ఒక్కో క్షణంలో అది అహంకారమనిపించినా…
మహా ముద్దొచ్చే ఆ అందానికి అదే అలంకారం కాబోలు..
పదే పదే ప్రదర్శిస్తూ అసహనానికి ఆఖరి మెట్టున
ఒక్కసారిగా తన అధరాలతో ముద్రిస్తుంది ఓ మధుర సంతకం..
ముద్దు ముద్దు పలుకుల్లో హద్దులెరుగని రసికత ఎంత దాగి వున్నా
తీర్చి దిద్దిన ఆ నాసికం ,కాటుక అద్దిన ఆ నయనం,
అధరాల మధురిమలకే అసూయ పుట్టించే ఆఅధరం
పొందికగా అమర్చిన ఆ రేసుగుర్రాల ద్వయం
ఒద్దికగా వుండే వయ్యారికి వన్నె తెచ్చే ఆభరణం!
నిరంతర ధ్యాసలో నీ ఉనికే ఊపిరిగా,నీ ఆశే నా శ్వాసగా,
నీ పలుకే నను మేల్కొలిపే ఉషోదయపు వేకువలా,
నీ చూపే నా దేహానికి దాహమిచ్చే దాహార్తిలా
నీ పేరే నా జీవన గమనంలో నను నడిపించే సారధిగా
జీవిస్తున్న ఈ జీవికి రెయింబవళ్ళు నువ్వే కలవరం…..కాస్తైనా కలగదా నీకు కనికరం?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి