26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి శుభాకాంక్షలతో..

కరకుడైన నరకుడిని వధించి దిశదిశలా జరిపుకునే దీపావలి
కారకుడైన కారణజన్ముడికివే కరములు జోడిస్తూ కావించు నివాళి
చిన్న పెద్దా తారతమ్యాలు లేకుండా సంబరంగా జరుపుకొనే దివాలి
కరిగిపొయే కాకరొత్తులు,చెదిరిపోయే కాగితపు ముక్కలు,
పడగవిప్పే పాము బిల్లలు,సుడులు తిరుగే భూ చక్రాలు
అచ్చెరువొందే చిచ్చుబుడ్లు,నింగికెగసే రాకెట్లు ,
దిక్కులు పిక్కటిల్లే బాణసంచా ధ్వనులు ,మేఘాల దరిజేరు తారాజువ్వలు
చిటపటలాడే పటాసుల సరాలు మణిమయ కాంతి మతాబులు
వంటివి ఎన్నో ఎన్నెన్నో వాటికి వున్నాం కడుదూరం..
దీపావళి అనుభూతిని అనుభవించలేని రూపాయి అవిటితనం
కానీ మన మనసులు మాత్రం వీటికి అతి సమీపం..
తగదు డాలర్ల మోజు ఎల్లవేలలా ..తగ్గదు దలార్ల(consultants)ఫోజు అన్నివేళలా
క్షణక్షణం వీసాల గోల అనుక్షణం H1Bల లీల
పచ్చ కార్డుల కై కొందరి బెంగ పౌరసత్వంకై మరికొందరి బెంగ
ప్రాజెక్టులకై కొందరి నిరీక్షణ నిలకడకై మరి కొందరి నిరసన
లాంటి చిత్ర విచిత్ర సమస్యల వలయంలో ఎన్నొ ఎన్నెన్నో..

సమస్యల నుండి
భారతీయులందరూ బయటపడి స్వేచ్చగా ఆనంద జీవితం గడపాలని మనసారా ఆకాంక్షిస్తూ

దీపావళి శుభాకాంక్షలతో..

-చంద్ర