నీరుగార్చే
నిబంధనల నిట్టూర్పుల సెగల తాకిడికి
కుదేలవుతున
ప్రవాసులారా!
నారు పోసిన వాడు నీరు
పోయక మానడు అన్నది
నీవెరుగవా?
నారు నీరు నోరు ఉంటే
ఏ రాజ్యంలో ఉన్నా
ఒక్కటే అన్న సత్యం కాదనగలవా..?
నాలుక ఉన్నోడు నలు దిక్కులు
తిరుగగలడు.
పదును ఉన్నోడు ఆ దిక్కులన్నీ
ఒక్కటి చేయగలడు
సుదూర తీరాలలో అనుక్షణం భయం
గుప్పిట్లో సాగే మనుగడకంటే
ఉన్న వూరులో కన్నవారి చెంత
సాగించే నీ పయనం
సౌఖ్యం కాదా..?
ట్రంపు గుంపు రేపే కంపు
స్లంపులో మనసు చంపుకుంటూ కట్టు
బానిసలా బతకాలా..?
ఆ కంపునే మన ఇంపుగా
తలవని తలంపుగా మలుచుకొని స్థానికంగా
బతకాలా?
స్వేదం చిందించి కండ బలం
కరిగించి రుధిరం మరిగించి జీవన
యానం సాగిద్దాం..
నిండు భారతీయుడిగా దేశం మీసం తిప్పుదాం ,భరతమాత చరణాల వద్దే మా జీవితం అని సగర్వంగా చాటుదాం !
నిండు భారతీయుడిగా దేశం మీసం తిప్పుదాం ,భరతమాత చరణాల వద్దే మా జీవితం అని సగర్వంగా చాటుదాం !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి