అంతవరకూ నీరెండ మాటున మౌనాన్ని ఆశ్రయించిన
శిశిరపు గాలులు రెక్కలు విదిల్చిన వేళ ..
సాయం సంధ్యపు సంజ చీకట్లు ముసురుకొనేవేళ ...
దశాబ్దపు ఆఖరి గడియల వేడుకలకు
శ్వేత సౌధము వేదికైన వేళ ...........
అదిరే రుచులతో అతివలు ఆరగించగా
మకరందపు మధువులు సేవింప తుమ్మెదలు చేరగా
సంగీత ఝరిలో యవ్వన గీతికలు పల్లవించగా
ఓపలేని ఊపున ఆపలేని నృత్యాలు కదం తొక్కగా
జంటల నృత్యం జనుల కనుపంటగా
అందరి చిందులు అందలం తాకగా
నడిరేయి జాముకి వడి వడిగా పరుగులు తీయగా
దిక్కులు పిక్కటిల్లేలా మేఘాలు గర్జించేలా
"హ్యాపీ న్యు ఈయర్ " అన్న నాదం ప్రతిధ్వనించింది
కొంగొత్త దశాబ్దానికి పునాది వేసింది ..
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో...
చంద్ర కాటుబోయిన ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి