జన్మభూమినే మరచిన ఓ దేశీ
తెలిసీ తెలియక అడుగే మోపీ
కన్నుల ఆశలు నీరై కారగ
కన్నవారికే దూరం అయ్యావా…”జన్మభూమినే”
కోటి ఆశలతో వీసా పట్టి
తోటివారిచే జాబును కొట్టి
రాని వొర్క్ తో కుస్తీ బట్టి
మేనేజెర్లతొ మెప్పును పొంది
రాటుదేలినా ఓ ఇంజనీరా….
రాటుదేలినా ఓ ఇంజనీరా….
H1Bలకు కాలం చెల్లి
కలల సౌధాలు కాటికి చేరాయా…”జన్మభూమినే”
ఎంబసిలో ఏ వీసా ఇవ్వక
ఏళ్ళ తరబడి అమ్మను చూడక
బాల్య నేస్తాల స్నేహం మరవక
తోడబుట్టిన వారిని కలవక
వేదన చెందే ఓ ఇంజనీరా….
వేదన చెందే ఓ ఇంజనీరా….
పరాయి దేశపు కోరల నలిగి
బానిస సంకెళ బందీ అయ్యావా..”జన్మభూమినే”
జీసీలింకా రానేలేదు
ఇయ్యేడింకా అవ్వనే లేదు
డేట్లే ఇంకా కదలనె లేదు
గేట్లే ఇంకా తెరవనె లేదు
డాలరు మోజున ఓ ఇంజనీరా…
డాలరు మోజున ఓ ఇంజనీరా…
దగాలు పడుతూ దిగాలు చెంది
సమిధ గా నే మిగిలీపోయావా ”జన్మభూమినే”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి