5, జూన్ 2013, బుధవారం

విశాల భారతం!!!'.


విశాల భారతావనిలో విషాద ఘట్టం

జనసంద్ర కూడలి లో మరో నెత్తుటి మట్టం

నెత్తురిడిన క్షేత్రమంతా చిత్తైన దేహాల ఉత్పాతం

చిత్తైన దేహాల నడుమ ఛిద్రమైన అంగాంగాల తుది రూపం

ఉగ్రవాద నరవ్యాఘ్రాలు నెరిపిన దాడుల పర్వం

భీకరిల్లే శబ్ద సాంకేతికతో తీవ్రవాదుల ప్రచోదనం

హాహాకారాలతో ఉరకలెత్తి తప్పించుకోజూసిన జనం

కానరాని లోకాలకు కడతేరిన క్షతగాత్రుల వైనం

వరుస పేలుళ్ళతో జరిగిన మారణ హోమం

మారని ఉన్మాదాలకు నిలువెత్తు సాక్షాత్కారం

కానలలోని క్రూరమృగాలు ఈ తీవ్రవాదుల కంటే ఎంతో నయం

అశ్రు నయనాలతో జనాల నీరాజనం

భరతమాత చెక్కిలిపై మరో విలయ-అంకం

ఇలాంటి దుర్ఘటనలను అడ్డుకోలేని ప్రభుత్వం

అదుపులేని యంత్రాంగం ,ఒడుపు లేని నాయకత్వం

చేవచచ్చిన ప్రజా చైతన్యం ,శవాలవోలె యువత నిర్వీర్యం

దిశా నిర్దేశం చేయలేని నాయకుల ధౌర్భాగ్యం

ఈ కళ్ళతో చూడగలనా ఈ తీవ్రవాదుల అంతం?

ఈ బొందిలో ప్రాణముండగా నెరవేరునా నా కలల భారతం ?
నా కలల భారతం:

'కలకాలం పరిఢవిల్లే పచ్చదనాల భారతం!!!,

భారత కీర్తి విరాజిల్లే విశాల భారతం!!!'.

కామెంట్‌లు లేవు: