నీతో ఏదొకటి ముచ్చటిస్తే కానీ పొద్దు పోదు నాకు
నీతో గడిపిన క్షణాలను తలుచుకుంటే గానీ కాలం విలువ తెలియదు నాకు
నీతో చెప్పుకున్న వూసుల బాసల మాలలతో అల్లిన పందిరి కింద సేదతీరితెగానీ అలసట తీరదు నాకు
నీ నవ్వుల హరివిల్లులే వీనులకింపైన కోటి వలపు వసంత రాగాలని తెలియలేదు నాకు
నీ చల్లని ఒల్లో పడుకొని చక్కని కళ్ళలో చూస్తే గానీ కోరితే వచ్చిన వన దేవతవని తెలియలేదు నాకు
నీవిచ్చే అధరాల మధురిమల్లో తేలియాడితేగానీ అవధులెరుగని ఆనందలోకాలు కనపడలేదు నాకు
నువ్వు చేసే సద్విమర్శలే కనుమరుగవుతున్న స్నేహితులను కానుకగా దరిజేర్చింది నాకు
నీ కనులలో సుడులు తిరిగిన కన్నీరే సుగంధాల బంధాలను పరిచయం చేసింది నాకు
ఇంత కన్నా ఏమి చెప్పగలను నీకు !!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి