30, డిసెంబర్ 2020, బుధవారం

 ప్రవాసజనుల ముందు అహహ్హ

ప్రవాసజనుల ముందు ప్రధాన ఎన్నికందు

ఆ నోటి దూల రేడు బఫూను అయ్యె నేడు

అహహ్హ హహ్హ హహ్హ

అహహ్హ హహ్హ హహ్

అహహ్హ హహ్హ హహ్

..

పైపైకి డప్పు కొట్టు  తన పన్ను కడితె ఒట్టు

దివాల తీసినోడు అహహ్హ హహ్హ హహ్హ

ఈవాల ఓడినాడు   

ప్రవాసజనుల ముందు ప్రధాన ఎన్నికందు

ఆ నోటి దూల రేడు బఫూను అయ్యె నేడు

అహహ్హ హహ్హ హహ్హ

అహహ్హ హహ్హ హహ్

అహహ్హ హహ్హ హహ్

..

సరిహద్దులందు గొడవ సరసాలయందు భడవ

మసాల మందు మగువ అహహ్హ హహ్హ హహ్హ

కసాయి కంటె తెగువ

ప్రవాసజనుల ముందు ప్రధాన ఎన్నికందు

ఆ నోటి దూల రేడు బఫూను అయ్యె నేడు

అహహ్హ హహ్హ హహ్హ

అహహ్హ హహ్హ హహ్

అహహ్హ హహ్హ హహ్

..

జగడాల సార్వభౌమ జగమంత లేని ధీమా

వాదాలు కట్టిపెట్టు ..అహహ్హ హహ్హ హహ్హ

వైటౌసు వదిలిపెట్టు

ప్రవాసజనుల ముందు ప్రధాన ఎన్నికందు

ఆ నోటి దూల రేడు బఫూను అయ్యె నేడు

అహహ్హ హహ్హ హహ్హ

అహహ్హ హహ్హ హహ్

అహహ్హ హహ్హ హహ్


26, డిసెంబర్ 2020, శనివారం

merupu kalalu song parody-on mukunda

నా మాట అంటే మా ఇంటా బైటా హడలే నా పేరు పలుక ఏ రౌడీకైన దడలే.."2"
ఆటల్లో పోటెవరూ పాటల్లో ధీటెవరూ బత్తలవారింటి బంగారం
జగమెల్లా ఎంచే మడుగు మా ఊరే జమ్మలమడుగు కన్నోళ్ళ మాట దాటదు అడుగు
పుట్టింట సాగే రాణీలా వైభోగం పలికింది ఎదలో సన్నాయి సందడి మేళ తాళం  'నా మాట అంటే "

పూలు అర్పించో పూజ సిద్ధించో మురిసి విన్నాదీ గుడిలో
కన్ను కలిపిందో వన్నెలిసిరిందో కెవ్వు మన్నాదే ఒడిలో ..
అందాల నానీ ఈ అందాల నానీ ఆపిదప సన్నీ ఆపిదప సన్నీ కలలన్నీ పండించగా
మురిపాల ముద్దులపాపల తల్లిగ ఎంతో హాయి ఆ ఇంటికోడలుగా ...

ముకుందా ముకుందా  ముకుందా ముకుందా
అనుకుంటే సాధించేసె అందమే ఈ ముకుందా "2"

నా మాట అంటే మా ఇంటా బైటా హడలే నా పేరు పలుక ఏ రౌడీకైన దడలే..

కాలాలు ఏమైనా దూరాలు ఏవైనా కొలువుంటే విలువ కదా..
పంతులుగ బడిలోన పైకెదిగే ఘనతున్న బంధాలు సంకెళ్ళయ్యే..
పంధాలు మారి నా పంతాలు వీడి పంధాలు మారి నా పంతాలు వీడి ఏదో కసి తరుముతుంటే
సొంతంగా మొదలేబెట్టి శాంతంగా పదునేబెట్టే మగువల జిమ్నాసియం ...

ముకుందా ముకుందా  ముకుందా ముకుందా
అనుకుంటే సాధించేసె అందమే ఈ ముకుందా "2"

నా మాట అంటే మా ఇంటా బైటా హడలే నా పేరు పలుక ఏ రౌడీకైన దడలే..

 

Eto vellipoyindi -Parody

 ఎటొ వెళ్ళిపోయింది జుట్టు...(2) ఇలా బోడి అయ్యింది ఒట్టు


ఓ మేనమామా నీకిది న్యాయమా కరుణించలేదె నా అందాల భామా

అందాల భామా అందాల భామా...

||ఆ ఈడులో రాయాలనీ ఏ నూనెలూ చెప్పలేదూ

రాలేందుకే షాంపూలను వాడానని తెలియలేదు

విలువ తెలిశాక ఊడిపోయాక వేదనే చెందా ఇంతలా..

ఎటొ వెళ్ళిపోయింది జుట్టు.. ఇలా బోడి అయ్యింది ఒట్టు

ఓ మేనమామా నీకిది న్యాయమా కరుణించలేదె నా అందాల భామా

అందాల భామా అందాల భామా...

||మునివేళ్ళతో దువ్వాలనీ చెలి ఆశలే తీరలేదు... 

మనసారగా మది కోరికా తలయంటుడే నేర్వలేదు

చెలియ కలిసాక చెలిమి కుదిరాక జీవితం ఎంతో హాయీలే..

ఎటొ వెళ్ళిపోయింది జుట్టు... ఇలా బోడి అయ్యింది ఒట్టు

ఓ మేనమామా నీకిది న్యాయమా కరుణించలేదె నా అందాల భామా

ఆ హాహాహా...మనసు...ఇలా బోడి అయ్యింది వయసు ..

ఓ మేనమామా నీకిది న్యాయమా కరుణించలేదె నా అందాల భామా

అందాల భామా అందాల భామా...హా హా హాహ.... 

Badri Parody song -vayaari bhaamaa..

 ఓ ఇలియానా నా అలివేణా


ఎందుకే ఈ రుస రుస విసురులు

కొడితే బోరూ కొట్టా బీరు

కసరకే నా చెలి బంగారు 

కరోన నీకంటె నయమే నీవంటే నా కంట భయమే

ఇంట ఉంటే నీతో రిస్కూ బైట ఉంటే మూతికి మాస్కు

ఓ ఇలియానా నా అలివేణా

ఎందుకే ఈ రుస రుస విసురులు

కొడితే బోరూ కొట్టా బీరు

కసరకే నా చిట్టి బంగారు

అరె ఎన్ని నగలే ఇచ్చా దొరసానికి కనబడదేం

తన ఎన్ని వగలో మెచ్చా మహరాణికి దయలేదే 

పెగ్గు ఏస్తే సరదాగా ఇంతలా పోరా

కాస్తైనా కరుణలేదే ఏమిటా పొగరు...?

WHY DOES SHE SCOLD TO ME?

Friends:తిట్టకుంటే ఎక్కిన మందు దిగదుగా?

WHY DOES SHE SHOUT TO ME?

Friends:కొట్టకుండా వదిలెస్తే మంచిదిగా? "ఓ ఇలియానా"

 విరహ గీతం : Jackey song parody


అలా దూరమవకే నా చెలీ 

అగాధాల మంటే ఆరనీ  

నింగినొదిలి ఓ క్షణమైనా 

నిలవలేదు జాబిలి మైనా 

దరికి చేరె దారే తెలుసుకో 

కలికి చిలక మనసై మసలుకో "అలా" 


కోరి చేసుకున్నా తీరు మార్చుకున్నా

అలరించు కుసుమం వికసించలేదు 

కనులు నీరు కారి కవితలాగ మారి 

భావ వేదనంతా నివేదించలేను 


ఎలా చెప్పగలనో గుండెలోని ప్రేమ

నులివెచ్చనైన కౌగిళ్ళ భామా  

విరహాన గేయాలు కలహాన గాయాలు 

మదిలోన సుడి రేపకే ఎదలోన గుడికట్టితే "అలా" 


తీగనిడిచి పువ్వు నన్ను విడిచి నువ్వు 

నేల విడిచి సాము చేసినట్టులే  

కడుపు తీపి కోసం కన్నవారి కోసం

కట్టుకున్నవాన్నే బలి చేయకే 

నీరెండ తాపం నిట్టూర్చె పంతం 

తడిచూపులోన చిగురించు బంధం  

మేఘాల మబ్బుల్లో మోహాల సిగ్గుల్లో  

జతగూడు సయ్యాటలో చవిచూడు స్వర్గాలనే .. "అలా" 


 


స్థైర్యం

ఇల జగతిలోన సెలయేరులాటి ఓ చల్లని మనసు...

ఆదిలో పిల్ల కాలువలా పరుగులు తీస్తూ 

వింతైన ఈ కొత్త లోకాన్ని చూడ గగనాన విహరింప ఊహా ఊయలలకు సిద్దమవుతుంది.

ఆ ప్రవాహానికేమి తెలుసు?

మున్ముందు రాళ్ళు రప్పలు చెట్టూ పుట్టలతో చెట్టాపట్టాలెయ్యాలని..

ఆశనిపాతంలా సుడిగుండాల్లో చిక్కుకుంటూ చిక్కి చిత్రవధ చెందుతానని..

కానీ విధిని సైతం సవాలు చేస్తూ మొక్కవోని స్థైర్యంతో 

పక్కనుండి జాలువారే హేమంతపు హిమానీ నదాలే తోడవుతాయని..

ఆ స్నేహ ఉరవళ్ళ పరవళ్ళలో ..ఎదురొచ్చే బండరాళ్ళను 

మెడనపడ్డ గుదిబండలను సైతం తన గుండె ధైర్యంతో తొక్కేసుకుంటూ 

తనే రహదారి నిర్మించుకుంటూ ఆ సముద్రగర్భాన కలవాలని..

ఏనాటికైన ఆ చల్లని మనసు తన ఊహా తీరాలని చేరాలని..

కోరుకుంటూ..