శిశిరపు పొద్దుగూకే వేళ భానుడు తన గూటికి చేరే వేళ
విరిసిన విరితేనెల చందనమో
కురిసిన మెఘమధనపు గ్రీష్మ తాపమో
మెరిసింది ఓ అందం...
వందనాలు ఆ అందానికి చందనాలు సరి తూగవు ఆ వర్ణానికి
వనంలోని కవనంలా వసంతంలోని కోయిలలా
సెలయేటి జలపాతంలా చెలిపాడే లయ గీతంలా
ఏరువాకాన ఎదురొచ్చింది కోరుకున్నాక మనసిచ్చింది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి