కరుణించిన వరుణుడు
భానుడికి తోడు రాగా,
సహకరించిన వాయు
దేవుడి వింజామరల వీచికల చల్లని చిరుగాలి వెంట రాగా ,
దాతల దాతృత్వం
వారధి వెన్నుదన్నుగా అండగా నిలవగా..
వందలమంది పురజనులు
ఉగాది పర్వదిన సంబరాలను చూడ తరలిరాగా ,
వారధి గుమ్మంలో
కమ్మని ఉగాది పచ్చడి రుచి చూడగా,
అచ్చెరువొందే
వేడుక సొబగులతో వేదిక అలంకరించగా,
కనిపించని తెలుగుదనపు
లోగిళ్ళు కళ్ళ ఎదుట సాక్షాత్కరింపగా,
వినిపించని సంగీత
స్వర రాగ జల్లులు పిల్లలు ఆలపించగా,
విశాల ప్రాంగణంలో
పంచాంగ శ్రవణం ప్రబోదించగా,
పరవళ్ళు తొక్కే
పడతుల శుభారంభం సుందర స్వప్నానికి ప్రమిదలవ్వగా,
చిమ్మ చీకటిలో
శివతాండవ నాట్యంలో రేడియం కాంతులు మెరవగా
ముద్దుగారే పసి
మొగ్గలతో అద్భుత బాల రామాయణం చిత్రించగా,
వారధి చరితలో
నిలిచె బాల రామాయణం తలమాణికముగా ,
వీక్షించిన ప్రేక్షకుల
కరతాళ ధ్వనులు మిన్నునంటగా..
మావిడి పచ్చడి
కమ్మదనం,పూత రేకుల తియ్యదనం,పసందైన రుచులు పండుగను ప్రతిబింబించగా..
సనాతన సాంప్రదాయ
సంబరాలకు వారధి నిలిచింది చిరునామాగా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి