కరతాళ ధ్వనులే తెరచాప రణితములై శరవేగంతో దూసుకెల్తుంటే
అనుకోలేదు ఏనాడు విధి ఇంతలా ఆడుకుంటుందని!
దాతల వదాన్యతయే దేవ దూతల ఆశిస్సులుగా దీవిస్తుంటే
అనుకోలేదు ఏనాడు శ్రమించిన వారికి వారధి రిక్తహస్తాలు మిగిలిస్తుందని!
చప్పట్లు కొట్టి శభాష్ అన్న చేతులే తెర వెనుక పావులు కదిపితే
నమ్మలేదు ఏనాడు తాగిన తల్లిపాల రొమ్మునే గుద్దుతారని!
ఆరమరికలు లేకుండా తన మన భేదాలు చూపకుండా వ్యక్తీకరిస్తే
అనుకోలేదు ఏనాడు ఇంతటి కరడుగట్టిన కక్షిదారులుంటారని!
ఓ వారధీ!...ఇలాగే చూస్తూ ఉండు
కరుణ వర్షించిన ఈ నయనాలే అగ్ని కణికలు కురిపిస్తాయని..
చిరునవ్వులు చిందించిన ఈ అధరాలే అధముల పాలిటి ఆయుధాలవుతాయని..
నిష్పక్షపాతానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన నీ కరములే శత్రువుల పాలిటీ శరములై మన అందరికి వరములై
తరాలకు తరగని యశములతో నిలిచిపోతుందని …
వెలిగిపో వారధి ...తరిమికొట్టువారిని…

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి