పని పాటా లేక తిరిగే ఓ జులాయిని ఇంటి నుండి గెంటేసిన పిదప జరిగే కథ.
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
రోసం పుట్టి వీసాని పట్టీ అమెరికాకు వచ్చేశాను
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
బతకలేని బడిపంతులాగా బాల్టిమోరులొ అడుగెట్టాను
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
కడపలోన గడపలేక రోతే పుట్టి ..డాలరంటె తగని నాకు మోజే పుట్టి
బాల్టిమోరు చేరినాను చేరినాక ఎదురు చూసినా.. ఎవరి కొసం?
మాయ మాయ మాటలతో మస్కా కొట్టీ ఎంప్లాయర్ ముంచాడు నిల్చోబెట్టి
న్యూజెర్సీ కెల్లినాను న్యూయార్కు కెల్లినాను ఆస్టిన్ కు ఎల్లినాను బోస్టన్ కు ఎల్లినాను
బాల్టిమోరుకూ వచ్చి సెట్టయాను
మరిక్కడ ఎంప్లాయెర్లు ఏం జేశారు..?
రేటులోన వాటాలు మరిచి నాటా బాటా పట్టించారు
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
వచ్చి రానీ తవికల్తో ప్రజను పొలి కేక పెట్టించారు
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
ఇదిగో రోషయ్యా.., అదంత సరేగాని
అసలు ఈ అమెరికా గోలేటి?
యవ్వనాల సంకెళ్ళు తెంపి బంధనాలను తెంచేవారు
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
వచ్చి రాని వయసుల్లో జారి చదువు సంధ్యలు తగవన్నారు
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
భాలికలే భయములేక భామలాయెరో..
ఏలికలే మరిచినారు యువతరాన్నిరో
అడ్డమైన తిరుగుల్లే ఉల్లాసంగా
Odd job చేరతారు ఉత్సాహంగా
కొలువులేని మమ్ము జేరి H1Bలు ఇచ్చారుగా ఎవరికోసం?
ఇంగిలీసు నేర్పినారు client దగ్గరా..
వారానికి మూడు రోజులింటి వద్దరా
ఇరు జీతాలెత్తిపెట్టి ఇరుకు గదులు వదిలిపెట్టి
విలాసాలు పక్కనెట్టి నివాసాన్ని చక్కబెట్టి
కన్నవారిని సైతం మర్చి పోయారు..
బాబోయ్, మర్చిపోయార! ఇంకేం చేశారు?
వీధికొక్క వారధినే కట్టి తోటి వారిని విడగొట్టారు
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
ఉన్న గుంపును చెడగొట్టినారు కులపు కంపును ఎగదోశారు ..
రింగ రింగ రింగ రింగ, రింగ రింగ రింగా రింగా రె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి