స్వాతంత్ర్యం
అంటే ఎందరో త్యాగ మూర్తుల
ఫలం..ఇది నేటి మన
స్వాతంత్ర్య దినోత్సవం..
కానీ
ఎక్కడ వచ్చింది స్వాతంత్ర్యం.?ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం.?
ఆరు దశాబ్దాలు గడచినా ఆకలిని జయించలేని భారతావనికా..?
భయం గుప్పిట్లో నిత్యం సంఘర్షించే సామాన్యుల
జీవితాలకా..?
అనుక్షణం
మగ మృగాల కామకేళి కిరాతకానికి
బలవుతున్న అబలలకా..?
ధనార్జనే
ఊపిరిగా దేశ సమగ్రతను తాకట్టు
పెట్టే నీచ రాజకీయ వాజమ్మలకా..?
నిర్భయ
చికిత్స నిమిత్తం మరో దేశం తరలించ
అసహాయ స్థితిలోని వైద్య రంగానికా..?
పట్టెడు
మెతుకులు పండించే రైతన్నకు
గుక్కెడు సాగు నీరు అందజేయలేని
వ్యవసాయ రంగానికా..?
సుసంపన్న
దేశ సంపదను వేల కోట్ల రూపంలో
తరలించి భరతమాత చెక్కిలిపై కన్నీరు నింపే స్విస్ ఖాతాదారులకా..?
బడుగు
వర్గాలకు కనీసపు విద్య ఉపాధి అందించలేని
కుళ్ళిపోయిన దుష్ఠ పాలక వ్యవస్థకా..?
అంతులేని
నిర్వేదముతో చింతాక్రాంతుడనై ఏకాంతాన సతతము నాలో నేను
ఆవిష్కరించుకుంటున్న ఆవేదన!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి