మిర్చీ
పాటకు పేరడీ
ఓ మంచి మనసున్న స్నేహితునికి
కానుకగా ...పండగ లా దిగి
వచ్చావు ...పాటకు అనువుగా చేసిన
చిన్ని ప్రయత్నం ఈ పేరడీ ...మిర్చీ
సినిమా నుండి..నచ్చితే వ్యాఖ్యానించండి..
అందరిలా
ఒకడై వచ్చి స్నేహానికి రూపై
నిలిచి నీమనసుతొ మమ్మే గెలిచావూ..
ఓ నా ఆత్మకు తోడయ్యావు
నాగుండెకు గూడయ్యావు నావెంటే నీడై నిలిచావూ..
దరిచేరితె
ఉల్లాసం సరిజోడుగ ఉత్సాహం
మనిషంటే
అభిమానం మనసుల్లొ కలకాలం
ఇట్టాగె
పదికాలలు ఉండనివ్వు “అందరిలా”
ఓ సాయంలో వినలేదే ఏనాడు కాదనడం ఈ
నాటికి చెవులారా..
ఓ పగవాడిని ప్రేమించే చల్లని నీగుండెల్లొ లేదు ఏ పొలిమేర
ఓరిమిలో
కొండంత కూరిమినే మదినిండా మురిపెంగా నిలిపావా
దిగమింగిన
తలపుల్లో తడి ఎరగని కన్నుల్లో
ఒంటరివై నిలిచావా..
మాట నేర్చిన మనసు జూసిన మాననీయుడుగా
వెతలు
ఈదిన కథలు తెలిసి జతగ
చేరినవా ఇలా.. “అందరిలా”
చింతల్లో
చిరునవ్వు చిత్తంలో అరనవ్వు కాంచా నే కనులారా
ఓ ముచ్చటగా మక్కువతో అచ్చంగా దేవుడిలా పలికే ఓ ధృవతారా
నొప్పించని
నీ నైజం కోపించని నీ
వైనం కొనియాడుదు మనసారా
కులమంటూ
పట్టింపూ మతమంటూ గుర్తింపు నచ్చని ఓ రణధీరా
నిండు
మనసుతో పొంగిపోయిన క్రిష్ణ కుచేలుడిలా
స్నేహ
గుణమున చరితకెక్కిన్న దాన కర్ణుడిలా అలా
“అందరిలా”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి