30, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగుదనం..!!

ధరిత్రి మరవని చరిత్ర మన తెలుగుదనం...
జగతి తెలుగు జాతికి అందించిన మూల ధనం ..
శతాభ్దాల తెలుగు జాతి గొప్పతనం..
కవిత్రయమందించిన మధుర కావ్యం..
వెన్నెల చల్లదనం, సూరీడు వెచ్చదనం ,తేనె తీపి తెలుగుదనం
వెలకట్టలేనివన్నది కాదనలేని నగ్న సత్యం ..
అలాంటి తెలుగు తల్లి గడ్డన నేడు ..
రావణకాష్టం రగిలిస్తున్న రాజకీయ రాబందులను
అడుగడుగున తెలుగు తల్లిని అవమానిస్తున్న వేర్పాటు వాదులను..
ఆ తల్లి వలువలు వలిచి విలువలు విడిచి సిగ్గుతో తలదించుకొనేట్టు చేసిన తార్చుడుగాల్లను
తెలుగు ఆత్మ గౌరవాన్ని ఆయకమొనర్చే అరాచక కీచకులను
విచక్షణ ఙ్ఞానరహిత వితండవాదుల విగ్రహాల విధ్వంసాలను..
ఉద్యమాల పేర దమన నీతులు వల్లిస్తున్న నయవంచక నేతలను...
నేతల చేతిలో బతుకు బండగా మారి బలైపోతున్న బడుగు ప్రజల బాధలను..
బూటకపు మాటలతో నోట్ల కట్టల మూటలతో నిర్వీర్యం చేసిన యువతను
దగాకోరుమాటలతో దళారి చేతలలో దగాపడ్డ విద్యాకుసుమాలను..
"మా తెలుగు తల్లి" పాఠ్యాంశాన్ని పరిత్యజించమంటున్న పాలకులను…………… ,
కాంచిన తెలుగు తల్లి కన్నీరవ్వగా..తడి ఆరని కళ్ళతో భారత మాత ..కన్నీరు తుడవగా..
మురిసిన తెలుగు తల్లి తడిసిన కనులతో ముసి ముసి నవ్వులతో
భరతమాత ఒడిలో సేదదీరి తన నుదుట చుంబించిన "సమైక్య" పు ముద్దుతో
అంధ్రా(AP)ప్రజల గుండెల్లొ అజరామరం నిలిచింది..తెలుగుజాతి యావత్తు పులకించింది ..

కామెంట్‌లు లేవు: