాక
నా హ్రుదయమే నీకు వేదిక అహర్నిశలు నీకై వెదికా
కలిసొచ్చె కాలమిక కరుణించు మన కలయిక
మనువంటే కోరిక మనసుంటే తెలుపిక
నీవు లేని జీవితమిక నీరులేని జీవన నౌక
కాదంటే తగదిక తాంబూలాల తరుణమిక
అచ్చు వేద్దాం పెండ్లి పత్రిక భావి ప్రేమికులకు మనం ఓ ప్రతీక
లేదంటే తీరిక మార్చలేను నీ తీరిక..మరణమే నాకు శరణమిక ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి