7, డిసెంబర్ 2012, శుక్రవారం

దీపాల జాగరణ!!!


సాన్వి మరణానికి ముందు తప్పి పోయిందన్న ఆవేదనతో రాసిన కవిత..


ఆనందంగా అడుగుపెట్టె అమెరికా దేశాన

మాటలు రాని మనవరాలితో మనసుతీరా ఆటాడే తరుణాన

పాలబుగ్గల పసిపాప పడి పడి లేస్తూ పరుగులుతీసే ప్రాయాన

ముచ్చటలాడె ముద్దుగువ్వకు ముప్పు ముందున్నది ఎఱుగని సమయాన  

అక్రమంగా అగంతకుడు ఇంట్లో అడుగెట్టిన  ఆవాంతరాన

పాపాత్ముడు పాపని చేజిక్కుంచుకొని పరుగెత్తే సమయాన

పాలుపోని తల్లి దిక్కులు పిక్కటిల్లేట్టు గర్జించినా

ఆదుకొనే నాధుడికోసం అర్తనాదాలు పెట్టినా

ప్రాణాలకు తెగించి పసిపాపను కాపాడే ప్రయత్నంజేసినా

కత్తిపోట్లకు  సైతం బెదరక ఆ నీచున్ని నిలువరించినా

చివరకు నేలకొరిగింది పసిపాప సాన్వి మిస్సయ్యింది

అమ్మా నాన్నల గుండె చెరువయ్యింది పసిగుడ్డు పాపాత్ముడి చేరువయ్యింది

తిరిగిరాలేని లోకానికేగిన ఆ అమ్మ కొరకు దుఃఖించాలో

తిరిగొస్తుందన్న తన తింగర బుజ్జి కోసం ఎదురుచూస్తూ ఏడ్వాలో..

సాటి మనిషిగా మన తెలుగువాడి హృదయ వితరణ

వెయ్యేళ్ళు వార్ధిల్లాలని వెన్న(సాన్వి)

వెయ్యిన్నొక్క దేవుళ్ళకు చేద్దాం ప్రార్థన చిట్టి తల్లి చేరాలి తల్లి చెంతన..

కరుణతో కదలిరండి కనిపించని సాన్వి కొరకు చేద్దాం దీపాల జాగరణ!!!

దసరా శుభాకాంక్షలతో..

ఎక్కడో సుదూర తీరాలలో నివాసం
 బతుకుదెరువు కోసం బయటపడ్డాం
 డాలర్ల మోజులో దూరమయ్యాం
 పండుగలు పబ్బలకు కడు దూరం
 అయినవారికి ఆత్మీయతలకు ఎంతో దూరం
 ఆత్మీయ అనుబంధాలకు ఎదురు చూడడం
 పన్నెత్తి పలకరిస్తే పరమానందం
 మనసువిప్పి మాటాడితే మహానందం
 సరదాల దసరా పందిరిలో ఎంతో సంతసం
 అసమాన సాంప్రదాయాలకు ఆలవాలం
 తెలుగు సంస్కృతి తెలుగువారికిచ్చిన ఓ దివ్యవరం
 మన సంస్కృతి సాంప్రదాయలను మరవకండి తరువాతి తరం వారికి చాటి చెప్పండి తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపజేయండి -దసరా శుభాకాంక్షలతో.. చంద్ర

లక్ష్మీ నారాయణ కన్నా -పేరడీ పాట

ఈ పాట "నీ పాదము మీద" అంటూ అన్న చెల్లి మీద ఆనాడు నారాయణ మూర్తి సినిమాలో పాడారు నేడు కన్నా లక్ష్మీ నారాయణగారు వాషింగ్టన్ విచ్చేసిన సంధర్భంగా ఆయన గురించి కాసింత విషయం మా స్నేహితుని ద్వారా గ్రహించి ఆ పాటకి పేరడీ గా రాయడం జరిగింది.

 దేశంలో ఉన్న లక్షల మంది నేతల కన్నా..లక్ష్మీ నారాయణ కన్నా గొప్పవారిలో ఒకరని నే విన్నా.. రాజకీయాల్లో రణధీర ఓటమన్నదెరుగని మగధీర మన రంగయ్యగారి కన్న ఈ ..లక్ష్మీ నారాయణ కన్నా.

 పల్లవి :
తెలుగు జాతి నీ చరితను మరువదు లక్ష్మన్నా..
సాటి తెలుగోడి మల్లే చాటి చెప్పుతా లక్ష్మన్నా..
తెలుగు జాతికి వెలుగు నింపుతూ పేదవారి కడుపు నింపుతూ…..”తెలుగు జాతి నీ ”
 చరణం:1
 రంగయ్య గారి కన్న బిడ్డగా కన్నావారి ఇంటి బిడ్డగా..
కాలేజి రోజుల కాలము నుండే కార్మిక శక్తిగా ఎదిగిపోతివి
ఎదుగుతున్న నిన్ను ఓర్వలేక ఓరన్నా…ఎదురు నిల్వలేక ఎనకేటేసిరి లక్ష్మన్నా..
కత్తిపోట్లకు గురి అయ్యావే మా అన్నా…కొన వూపిరితో కోలుకుంటివా ఓ కన్నా…

 పేదవాడి కల్పతరువులా..పెద్దవాడికి కంటగింపులా.
 తెలుగు జాతి నీ చరితను మరువదు లక్ష్మన్నా.. సాటి తెలుగోడి మల్లే చాటి చెప్పుతా లక్ష్మన్నా..

 చరణం:2
పెద్ద నేతవై ఎదిగిన నుండి వృద్ధనేతతో అడ్డంకులెన్నో..
వామన మూర్తిని భక్తిగ కొలిచి వంగవీటి దారిలో నడచి
చమట తడినే సాగు తడిపిన రైతన్నా కన్నా రాకతో కష్టాలన్నీ తీరన్నా
 పాదు పాదుకు ప్రాణంపోసే రైతన్నా పేదల పాలిటి పెన్నిధిరా మన లక్ష్మన్నా
 పేదరైతుకు కల్పతరువులా..పెద్దరౌతుకు కంటగింపులా...
 తెలుగు జాతి నీ చరితను మరువదు లక్ష్మన్నా.. సాటి తెలుగోడి మల్లే చాటి చెప్పుతా లక్ష్మన్నా..

పెళ్ళి చూపులు

ఎన్నో ఒడిదుడుకులు మన జీవిత పుష్కరాన..

 ఎప్పటికీ మరవలేను ఏ చిన్ని జ్ఞాపకమైనా..

 ఇప్పటికీ గుర్తే పెళ్ళి చూపుల్లో నిను చూసిన తరుణాన..

 లేని సిగ్గు దొంతరలు అలుముకొన్న ఆ నగుమోమున..

 రాని గంభీరతనాన్ని పులుముకొనాలన్నా... చూపలేని ఆ నెలవంకన..

 చెరగని చిరునవ్వుని ఆపాలన్న నీ వ్యర్థప్రయత్నాన్ని

 విరమించి ..దాచలేని దరహాసంతో దరిజేరిన నిను చూసి

 లిప్తపాటు విభ్రాంతుడనై మది తేరుకొని కనులు మూసుకొన్న..

 నా మదిలో కొటి వలపుల తలపులు రేపి నిను చూడకూడదు

అన్న క్షణాలను మటుమాయంజేసి కన్నెత్తి చూడాలని పన్నెత్తి పలకరించాలని

 క్షణకాలం తటపటాయించి .. కాటిక దిద్దిన ఆ కళ్ళని ఆడిగా..కాటాక్షించే మీనాక్షివి నీవేనా అని?

 మెరుగులు దిద్దిన నీ మేనును అడిగా దివినుండి దిగొచ్చిన దివ్యభారతివా అని?

 తడి ఆరని నీ పెదవులనడిగా మచ్చ ఎరుగని ఈ చంద్రుడిని ఎచటనైన కాంచావా అని?

 ఉలుకు పలుకూలేక నన్నే క్రీగంట చూస్తున్న నీ కనుపాపని అడిగా..మీ పాపకు నే నచ్చానా అని?

 మౌనంగా చిరునగవుతో నీ అమోదముద్రని అందజేసిన నీ మనసుకు చెప్పా ఈ రేరాజు నీవాడేనని..