2, జనవరి 2017, సోమవారం

నీ జ్ణాపకాలే....


నీ జ్ణాపకాలే వెంటాడుతుంటే నిను మరిచే దారేదీ నిను మార్చే తీరేదీ..?
నువు కాదంటే పెను చీకటి లోకం మున్ముందు ఎలా తీరును శోకం?
 
నిరంతరం నీ ధ్యాసలో వెల్లువలా పొంగే నీ నవ్వుల  శ్వాసలే
 
నా ఆశల ఊపిరవగా
 
ఛిక్కి శల్యమౌతున్న దేహాన్ని అడుగు నా దాహమెంత పవిత్రమైనదో?
 
కనులముందు నిలుచున్నా కంటతడి కారుతున్నా
 
అక్కున చేరని అందాన్ని లెక్కచేయని నీ పొగరుని నిలదీస్తున్నా
 
అనంత విశ్వంలో పవిత్ర ప్రేమకు ఇంకా స్థానముందా అని?
 
తలవని తలంపుగా రేగే తలపులు మది తలుపులను ఎగదన్నుకుంటూ
 
హృదయాన్ని విచ్చిన్నం చేస్తుంటే ..విధిరాతలో  గుండె కోత గాయపు
 
వ్యధలను మునిపంటితో అదిమి బయటపడలేక..హృదయాంతరాలలో ఇముడ్చుకోలేక,
 
ఎవరికి చెప్పాలో తెలియక ఎవరికీ చెప్పుకోలేక..నాకు నేను అర్థంగాక
 
చేతకానివాడిలా నీముందు అచేతుడినయ్యానుకరుణిస్తావోకనికరిస్తావో.. కాటేస్తావో.. లేక... కఠినంగా శిక్షిస్తావోనీ విజ్ణతకే వదిలేస్తున్నా..

కామెంట్‌లు లేవు: