6, డిసెంబర్ 2014, శనివారం

కాలేజి కుర్రవాడ పాటకు పేరడి

కాలేజి కుర్రవాడ కులాసాగ తిరిగెటోడ..అన్న పాత పాటకు పేరడి..లాఖీడ్ మార్టిన్ అనే కంపెనిలో ప్రతి సెప్టెంబర్ మాసంలో జరిగే లయొఫ్ఫ్స్ ని డృష్టిలో ఉంచుకొని రాసిన పాట..


లాకీడు చేరినోడ ఏకీడు ఎరగనోడ
సెప్టెంబర్ మరవబోకురో ఓ ఇంజినీరు..
ఫైరింగులు మొదలవ్వునురో ఓ ఇంజినీరు…

బిల్లింగులు సూపరని బిల్డింగులు టాపు అని
ఎటుచూసిన తెలుగువాడు కనపడడు తెల్లవాడు
బడ్జెట్టు లేదు అంటె భారమే లైఫుఅంతా

బాల్టిమోరు భలేగుందనీ ఓ ఇంజినీరు…
ఇల్లుకొంటె గుల్లవుతవురో ఓ ఇంజినీరు…"

NGలొ చేరినోడ ఎంజాయి చేసెటోడ
సెప్టెంబర్ గండముందిరో ఓ ఇంజినీరు..
కంటి నిండ కునుకుండదురో

వీకెండు పార్టీలు వీకుడేసు గ్రాసరీలు
రోజుకో తెలుగు మూవి పక్కలో రతీదేవి
imaxలొ మ్యాట్నీలు lexusలొ జర్నీలు
ఇలాగుంటె..?

జన్మ భూమి మరచిపోతమో చివరికి
కన్న తల్లి మరచిపోతమూ.. "లాకీడు చేరినోడ "

అందుకే …
పొంచివుంది ప్రమాదం ..ముంచుకొచ్చె ఓ ప్రళయం
వచ్చేది కోత మాసం నచ్చేది మాఘమాసం
విధి ఆడే ఈ నాటకం ఓ ఇంజినీరు…
మరిచిపోకు మన పాత్రను ఓ ఇంజినీరు……"లాకీడుచేరినోడ "

After Firing
జడుసుకోకు ఏ క్షణం మిడిసిపడకు నీక్షణం
విరమించకు నీ ప్రయత్నం..సడలించకు ఏనిమిషం
ప్రయత్నిస్తే అవకాశం దొరుకుతుంది మనకోసం
నమ్మకమే నీ ఆయుధం ఉద్యోగమే నీఆశయం
పదిమందికి నీవే మార్గమూ ఓ ఇంజినీరు…
ప్రగతికే సోపానమూ ఓ ఇంజినీరు…

కామెంట్‌లు లేవు: