27, ఫిబ్రవరి 2017, సోమవారం

నాన్న!


తొలిపలుకుల తళుకుల్లో పెదవులపై విరబూసిన రెండొ పదం.

బుడి బుడి నడకల తడబడే అడుగుల్లో వేలు పట్టి నడిపించే మూడో పాదం.

ఆదమరచే నిదురలో బెదిరిన ప్రతిసారి తన గుండెలపై శయనింపే విరి తల్పం

ఆడే ఆటల్లో గుర్రమై నేర్పే విద్యలో గురువై 

పాడే పాటల్లో స్వరమై పంచే ప్రేమలో నరమై

 పరిశ్రమించే శ్రామికుడై

విశ్రమించని సైనికుడై

బంధాల పూదోట తోటమాలియై

పరివార గుడికి పూజారియై

నిలిచే బంధాలకు నిలువెత్తు సాక్షాత్కారమై,నిలువ నీడకు విలువలద్దిన బొధి వృక్షమై,

బరువు ,బాధ్యతకు ఓ సరళ నిర్వచనంలా నిలిచే నాన్న నిత్యం ఒంటరివాడే..!

మందలించిన అమ్మను కాదని తన నిరసనను

కఠినంగా ప్రదర్శించినా ప్రతిఘటించలేని చనువే నాన్న!

కనిపించని స్వర్గం, కనిపెంచిన అమ్మ పాదాల చెంత ఉంటే

ఆ స్వర్గం,సమస్త భువనాలు నాన్న పాదాల దాస్యం అని చరిత్ర తెలిపే ఓ నగ్న సత్యం!

నీకోసం నిరంతరం శ్రమించి అలసిన ఆ నాన్న కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? వారి పాద పద్మముల కడ సేద దీరడం తప్ప..!

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

కుల మతాలు


కుల మతాలు పెచ్చరిల్లడం సమ సమాజ నిర్మాణానికి విఘాతం

 

కులమతాలు మల మూత్రాలతో పోల్చతగ్గ పరిణామం

 

కులమతాలు విడనాడడం దేశానికి శ్రేయస్కరం

 

మల మూత్రాలు విసర్జించడం దేహానికి ఆరోగ్యకరం

 

మనిషిగా మానలేమా ఈ మతోన్మాద వివక్ష ధోరణులు?

 

మానవుడిగా నివారించలేమా ఈ కులాల కుమ్ములాటలు?

 

సగటు జీవిగా సవరించలేమా ఈ వర్గాల వైషమ్యాలను?

 

దూర దూర తీరాలకు చేరువైనా భారమైన బతుకులతో సతమతమవుతున్నా

 

సాటి మనిషికి సహాయపడని ఈ వ్యర్థ కుల మత విద్వేషాలెందుకు మనకు?

 

పంచభూతాలకు లేని కుల మతాలు వాటిని ఉపయోగించుకునే మనకెందుకకు?

 

ఒక్కసారి ఎదుటివాడికి స్నేహహస్తాన్ని అందించి చూడు

 

మసకబారుతున్న మానవ బంధాలు ఎంత బలపడతాయో?

 

ఒక్కసారి ఎదుటివాడిని చిరునవ్వుతో పలకరించి చూడు

 

శిధిలమై పోతున్న స్నేహబంధాలు ఎలా గట్టిపడతాయో?

 

కులమంటే మనలోని కుళ్ళుయని మతమంటే మనలోని ఓ మాయని గుర్తించు

 

కాటికి కాలు చాపినపుడు  కనులు తెరుచుకోకముందే

 

ఈ బంధాలలోని పరిమళాలు ఆస్వాదించు..ఫలితాలు  అనుభవించు..నేటినుండే!

ప్రవాసులారా!

నీరుగార్చే నిబంధనల నిట్టూర్పుల సెగల తాకిడికి 


కుదేలవుతున ప్రవాసులారా! 


నారు పోసిన వాడు నీరు పోయక మానడు అన్నది నీవెరుగవా? 


నారు నీరు నోరు ఉంటే ఏ రాజ్యంలో ఉన్నా ఒక్కటే అన్న సత్యం కాదనగలవా..? 


నాలుక ఉన్నోడు నలు దిక్కులు తిరుగగలడు. 


పదును ఉన్నోడు ఆ దిక్కులన్నీ ఒక్కటి చేయగలడు  


సుదూర తీరాలలో అనుక్షణం భయం గుప్పిట్లో సాగే మనుగడకంటే 


ఉన్న వూరులో కన్నవారి చెంత సాగించే నీ పయనం సౌఖ్యం కాదా..? 


ట్రంపు గుంపు రేపే కంపు స్లంపులో మనసు చంపుకుంటూ కట్టు బానిసలా బతకాలా..? 


ఆ కంపునే మన ఇంపుగా తలవని తలంపుగా మలుచుకొని స్థానికంగా బతకాలా? 


స్వేదం చిందించి కండ బలం కరిగించి రుధిరం మరిగించి జీవన యానం సాగిద్దాం..
నిండు భారతీయుడిగా దేశం మీసం తిప్పుదాం ,భరతమాత చరణాల వద్దే మా జీవితం అని సగర్వంగా చాటుదాం !

2, జనవరి 2017, సోమవారం

mere naina-peradee


నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ… నిను మార్చే తీరేదీ..? 2”
 
1)ఈ ప్రేమ బంధాలే.. కన్నీటి గండాలై
నీ ఆటలోనూ ఈ పాటతోనూ
ఎదలోని భారం తీరేనా…చెలి దూరం తరిగేనా...
 
కలలే కరిగి శిలగా మిగిలే
కొన ఊపిరె నా శ్వాసా..నీ ఉనికే నా ఆశా
 
2)నిను కలిసే దారి  లేదా కడసారి
ఈ గుండె కోతా ఆ బ్రహ్మ రాత
ఇకనైన రేపు మారేనా…మనసై చెలీ చేరేనా..
 
చెరగని మదినే చేశానె గుడిగా
కనుమూసేలోగ రావా తనువిడిచే లొగ రావా..

నీ జ్ణాపకాలే....


నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ… నిను మార్చే తీరేదీ..?
నువు కాదంటే పెను చీకటి ఈ లోకం మున్ముందు ఎలా తీరును ఈ శోకం?
 
నిరంతరం నీ ధ్యాసలో వెల్లువలా పొంగే నీ నవ్వుల  శ్వాసలే
 
నా ఆశల ఊపిరవగా
 
ఛిక్కి శల్యమౌతున్న ఈ దేహాన్ని అడుగు నా దాహమెంత పవిత్రమైనదో?
 
కనులముందు నిలుచున్నా కంటతడి కారుతున్నా
 
అక్కున చేరని అందాన్ని లెక్కచేయని నీ పొగరుని నిలదీస్తున్నా
 
ఈ అనంత విశ్వంలో పవిత్ర ప్రేమకు ఇంకా స్థానముందా అని?
 
తలవని తలంపుగా రేగే తలపులు మది తలుపులను ఎగదన్నుకుంటూ
 
హృదయాన్ని విచ్చిన్నం చేస్తుంటే ..విధిరాతలో  గుండె కోత గాయపు
 
వ్యధలను మునిపంటితో అదిమి బయటపడలేక..హృదయాంతరాలలో ఇముడ్చుకోలేక,
 
ఎవరికి చెప్పాలో తెలియక ఎవరికీ చెప్పుకోలేక..నాకు నేను అర్థంగాక
 
చేతకానివాడిలా నీముందు అచేతుడినయ్యాను…కరుణిస్తావో…కనికరిస్తావో.. కాటేస్తావో.. లేక... కఠినంగా శిక్షిస్తావో…నీ విజ్ణతకే వదిలేస్తున్నా..

కొత్త సంవత్సరపు వేడుక..



సందేల  సూరీడు తొందరగా  తన గూటికి జారుకున్నాక

కోట్ల మంది మదిలో మెదిలిన కొత్త సంవత్సరపు వేడుక

ఊపిరి పోసింది ఉత్సవానికి చీకట్లు ముసురుకున్నాక

ఎప్పటిలానే తరుణిల తగరపు మెరుపుల తరుణమిక

మింటినంటిన తారలను తలదన్నే తళుక్కులని వీక్షించక తప్పదిక

భారీగా తరలిన జనం క్రిక్కిరిసిపోయిన జన ప్రభంజనం

బారులు తీరిన జనం ఏరులా పారిన సుర పానం

దేదీప్య మణుల కాంతిమయం దేవలోకాన్ని మరపించే కాంతలమయం

లయబద్దపు సంగీతపు హోరు లావణ్యపు రమణుల జోరు

అంచెలంచెలుగా మించిన పాటల బీట్

చిందులాటలో పెంచిన జనాల హీట్

మధ్య మధ్యలో raffles కిక్కు

gold coins తో జనాలకు లక్కు

షడ్రసోపేత విందుల మ్యాజిక్

ప్యారడైజు వారికే చెల్లిన లాజిక్

అరుదెంచి ఆరగించడం అతిధుల లక్

అన్నదాన కార్యక్రమ సందర్భంగా రాసిన చిన్ని రాతలు..


కాళీ Templeలో వారధి తలపెట్టిన అన్నదాన కార్యక్రమ సందర్భంగా రాసిన చిన్ని రాతలు..
 
ప్రకృతి మాత తన రెక్కలు విప్పిన క్షణాన..

అంతవరకూ అందంగా అమరిన ఆకులు 

శరదృతువుకు స్వాగతం చెబుతున్నట్టు రాలగా..

అప్పుడే నెలబాలుడు నింగిలో తొంగున్నట్టు దోబూచులాడగా..

బ్రతుకమ్మ చెక్కిలిపై బంతిపూలు విరబూశాయి

తెలుగోడి గుండెల్లో ఆనందపు జల్లులు వెల్లివిరిశాయి!

దేవీ నవరాత్రుల సేవలో దేవేరీలు తరియింపగా

జగన్మాత పూజకై జనులందరూ తరలిరాగా

కాళీ మాత గుడిలో దుర్గామాత ఒడిలో

విచ్చేసిన భక్తులకు అన్నపానాదులను అందివ్వగా

జగన్మాతకు జనులకు నడుమ వారధి ప్రమిదవ్వగా

వారధి సేన తరించింది పరుల సేవలోని పరమార్థాన్ని సగర్వంగా చాటింది!
 
విజయదశమి శుభాకాంక్షలతో...