విరహ గీతం : Jackey song parody
అలా దూరమవకే నా చెలీ
అగాధాల మంటే ఆరనీ
నింగినొదిలి ఓ క్షణమైనా
నిలవలేదు జాబిలి మైనా
దరికి చేరె దారే తెలుసుకో
కలికి చిలక మనసై మసలుకో "అలా"
కోరి చేసుకున్నా తీరు మార్చుకున్నా
అలరించు కుసుమం వికసించలేదు
కనులు నీరు కారి కవితలాగ మారి
భావ వేదనంతా నివేదించలేను
ఎలా చెప్పగలనో గుండెలోని ప్రేమ
నులివెచ్చనైన కౌగిళ్ళ భామా
విరహాన గేయాలు కలహాన గాయాలు
మదిలోన సుడి రేపకే ఎదలోన గుడికట్టితే "అలా"
తీగనిడిచి పువ్వు నన్ను విడిచి నువ్వు
నేల విడిచి సాము చేసినట్టులే
కడుపు తీపి కోసం కన్నవారి కోసం
కట్టుకున్నవాన్నే బలి చేయకే
నీరెండ తాపం నిట్టూర్చె పంతం
తడిచూపులోన చిగురించు బంధం
మేఘాల మబ్బుల్లో మోహాల సిగ్గుల్లో
జతగూడు సయ్యాటలో చవిచూడు స్వర్గాలనే .. "అలా"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి