గుప్పెడంత
మనసుల ఎదను తెరచి
కోటి ఆశల అభిమానపు
తివాచి పరచి
వెలకట్టలేని
అభిమానాన్ని గుండెల్లో దాచి
ఎప్పుడెప్పుడా
అని వేయి కన్నులతో
ఎదురు చూచి
తొలీఅట కోసం ముందు రోజు
నుండే నిదుర మరచి
ఆపసోపాల ఇక్కట్లలో టిక్కెట్లు తీసి
అభిమాన హీరో ఎంట్రీ కోసం
అర్రులు చాచి
ధియేటర్ గోడలు బద్దలయ్యేలా అరచి
అరచి
ఆశగా ఎదురు చూస్తే…చివరకు
మిగిలేది….నిరాశేనా అజ్ఞాత వాసీ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి