నందన నామ సంవత్సరానికి వందనం
ప్రవాసాంధ్రులందరికి ఉగాది పర్వదినం
అందరి హృదయాలను ఆనందపరిచే శుభకర దినం
గత ఖరనామ సంవత్సరం కడు కఠినం
నేటి నందనం కావాలి మన యెడల సంబరం
తీపి చేదు మేలు కలయికల ఈ కొత్త సంవత్సరం
కష్ట సుఖాలు కలబోసే అపురూప సమయం
తెలుగువారందరినీ ఒక్కటిగ దరిజేర్చే ఈ ఉగాది పండుగ దినం
ప్రతి ఇంట వసంతాలు విరబూయాలని ప్రతి ఇంటా ప్రతి ఒక్కరు తెలుగు గడ్డన పుట్టి తెలుగు భాషను మరవకుండా తెలుగును కాపాడుకుంటూ కొత్త తెలుగు సంవత్సరం నాటి నుండి అందరూ అనందంగా జీవించాలని కోరుకుంటూ..
శుభాభినందనలతో ,
2 కామెంట్‌లు:
చక్కగా చెప్పారు! నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
Thanks andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి