వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ఆ రోజు మొదలు
నవదంపతులుగా నలుదిక్కులు మాతో నడచిన రోజులెన్నో!
పంచ భూతాలా సాక్షిగా జీవిత పల్లకి ఎక్కిన ఆ రోజు మొదలు
ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపించేలా వినుతించిన రోజులెన్నో!
శ్రీరస్తు శుభమస్తు అని శ్రీకారం చుట్టిన ఆ రోజు మొదలు
ఆలు మగలుగ తోడు నీడగా ఆనందాన్ని చవి చూసిన రోజులెన్నో!
ఆణి ముత్యాలు తలంబ్రాలుగ శిరమున కరములతో తడిసిన ఆ రోజు మొదలు
గడచిన మనుగడలో నిలిచిన మధుర జ్ఞాపకాలెన్నో !
అజన్మాంతం తోడుగా కలసి ఉంటామని ప్రతిన బూనిన ఆ రోజు మొదలు
దశాబ్ధకాలంలోనే శతాబ్ధానికి సరిపడ తీపి జ్ఞాపకాలు ఎన్నో ..మరెన్నెన్నో...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి