ఎన్నో ఏళ్ళుగా బతుకు పుస్తకంలో
ప్రతి పుటను ప్రకృతి పలకరిస్తుంది
ప్రతి అక్షరముతో కరచాలనము చేస్తుంది
ప్రతి మనిషికి పంచభూతాలనందిస్తుంది
కాలంతో
కదులుతూ తన కర్తవ్య
ధర్మాన్ని నిర్వర్తిస్తుంది
మనిషిగా
నీ దాతృత్వ
గుణాన్ని నిర్వర్తించమంటుంది
అపుడే ధర్మం నాలుగు పాదాల
నడిచే ఆలంబన కలుగుతుంది
రండి కదిలి రండి కలసి
రండి వారధి తలపెట్టిన
దాతృత్వపు
విరాళాల సేకరణలో పాలుపంచుకొనండి..తద్వారా
అవిటివారిని
ఆదరిద్దాం..అంధులను ఆదుకుందాం..
రేపటి ఆశకు చీకటి తెర తొలగిద్దాం
వారి కంట్లో 'ఆశా కిరణాల' వేకువ చూపెడదాం
మీ వారధి..
సమాజపు
పరిధులు పెంచే సారధి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి