ఎంతో కొంత కొత్తేడాదిని ఆహ్వానించడంలో,
కొత్తదనాన్ని కోరుకోవడంలో లేదు ఏ వింత!
కొత్తదనాన్ని కోరుకోవడంలో లేదు ఏ వింత!
గతించిన గమనంలో చెంత చేరిన చింతలెన్ని ఉన్నా
రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కి కాలానికి ఎదురీదడమే మిన్న!
రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కి కాలానికి ఎదురీదడమే మిన్న!
ఒక్కింత దుఖం,కాసింత సంతోషం అంతులేని ఆనందం సొంతమవ్వాలంటే
పంతాలు మాని స్వాంతన కల్గించే ఇలాంటి సంబరం జరుపుకోవాలి ప్రతి సంవత్సరం !
పంతాలు మాని స్వాంతన కల్గించే ఇలాంటి సంబరం జరుపుకోవాలి ప్రతి సంవత్సరం !
వళ్ళంత కళ్ళింతలుగా చేసుకుని ఎదురు చూసిన ఆ క్షణం
వచ్చింది కొత్త సంవత్సరం తెచ్చింది అందరి జీవితాల్లో నవ వసంతం!
వచ్చింది కొత్త సంవత్సరం తెచ్చింది అందరి జీవితాల్లో నవ వసంతం!
వంతు వంతున గెంతులేస్తూ కేరింతల తంతు ఇంతలా ఉంటుందా అన్నంతగా..
నిశి రాతిరిన నిషాలో ఆటలు నిశీధి వీధిన హుషారైన పాటలతో కొత్త సంవత్సర సంరంభం ప్రారంభం!!!
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి