కాళీ Templeలో వారధి తలపెట్టిన అన్నదాన కార్యక్రమ సందర్భంగా రాసిన చిన్ని రాతలు..
ప్రకృతి మాత తన రెక్కలు విప్పిన క్షణాన..
అంతవరకూ అందంగా అమరిన ఆకులు
శరదృతువుకు స్వాగతం చెబుతున్నట్టు రాలగా..
అప్పుడే నెలబాలుడు నింగిలో తొంగున్నట్టు దోబూచులాడగా..
బ్రతుకమ్మ చెక్కిలిపై బంతిపూలు విరబూశాయి
తెలుగోడి గుండెల్లో ఆనందపు జల్లులు వెల్లివిరిశాయి!
దేవీ నవరాత్రుల సేవలో దేవేరీలు తరియింపగా
జగన్మాత పూజకై జనులందరూ తరలిరాగా
కాళీ మాత గుడిలో దుర్గామాత ఒడిలో
విచ్చేసిన భక్తులకు అన్నపానాదులను అందివ్వగా
జగన్మాతకు జనులకు నడుమ వారధి ప్రమిదవ్వగా
వారధి సేన తరించింది పరుల సేవలోని పరమార్థాన్ని సగర్వంగా చాటింది!
విజయదశమి శుభాకాంక్షలతో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి