అవి 1992 జనవరి మాసపు చివరి రోజులు .. :OLD HOSTEL
కొత్థగా మన కళాశాలలో చేరిన మొదటి రోజులు
సిద్ధార్థలో సీటు సాధించామన్న పొగరుతో కాలర్ ఎగరేసుకుంటూ కాలంతో పోటీకి సై అని తొడగొట్టే రోజులు..
ఆ వేడివయసులో చల్లనీళ్ళ స్నానపానాలు ముగించగా
పక్కకు పాపిట దువ్వి రింగుల ముంగురులను సవరించగా
ఇంటినించ్చి తెచ్చుకొన్న పాండ్స్ పౌడర్ పూసి పయనమవ్వగా
సాంకేతికత నేర్వ సహచరులతో పాటు దారిలో వెలుతుండగా
శిశిరపు గాలులు రివ్వున సాగుతూ చెంపలు మీటుతుండగా
ఉత్తర భారతీయురాలిలా ఉట్టిపడే సాంప్రదాయ వస్త్రాలలో తను మా ముందుగా
వచ్చీ రాని ఈకైన ఇంగిలీసులో గొణుక్కుంటూ నడుస్తూ తనవెనుకగా
ఓరకంట గమనించి బాటకు ఒకవైపున నడిచే తను తనదారి వదిలి మరోవైపు చేరగా
వెనువెంటనే యాధృచ్చికాన మేము మళ్ళీ తన దారి వెనుకే చేరగా ...
క్షణం ఆగిన ఆవిడ వెనక్కి తిరిగి అర్థం కాని ఆ ఇంగిలీసులొ హెచ్చరించగా..
తన ముఖవళికల భావాలను పసిగట్టి అర్థంగావడానికి అరనిమిషం పట్టగా …
మిన్నకుండి పోయి... సారీ అన్న రెండక్షరాల ఆంగ్లపదాన్ని అనర్గలంగా చెప్పగా ..
"ఓహ్ ఇదేంటి అనుకోకుండా తనను ఫాల్లో అయ్యామా .." అని నాలుక్కరచుకొని నవ్వుకొన్న
ఆనాటి తీపి గురుతులు ఎంత మరవయత్నించినను మరవలేము ..మారలేము...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి