పరివార ప్రయాణం..
సప్త సంద్రాల అవలిగట్టున
విలువైన కొలువులని తలచి
జీవంపోసిన వారిని విడచి
మన మట్టికి దూరంగా నడచి
చమరించే కళ్ళతో నిట్టూర్చే మన అందరికీ..
స్నేహితులే తోబుట్టువులై
కన్న బిడ్డలే మన కన్నవారై
నేస్తాల నెచ్చెలులే చెల్లెమ్మలై
కరోనా కాటుకు కలత చెందుతూ
కాలం చూడని కష్టాల కడలిలో ..
సరికొత్త ఆనందాన్ని ఆవిష్కరింప
గడపదాటి ఆవరణలో అడుగెట్టి నింగివైపు తొంగి చూస్తూ
జంటగా గంధపు గాలుల వసంతపరిమళాలతో
శ్వేత వర్ణాల జాబిలమ్మ అందాలతో దోబూచులాడుచుండగా..
నాన్నా అంటూ వేలు పట్టుకు నడిచొచ్చిన
బోసినవ్వుల పసివారి మిసిమి చాయలను
వారి పసిడి కాంతుల లలిత లావణ్యాలను
పరికిస్తూ ఓ కంట ,
పరిచయమక్కరలేని మిడిసిపడే గడుసు పిల్లల
గోల భరిస్తూ మరో కంట ..
విద్యా బుద్దులనొసగే సత్య వాక్కుల
నిత్య ప్రభోదాలను అనుసరిస్తూ
ప్రవాసుల సౌహార్ధ చంద్రికల ప్రసాదామృతాలను
సేవిస్తూ సిరినొసగే శ్రీధరుడి ప్రియ నేస్తాలై
ఏరాశియైనా వాసికెక్కి వర్ధిల్లాలని ఆ రామాంజనేయుల సాక్షిగా
ఆకాంక్షిస్తూ..మీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి