ఆ project కోసం personal పనులన్నీ పణంగా పెట్టి ,భార్యా పిల్లలతో గడిపే సమయాన్ని తృణంగా పెట్టి, ఇష్టమైన ఆటపాటలన్నింటినీ గట్టున పెట్టి...అబ్బురపరిచే లాజిక్కులకి లేని మెదడుకు పదునుబెట్టి...అదుపులేని కోరికలను అదుపులో పెట్టి,స్నేహితులతో షికార్లకు అడ్డు చెప్పి...మందుకొట్టే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి,కంపుకొట్టే సిగరెట్లకు వీడ్కోలు పలికి,కంటిమీద కునుకుకు బై బై చెప్పి,ఎదుటివారిమీద నిందలు మోపలేక ,కనిపించే అన్యాయాన్ని ప్రతిఘటించలేక,తెలియక,కుట్రపూరితపాచికలు విసరలేక,మోసపూరిత చర్యలు భరించలేక,నా సాంకేతికతా నైపుణ్యాన్ని ప్రదర్శించలేక,అవకాశాలు దొరకపుచ్చుకోలేక ,అవిభాజ్యపు సిద్ధాంతాలతో భేదించలేక, రాజకీయాలు చ్హేదించలేక,విష సంస్కృతి పరిఢిల్లే మనసులేని(project)మనుషులమధ్య మనగడజాలక, మనగల్గలేక, మాట్లాడలేక, రాని నవ్వు నవ్వలేక,వెకిలి నవ్వులు చూడలేక, ఎందుకు (ఊరకే)నవ్వుతుందో(ఎరిక)ఎరుగక , తెలివితక్కువది తెల్లది(client) అని తెలియక,నన్ను నన్నులా ఉంచలేని DEVO projectలో ఇమడలేక, మీలాంటి హితులను వదలలేక అచేతనుడనై,నిశ్చేస్టుడనై ప్రకొపితుడనై,మౌనమునినై చివరకు నిర్వీర్యుడినై స్వేచ్హా ప్రపంచంలో అడుగెట్టా... కవితారూపంలో మొదలుపెట్టా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి