10, జనవరి 2012, మంగళవారం

కొత్త పెళ్ళి కొడుకు

పదహారు ప్రాయాన పరువాలు పరవళ్ళు తొక్కువేళ
పరికిణీ లో తడిక మాటున పొంచి నను కాంచి
పైట చెంగు పంటి కింద నలుపుతూ చూసిన తన
కను రెప్పలు నను తిప్పలు పెట్టిన వేళ
ఎరుపెక్కిన ఆ చెక్కిళ్ళు సైతం గులాబీ కే గుబులు పుట్టించిన వేళ
సొట్టపడ్డ ఆ బుగ్గలతో తనకే సొంతమైన ఆ కన్నులతో
కాటుక దిద్దిన కళ్ళతో మాటకు ముందే చిందే నవ్వుతో
సాంతం శాంతమైన స్వరంతో నిండు ఎద భారంతో
వంటిపొర అందాలతో వంటినంటిన వయ్యారంతో
తడి ఆరని పెదాలతో పొడి బారిన పదాలతో
ముత్యాల పలువరుసతో ముక్కున మెరిసిన రత్న పుడకతో
పలికిన ఆ తొలిపలుకులు... నా ఎదలో రేపింది ఓ అలజడి
అలజడి మాటున దాగున్న కోర్కెల ఉరవడి
ఉధృతమైనవి ఉప్పెనలా ఎగిసిపడి ....మరుక్షణం
చూసిన తన చల్లని చూపుతో చల్లబడి
పెద్దల వద్దకు పరుగిడి ఆమోద ముద్రకు అవస్తపడి
మంచి ముహూర్తాలు కొరవడి చెట్టా పట్టాలకు కోతపడి
పెద్దల మాటకు కట్టుబడి హద్దుల మాటున కంటబడి
ముద్దు ముచ్చట్లకు ఎగబడి వద్దు వద్దంటున్నా ఆత్రపడి
కళ్యాణవేళ కలవరపడి తాళి కట్టువేళ తలంబ్రాలుపడి
చెలి చెంగున ముడిపడి క్రీగంటి చూపుకు తడబడి
దేవతలచే దీవించబడి అయినవారిచే అశీర్వదించబడి
అత్తగారింట్లో అడుగిడి మొదటి రాత్రి ఏర్పాట్ల హడావిడి
మల్లెల గదిలో జొరబడి చల్లని గాలిలో చమట తడి
ఏకాంతవేళకు వేగిరపడి తన కాంత రాకకై త్వరపడి
ఎదరున్న శ్రీమతి సిగ్గుపడి సొట్టపడ్డ బుగ్గలు ఎర్రబడి
రారాజు చేయిపడి రేరాజు మబ్బుల చాటుకిడి
ఇన్నేళ్ళ బ్రహ్మచర్యానికి తెరపడి ..రాబోయే వసంతాలకు ఆహ్వానం
పలుకుతూ ... ఎదురుచూస్తున్న ..కొత్త పెళ్ళి కొడుకు

4 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

అత్యద్భుతం! కళ్ళకు కట్టినట్టు వర్ణించారు!

జ్యోతిర్మయి చెప్పారు...

అంతా బాగానే ఉంది మాస్టారూ..మరీ పదహారంటే లీగల్ ప్రాబ్లెమ్స్ ఉంటాయేమో చూసుకోండి...
(just kidding)
చాలా బాగా వ్రాశారు..

Disp Name చెప్పారు...

Lights off,
Take One Shot Two

cheers
zilebi.

sarma చెప్పారు...

నాయనా! ముందు మనసు పారేసుకున్నావు. ఆ తరవాత బుర్ర కూడా పారేసుకున్నావు. నీ బతుకిక........