మబ్బులు కమ్ముకున్నా చీకట్లు ముసురుకొన్నా
చలిగాలులు తరుముతున్నా వేడి గాలులు చిమ్ముతున్నా
స్థబ్దతే రాజ్యమేలినా నిర్లిప్తతే ఆవరించినా
గగనమే రగిలినా సునామే చుట్టినా
సంగీత సాహిత్య సంస్కృతులే వారధి శస్త్రాలుగా
అలుపెరుగని యోధులే వారధి అస్త్రాలుగా
బిగించిన ఉక్కు పిడికిలితో వారధి నుదుట
విజయ తిలకం దిద్దే నిరంతర శ్రామికులుగా
గెలుపన్న పిలుపే వారధి చిరునామాగా
అలవాటై విరాజిల్లుతున్న వారధి తల్లి ఒడిలో వికసించే మరో ఆణిముత్యమే
రాబోయే దీపావళి దసరా సంబరాల సం రంభాలు...తరలి రండి
ప్రవాసులకు కనుమరుగవుతున్న కమనీయ దృశ్యాలను దర్శించండి..
వారధి!
తెలుగు సమాజపు పరిధులు పెంచే సారధి………
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి